మూడేళ్లలో ఆస్పత్రు రూపురేఖు మారుస్తాం

వైఎస్‌ఆర్‌ కంటిమెగు మూడో విడతను ప్రారంభించిన జగన్‌

కర్నూు: వైఎస్‌ఆర్‌ కంటిమెగు మూడో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కర్నూులో ప్రారంభించారు. నూతనంగా నిర్మంచనున్న ఆరోగ్య ఉపకేంద్రాకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మార్చి 1 నుంచి అవ్వ, తాతకు కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు జగన్‌ తెలిపారు. కంటి పరీక్షు నిర్వహించి అవసరమైన వారికి వాంటీర్ల ద్వారా ఇంటి వద్దే కళ్ల జోళ్లు అందిస్తామని చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రు రూపురేఖు మారుస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ‘నాడు-నేడు’కు ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. అవసరమైన చోట కొత్త ఆస్పత్రును ఏర్పాటు చేస్తామని వ్లెడిరచారు. జాతీయ ప్రమాణాకు అనుగుణంగా, కార్పొరేట్‌ ఆస్పత్రుకు దీటుగా రూ.15,337 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రును తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక బోధనాస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే వైద్యు లేరనే మాట వినిపించకూడదని సీఎం అన్నారు.

కర్నూులో ఘన స్వాగతం

ఓర్వకల్‌ ఎయిర్‌పోర్టు నుంచి కర్నూు ఏపీఎస్పీ బెటాలియన్‌ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం భించింది. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి జయరాం, ప్రభుత్వ విప్‌ గంగు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ సంజీవ్‌కుమార్‌, పువురు ప్రజాప్రతినిధు, అధికాయి  సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.