‘రాహుల్‌’ ‌చుట్టూ రాజకీయం

  • రాహుల్‌ ‌చుట్టూ తిరిగిన వర్కింగ్‌ ‌కమిటీ భేటీ

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ భేటీ అంతా రాహుల్‌ ‌చుట్టే తిరిగింది. ఆయనే అధ్యక్షుడిగా ఉండాలంటూ మరోమారు సబ్యులంతా పట్టుబట్టారు. తాను సర్వహక్కులు ఉన్న అద్యక్షురాలినని సోనియా కూడా స్పష్టం చేశారు. దీంతో ఇటీవల లేఖలతో గళమెత్తిన వారికి గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు అయ్యింది. న్యూఢిల్లీలోని అక్బర్‌ ‌రోడ్డులో ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యాలయంలో శనివారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. తాను పూర్తి కాలం పని చేసే, చురుగ్గా వ్యవహరించే కాంగ్రెస్‌ అధ్యక్షు రాలినని సోనియా మాట్లాడుతూ పేర్కొన్నారు. స్వేచ్ఛగా, నిజాయితీగా నేతలందరూ కలిసి చర్చించు కుందామని, వి•డియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం పార్టీ నేతలకు లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం రావాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నారని, ఇందుకోసం సమష్టిగా, ఐకమత్యంతో పనిచేయాలని, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ అవసరమని అన్నారు. తాను నిజాయితీని ఇష్టపడతానని, తనకు ఏదైనా చెప్పాలనుకుంటే, వి•డియా ద్వారా తనతో మాట్లాడవలసిన అవసరం లేదని తెలిపారు. మనమంతా కలిసి స్వేచ్ఛగా, నిజాయితీగా చర్చించుకుందా మన్నారు. ఈ గది నాలుగు గోడల వెలుపల తెలియజేయవలసినది సీడబ్ల్యూసీ సమష్టి నిర్ణయమని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎన్నికల్లో వరుసగా పరాజయాలు ఎదురవుతుండటంతో ఆ పార్టీకి చెందిన 23 మంది నేతలు గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వీరు డిమాండ్‌ ‌చేశారు. గత నెలలో పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత కపిల్‌ ‌సిబల్‌ ‌మాట్లాడుతూ, పార్టీకి పూర్తి కాలపు ప్రెసిడెంట్‌ ‌లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని అన్నారు. వెంటనే సీడబ్ల్యూసీని సమావేశపరచాలని కోరారు. గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్‌ ‌నేతల్లో కపిల్‌ ‌సిబల్‌ ఒకరు. ఈ 23 మంది నేతలను జీ23 నేతలని పిలుస్తున్నారు.కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌పదవికి రాహుల్‌ ‌పేరును అశోక్‌ ‌గెహ్లాట్‌ ఈ ‌సమావేశంలో ప్రతిపాదించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ చీఫ్‌గా రాహుల్‌ ‌గాంధీ పగ్గాలు చేపట్టాలంటూ సిడబ్ల్యూసీ సమావేశంలో వచ్చిన విజ్ఞప్తులపై రాహుల్‌ ‌స్పందించారు. సమావేశా నంతరం వి•డియా అడిగిన ప్రశ్నకు ఆయ స్పందిస్తూ, ఆ విషయం పరీశీలిస్తానని చెప్పారు. పార్టీ నేతల నుంచి ముందు సైద్దాంతిక స్పష్టత రావాలని, పార్టీ ఎన్నికలు జరిగే వరకూ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా ఉండాలని కొందరు నేతలు సమావేశంలో ప్రతిపాదించారని చెప్పారు. దీనికి ముందు, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ ‌పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులు అశోక్‌ ‌గెహ్లాట్‌ (‌రాజస్థాన్‌), ‌భూపేష్‌ ‌బాఘెల్‌ (‌ఛత్తీస్‌గఢ్‌), ‌చరణ్‌జిత్‌ ‌చన్ని (పంజాబ్‌) ఈ ‌సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్‌ ‌నేతల్లో గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ ‌శర్మ కూడా ఈ సమావేశానికి హాజర య్యారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికల పక్రియ 2022 సెప్టెంబరులో ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్‌ ‌నేత అంబికా సోనీ చెప్పారు. కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసిన అనంతరం శనివారం ఆమె వి•డియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ‌సమైక్యంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రాహుల్‌ ‌గాంధీ చేపట్టాలని ఏకాభిప్రాయం వ్యక్తమైందని చెప్పారు. సీడబ్ల్యూసీ సమావేశంలో జీ23 నేతల ప్రస్తావన రాలేదని చెప్పారు. వారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారన్నారు. వర్గాలుగా కాంగ్రెస్‌ ‌విడిపోలేదని, తామంతా సమైక్యంగా ఉన్నామని చెప్పారు. పార్టీ అధ్యక్షునిగా రాహుల్‌ ‌గాంధీ బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్‌ ‌నేతలంతా ఏకగ్రీవంగా కోరినట్లు తెలిపారు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టడంపై నిర్ణయం తీసుకోవలసినది రాహుల్‌ ‌గాంధీయేనని చెప్పారు. ఈ ఎన్నికల పక్రియ 2022 సెప్టెంబరులో ప్రారంభమవుతుందన్నారు.