చూస్తూ ఊరుకోం…

  • అధికారం దక్కలేదనే ప్రభుత్వంపై కుట్ర
  • కులాల మధ్య చిచ్చు పెట్టే యత్నాలు
  • సంక్షేమ పథకాలు అడ్డుకుంటూ కోర్టుల్లో కేసులు
  • అక్కసుతో పథకం ప్రకారం కుట్రపూరిత చర్యలు
  • ఏపీని డ్రగ్స్ ‌కేంద్రంగా చూపించే దుర్మార్గపు ఆలోచన
  • ప్రతిపక్షాల తీరుపై పరోక్షంగా మండిపడ్డ సీఎం జగన్‌

విజయవాడ,జ్యోతిన్యూస్‌ :
‌ముఖ్యమంత్రిని దారుణంగా బూతులు తిడుతూ.. సీఎంను అభిమా నించే వాళ్లు తిరగబడి.. తద్వారా గొడవలు సృష్టించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోందన్నారు. అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్‌ ‌పరోక్షంగా ఆరోపించారు. సంక్షేమ పథకాలకు అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసుల బాగోగుల గురించి ఆలోచించామన్నారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని.. వారికి కూడా విశ్రాంతి కావాలన్నారు. వీక్లీ ఆఫ్‌ను మొదటిసారిగా ప్రకటించిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. హోంగార్డులకు గౌరవ వేతనాన్ని కూడా పెంచామని.. కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యాంశమని చెప్పారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా జగన్‌ ‌మాట్లాడారు. కేవలం అక్కసుతో పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్రచేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలోని పిల్లలను డ్రగ్‌ అడిక్టస్‌గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇది అత్యంత తీవ్రమైన నేరం.. అధర్మం. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం, డీఆర్‌ఐ ‌వివరణ ఇచ్చినా.. విజయవాడ సీపీతో పాటు డీజీపీ సైతం ఆ ఆరోపణలు అబద్దాలు అని పదేపదే చెప్పినా లెక్కలేనితనం, అక్కసుతో వ్యవహరించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకూ వెనకాడట్లేదు. అధికారం దక్కలేదనే ఈ విధంగా చేస్తున్నారు. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుం టున్నారు.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ ‌వి•డియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇది అనైతికం.. అధర్మం.. పచ్చి అబద్ధంఅని అన్నారు. పథకం ప్రకారం.. అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా. అధికార పార్టీ పాలన మెచ్చుకుంటూ ప్రజలు అన్ని ఎన్నికల్లో గెలిపించారు. తనవాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ రాష్ట్రంలో నేరాలు చేసేందుకు యత్నిస్తున్నారు. డ్రగ్స్‌తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ, డీఆర్‌ఐ ‌చెప్పినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ ఏపీ అంటూ పచ్చి అబద్దాలను గోబెల్స్ ‌ప్రచారం చేస్తున్నారు. కొందరు రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలని చూస్తున్నారని జగన్‌ ‌మండిపడ్డారు. ఆఖరికి సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతున్నారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా? గిట్టనివాడు పరిపాలన చేస్తున్నారని ఓర్వలేకపోతున్నారని జగన్‌ ‌ధ్వజమెత్తారు. కార్యక్రమంలో డిజిపి సవాంగ్‌,‌హోంమంత్రి సుచరిత తదితరులు పాల్గొన్నారు.