పోటెత్తిన ‘భవానీలు’

విజయవాడ,జ్యోతిన్యూస్‌ :
ఇం‌ద్రకీలాద్రి కొలువైన కనకదుర్గ ఆలయంలో దసరా వేడుకలు ఘనంగా ముగిసాయి. శనివారం నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ భక్తులు భారీగా తరలివచ్చారు. భవానీ భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు రద్దీగా మారాయి. భవానీ భక్తులు భారీగా తరలివస్తుండడంతో శని, ఆదివారాల్లో విఐపి ప్రోటోకాల్‌ ‌దర్శనాలను రద్దు చేసినట్టు,అన్ని సాధారణ దర్శనాలే ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు భారీగా తరలి వస్తుండ డంతో కొండ పైకి వాహనాలను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. రాజరాజేశ్వరి అలంకారం లో కనకదుర్గ అమ్మవారు దర్శన మిస్తున్నారు. భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వైపి ప్రోటోకాల్‌ ‌దర్శనాల రద్దు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించమని తెలిపారు. దసరా ఉత్సవాల్లో లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈవో బ్రమరాంబ అన్నారు. కృష్ణాలో నదీ ప్రవాహం వలన సాయంత్రం దుర్గమ్మ నదీ విహారం లేదన్నారు.హంసవాహనంపై ఆది దంపతులకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తా మని చెప్పారు. మరో రెండు రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుందన్నారు.భవానీల రద్దీ ఉండ డంతో పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు.