‌శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ‘వెండి రథం’ ప్రారంభం

తాడేపల్లిగూడెం,జ్యోతిన్యూస్‌ :
‌పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి వెండి రథోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆంధప్రదేశ్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అం‌డ్‌ ‌డెవలప్మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌కుప్పం ప్రసాద్‌ ‌వెండి రథాన్ని ఆదివారం ప్రారంభించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఆర్యవైశ్యుల కుల ధైవం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి వెండి రధం తన చేతుల మీదుగా ప్రారంభించినందుకు ఎన్నోజన్మల అదృష్టం గా భావిస్తున్నానని, అమ్మ వారి కృప కటాక్షాలు అందరిపై ఉండాలని, కరోనా నుంచి యావత్‌ ‌ప్రపంచం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని వాసవి అమ్మవారిని ప్రార్ధించారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొట్టు సత్యనారా యణ,పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రంగా ప్రసాద్‌, ‌సెక్రటరీ హరనాథ్‌,‌కోశాధికారి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యు లు, వాసవి క్లబ్‌ అధ్యక్షులు మరియు మెంబెర్స్, ఆర్య వైశ్య నాయకులు పాల్గొన్నారు.