సాగర్‌లోనే ‘వినాయక నిమజ్జనాలు’

  • వివాదానికి తెరదించిన సుప్రీం కోర్టు
  • ఈ సంవత్సరం నిమజ్జనాలకు అనుమతిస్తూ ఆదేశాలు
  • సాగర్‌ ‌కాలుష్యం కాకుండా కాపాడాలని ప్రభుత్వానికి హెచ్చరిక

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌హుస్సేన్‌ ‌సాగర్‌లో గణెళిష్‌ ‌నిమజ్జనాలకు లైన్‌ ‌క్లీయర్‌ అయ్యింది. నిమజ్జనాలు జరుపుకోవడానికి సుప్రీం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ ‌లీవ్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది.దీంతో విచారించిన సుప్రీం హుస్సేన్‌ ‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతించింది. తెలంగా ణ ప్రభుత్వం తరపున సోలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా వాదనలు వినిపించారు. వెంటనే చెత్తనంతా క్లియర్‌ ‌చేయా లని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌ ‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వానికి చివరి సారి అవకాశం ఇస్తున్నామని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌ప్యారిస్‌ ‌విగ్రహాల నిమజ్జనానికి ఇదే చివరి అవకాశమన్నారు. నిమజ్జనానికి ఆధునిక క్రేన్లు వినియోగించాలన్నారు. హుస్సేన్‌ ‌సాగర్‌ను ఒకప్పుడు మంచి నీటి కోసం వాడే వారన్నారు. సాగర్‌ ఆధునీకరణకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది నిమజ్జనం పేరిట దాన్ని కాలుష్యం చేస్తే ప్రజాధనం వృథా అయినట్టు కాదా అని సీజేఐ ప్రశ్నించారు.