పర్యాటకాభివృద్దికి చర్యలు : కిషన్‌రెడ్డి

ములుగు,జ్యోతిన్యూస్‌ :
‌రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌తో కలిసి పలు ఆలయాలను దర్శించారు.ముందుగా గట్టమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం హరిత గ్రాండ్‌ ‌గట్టమ్మ హోటల్‌ను ప్రారం భించారు.ఇక్కడ నుంచి వెంకటాపూర్‌ ‌మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయానికి చేరుకొని రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రామప్ప దేవాలయం శిల్పకళ నైపుణ్యాన్ని గైడ్‌ ‌ద్వారా మంత్రులు తెలుసు కున్నారు. అలాగే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ శిలాఫలకం ఆవిష్కరణ, ప్రజా మౌలిక సదుపాయాలను కేంద్ర మంత్రి ప్రారంభోత్సవం చేశారు.వారి వెంట టూరిజం రాష్ట్ర టూరిజ ం కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ శ్రీ‌నివాస్‌ ‌గుప్తా,ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్కమాట్లాడుతూ రామప్ప అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,యునొస్కొ ప్రతినిధులు ఇచ్చిన గడువు లోపు అభివృద్ది పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్‌ ‌రెడ్డికి రామప్ప దేవాలయం అభివృద్ధికి కృషి చెయ్యాలని సీతక్క లేఖను అందజేశారు.
………………………….