మాటల్లేవ్‌..‌మోతల్లేవ్‌..!

  • ‌ముగిసిన నాలుగోదశ ఎన్నికల ప్రచారం
  • శనివారం సాయంత్రం 6గంటలకు మూగబోయిన మైకులు
  • ప్రచారంలో హోరెత్తించిన రాహుల్‌,‌ప్రియాంక,నడ్డా,అమిత్‌ ‌షా
  • తెలంగాణలో 17 పార్లమెంట్‌ ‌స్థానాలకు పోలింగ్‌
  • ఏపీలో 17 అసెంబ్లీ,25 పార్లమెంట్‌ ‌స్థానాలకు ఎన్నికలు
  • జోరుగా ప్రచారం చేసిన చంద్రబాబు,పవన్‌,‌మోడీ,జగన్‌
  • ‌రెండు రాష్ట్రాల్లోనూ మూతపడ్డ మద్యం,కల్లు దుకాణాలు

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌:
‌దేశవ్యాప్తంగా నాలుగోదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది.తెలుగు రాష్టాల్రైన ఏపీ,తెలంగాణలో కూడా మైకులు మూగబోయాయి. చివరి రోజున ప్రచారాలతో హోరెత్తించారు.చివరి రోజు అమిత్‌ ‌షా,నడ్డా,రాహుల గాంధీ,ప్రియాంకలు ప్రచారంతో మోరెత్తించారు.జగన్‌,‌చంద్రబాబు.,పవన్‌ ‌కళ్యాణ్‌లు కూడా ప్రచారంలో దూసుకుపోయారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు దశల్లో 285 లోక్‌సభ సెగ్మెంట్లలో పోలింగ్‌ ‌పూర్తయ్యింది. మే13 సోమవారం రోజున నాలుగో విడతలో 10 రాష్టాల్ల్రోని 96 లోక్‌ ‌సభ స్థానాలకు పోలింగ్‌ ‌జరగనుంది. అలాగే ఎపిలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. మొత్తం 175 స్థానాలకు పోలింగ్‌ ‌జరుగనుంది. జూన్‌ 1‌న సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌పై ఈసీ నిషేదం విధించింది. మరోవైపు తెలుగు రాష్టాల్ల్రో వైన్‌ ‌షాపులు బంద్‌ అయ్యాయి. లోక్‌ ‌సభ ఎన్నికల క్రమంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. పోలింగ్‌ ‌జరిగే మే 13వ తేదీ సాయంత్రం వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. కల్లు కంపౌండ్‌లు కూడా ఓపెన్‌ ‌కావు. పోలింగ్‌ ‌ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్‌ అవుతాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక తెలంగాణ నుంచి లోక్‌ ‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు.అత్యధికంగా సికింద్రాబాద్‌లో 45 మంది,ఆదిలాబాద్‌ ‌లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే .. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387మంది పోటీలో నిలిచారు.ఈ క్రమంలో తెలుగు రాష్టాల్ల్రోలోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు, ఏపీలో 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 13న పోలింగ్‌ ‌జరగనున్న విషయం తెలిసిందే. అత్యంత సమస్యత్మాక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ప్రచారం నిలిపివేశారు. రాష్ట్రంలోని మిగతా 169 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వెలువడిన తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు దాదాపు 90 ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా, జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌, ‌తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.తెలంగాణలోని 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ‌జరగనుంది. ఓటింగ్‌కు నిర్దేశించిన సమయం ప్రకారమే శనివారం సాయంత్రం ప్రచారానికి గడువు ముగిసింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌,‌భారాస,భాజపాలు అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌ ‌సహా అనేకమంది ముఖ్యనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని 16 స్థానాల్లో మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎం కీలకంగా ఉంది. నామినేషన్ల పక్రియ ప్రారంభం కాకముందే మూడు పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. బహిరంగ సభలు, కార్నర్‌ ‌టింగ్‌లు, సమావేశాలు, రోడ్‌షోలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. కొన్ని ప్రాంతాల్లోనే అభ్యర్థులు ఇంటింటికీ తిరిగారు. ఎండల ప్రభావంతో ఉదయం, సాయంత్రం వేళల్లోనే నేతలు కనిపించారు. చివరి రెండు రోజులు వాతావరణం కొంత చల్లబడింది. ప్రచారంలో మాత్రం వాడీ వేడి పెరిగింది. చివరిరోజు సిఎం రేంవత్‌ ‌రెడ్డి ప్రియాంకతో కలసి కామారెడ్డిలో ప్రచారం ముగించారు. కెసిఆర్‌ ‌డియా సమావేశంతో తన ప్రచారం ముగించారు. కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావులు గతంలో కన్నా మిన్నగా ప్రచారంలో దూసుకుపోయారు. బిజెపి నేతలు కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌, అర్వింద్‌, ఈటెల రాజేందర్‌ ‌కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు.