వైభవంగా‘వైభవ శోభా యాత్ర’

  • పురవీధుల్లో ఘనంగా తెలుగు భాషా వైభవ శోభా యాత్ర
  • రాజమండ్రిలో విద్యార్ధుల భారీ ర్యాలీ

రాజమండ్రి,జ్యోతిన్యూస్‌ :

జనవరి 5,6,7వ తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలను పురస్కరిచుకుని మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలోని పూరవీధుల్లో అత్యంత వైభవంగా తెలుగు భాషా వైభవ శోభా యాత్రను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్ధులు,తెలుగు అభిమానులు,సాహితీ మూర్తులు, రాజకీయనేతలు, విద్యా, వ్యాపారవేత్తలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యా సంస్థలు, ఆంధప్రదేశ్‌ అన్‌ ఎయిడెడ్‌ ‌పాఠశాలల యాజమాన్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో తెలుగు భాషలోని 25 సాహితీ పక్రియల సాహితీ మూర్తుల చిత్ర పటాలను ప్రదర్శిస్తూ వేలాదిమంది విద్యార్థులు తెలుగు వైభవాన్ని చాటారు. దండిమార్చ్ ‌సర్కిల్‌ ‌నుంచి పుష్కర్‌ఘాట్‌ ‌వద్ద శ్రీ రారాజనరేంద్ర విగ్రహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీ పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.తెలుగు మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్ధులు కోరారు.ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించగా స్థానిక పార్లమెంటు సభ్యులు భరత్‌ ‌రాం,మునిసిపల్‌ ‌కమీషనర్‌ ‌దినేష్‌ ‌కుమార్‌,ఆం‌ధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు గజల్‌ శ్రీ‌నివాస్‌, ‌చైతన్య విద్యా సంస్థల చైర్మెన్‌ ‌చైతన్యరాజు,యువ నాయకులు జక్కంపూడి గణేష్‌,‌మురళి,బర్ల సత్యనారాయణ, శివాజీ,శ్రీనివాస చౌదరి,వాసు,ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శి రెడ్డప్ప ధవేజీ,కేశిరాజు రాంప్రసాద్‌ ‌తదితరులతో పాటు నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.