ఆర్యవైశ్య సంఘ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కుప్పం ప్రసాద్‌

(‌ప్రత్యేక ప్రతినిధి)
ఒంగోలు,జ్యోతిన్యూస్‌ :
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రకాశం జిల్లా మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఏర్పాట్లను ఆంధప్రదేశ్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌, ‌జిల్లా ఎన్నికల అధికారి కుప్పం ప్రసాద్‌ ‌పరిశీలించారు.ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఆయన ఒంగోలులోని వైశ్య భవన్‌ను సందర్శిం చారు. ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా,సాఫీగా,సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించా లని కుప్పం ప్రసాద్‌ ఆదేశించారు. కాగా ఎన్నికల సన్నాహాల గురించి కుప్పం ప్రసాద్‌ ‌కు మండల ఎన్నికల అధికారి కనమర్లపూడి హరిప్రసాద్‌ ‌రావు,మండల కన్వీనర్‌ ‌మిరియాల కృష్ణ మూర్తి,ఎన్నికల సహాయకులు చినిగేపల్లి సురేష్‌, ఆం‌ధప్రదేశ్‌ ఆర్యవైశ్య మహా సభ కార్యదర్శి పల్లపోతు వెంకటేశ్వర్లు, మొదడుగు వెంకటేశ్వర్లు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని కుప్పం ప్రసాద్‌ ‌సంతృప్తి వ్యక్తం చేశారు.