శవాన్ని ఎంజిఎంకు తరలిస్తాం: సిపి తరుణ్‌ ‌జోషి

వరంగల్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌హైదరాబాద్‌ ‌లోని సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి వరంగల్‌ ‌సీపీ తరుణ్‌ ‌జోషి పరిశీలించారు. పంచనామా అనంతరం వరంగల్‌ ఎం‌జీఎంకు రాజు శవాన్ని తరలిస్తామన్నారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. గురువారం ఉదయం 9:58 గంటలకు కీమెన్‌ ‌సారంగపాణి 100కు డయల్‌ ‌చేశారు. రాజారాం బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని తెలుపడంతో.. ఎస్‌ఐ ‌రమేశ్‌ ‌బృందం అక్కడికి చేరుకున్నారు. డెడ్‌బాడీపై ఉన్న పచ్చబొట్టు, ధరించిన దుస్తులను బట్టి రాజుగా నిర్దారించారు అని సీపీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌నుంచి స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌కు ఎలా వచ్చాడో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ మార్గానికి వచ్చే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తామని సీపీ తరుణ్‌ ‌జోపీ చెప్పారు. ఉదయం 8:40 గంటలకు హైదరాబాద్‌ ‌వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సవి•ప రైతులు మాకు సమాచారం అందించారు. మేము అక్కడికి వెళ్లి డెడ్‌బాడీని చూసి రైల్వే అధికారులకు సమాచారం అందించాం. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చూస్తే సైదాబాద్‌ ‌నిందితుడు రాజు అని తెలిసిపోయింది. సారంగపాణి 100కు డయల్‌ ‌చేసి సమాచారం ఇచ్చాడు. అంతలోపే పోలీసులు రాజారాం బ్రిడ్జి వద్దకు చేరుకున్నట్లు కుమార్‌ ‌తెలిపాడు.