వైభవ శోభా‘యాత్రకు తరలి రండి’..!

  • రాజమండ్రిలో తెలుగు భాషా వైభవ శోభా యాత్ర
  • విజయవంతానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలి
  • వైసిపీ యువనాయకులు జక్కంపూడి గణేష్‌ ‌పిలుపు

రాజమండ్రి,జ్యోతిన్యూస్‌ :

జనవరి 5,6,7వ తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలను పురస్కరిచుకుని జనవరి 2వ తేదీన రాజమండ్రిలో జరిగే తెలుగు భాషా వైభవ శోభా యాత్రకు విద్యావంతులు,తెలుగుభాషాభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వైసిపీ యువనాయకులు జక్కంపూడి గణేష్‌ ‌పిలుపునిచ్చారు.శనివారం ఆంధ్ర సారస్వత పరిషత్తు ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గణేష్‌ను కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గణేష్‌ ‌మాట్లాడుతూ జనవరి 2వ తేదీన తెలుగు భాషలోని 25 సాహితీ పక్రియల సాహితీ మూర్తుల చిత్ర పటాలను ప్రదర్శిస్తూ వేలాదిమంది విద్యార్థులు తెలుగు వైభవాన్ని చాటుతూ రాజమండ్రి పురవీధుల్లో ముందుకు సాగుతారని వివరించారు.దండిమార్చ్ ‌సర్కిల్‌ ‌నుంచి పుష్కర్‌ఘాట్‌ ‌వద్ద శ్రీ రారాజనరేంద్ర విగ్రహం వరకు నిర్వహించే ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి రాజమండ్రి ప్రముఖులు, విద్యావేత్తలు, అభిమానులు, విద్యార్ధులు అఖండ సంఖ్యలో తరలిరావాలని కోరారు. జనవరి 5,6,7వ తేదీల్లో రాజమండ్రి గైట్‌ ఇం‌జినీరింగ్‌ ‌కళాశాల ప్రాంగణంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌, ‌చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి తమవంతు చేయూతనివ్వగలమని జక్కంపూడి గణేష్‌ ‌తెలిపారు.