ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ … బైక్ పై క్రాస్ చేసిన తొలి ఇండియన్

చరిత్రను సృష్టించిన సూర్యాపేట జిల్లా నూతనకల్ వాసి

సూర్యాపేట – జ్యోతిన్యూస్సూ:- ర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బయ్య సన్నీ యాదవ్ అసాధ్యం అనుకున్నది సాధ్యమని నిరూపించే తన ప్రతిభను చాటుకున్నాడు. భారతదేశం నుండి కొత్త చరిత్రను సృష్టించాడు. భారతదేశం నుండి బంగ్లాదేశ్ కి ఇండియన్ రిజిస్ట్రేషన్ బైక్ పై వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ బైక్ రైడర్ గా ఘనత సాధించాడు. వివరాల ప్రకారం….

1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరవాత నుండి ఇప్పటివరకూ బంగ్లాదేశ్ లోకి ఇండియన్ మోటార్ వెహికిల్స్ కి అనుమతి లేదు. ఎందుకనగా ఆ దేశ ప్రభుత్వం కొన్ని కారణాల చేత బైక్ ఇంజిన్ కి సీసీ లిమిట్ ఉంటుంది. ఇండియాలో బైక్ కి ఎటువంటి సీసీ లేమిటి లేదు. కానీ బంగ్లాదేశ్ లో 165 సీసీ వరకే లిమిట్ ఉంది. అంటే ఆ దేశంలో 165 సీసీ మించిన బైక్ లేదు. వీటన్నింటినీ దాటుకుని బైక్ పై వెళ్లవలసిన అన్ని అనుమతులు తీసుకుని బయ్యా సన్నీ యాదవ్ ఏకంగా 900 సీసీ బైక్ తో ఇండియా నుండి బంగ్లాదేశ్ కు బైక్ పై వెళ్లాడు. ఈరైడ్ కి సహకరించిన ప్రముఖ ఆయిల్ కంపెనీ అయిన క్యాస్ట్రాల్ ఫవర్ 1 అల్టిమేట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం సన్నీకి ఘనస్వాగతం పలికారు. బంగ్లాదేశ్ లో ఇప్పటివరకు 5 వేల మందికి పైగా బైకర్స్ కలిసినట్టుగా సన్నీ తెలియజేశారు. అక్కడ కలిసిన ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమ అభిమానాలు చూ పించారని తెలిపారు. బంగ్లాదేశ్ లో చేసిన బైక్ రైడింగ్ వీడియోస్ అన్నీ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేస్తానని వెల్లడించారు. ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి మరియు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్లై చేస్తానన్నారు.