‘చరిత్ర’సృష్టించింది

  • భారత్‌ ‌చరిత్ర సృష్టించింది
  • వందకోట్ల కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌పూర్తి
  • అనేక దేశాలతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ
  • 90 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్‌ ‌పూర్తి
  • వ్యాక్సినేషన్‌లో పాల్గొన్న వారికి ప్రధాని మోడీ అభినందన
  • ఉప రాష్ట్రపతి,హోంమంత్రి, మంత్రుల అభినందనలు

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌కోవిడ్‌-19 ‌వ్యాక్సినేషన్‌లో భారత్‌ ‌గొప్ప ఘనత సృష్టించిందని ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్‌ ‌డోసులను ప్రజలకు ఇచ్చారు. ఇది అమెరికాలో ఇచ్చిన వ్యాక్సిన్‌ ‌డోసుల కన్నా రెట్టింపు, జపాన్‌లో కన్నా ఐదు రెట్లు, జర్మనీలో కన్నా తొమ్మిది రెట్లు, ఫ్రాన్స్‌లో కన్నా 10 రెట్లు అధికంగా వివరించారు. దేశ జనాభాలో వ్యాక్సిన్‌ ‌తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ ‌తొలి డోస్‌ ‌తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ-కశ్మీరు, లడఖ్‌, ఉత్తరాఖండ్‌, ‌సిక్కిం, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌దాద్రా అండ్‌ ‌నగర్‌ ‌హవేలీ, డామన్‌ అం‌డ్‌ ‌డయ్యూ, గోవా, లక్షద్వీప్‌ ‌నూటికి నూరు శాతం తొలి డోస్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌జరిగినట్లు తెలిపింది. నాలుగు రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులైన వారిలో 90 శాతం మందికి తొలి డోసు వ్యాక్సినేషన్‌ ‌జరిగినట్లు పేర్కొంది. ఈ చరిత్రాత్మక ఘనత సాధించేందుకు మన దేశానికి 9 నెలలు పట్టింది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఓ పాట ను ఆవిష్కరించడంతోపాటు ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద అతి పెద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలోని మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడం కోసం డ్రోన్లను కూడా ఉపయోగించడం విశేషం.కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ 100 ‌కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని భారత్‌ అధిగమించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తిని ప్రశంసించారు.ఈ విజయానికి కారకులైన వైద్య సిబ్బంది, నర్సులు, ప్రజలకు మోదీ ఓ ట్వీట్‌ ‌ద్వారా ధన్యవాదాలు తెలిపారు.భారత దేశం చరిత్ర సృష్టించిందని ప్రధాని పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి స్ఫూర్తి,భారతీయ శాస్త్ర విజ్ఞానం, పరిశ్రమ సాధించిన విజయాన్ని మనం చూస్తున్నామ న్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీని అధిగమించినందుకు భారత దేశానికి అభినందనలు అని పేర్కొన్నారు. ఈ విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన వైద్యులు, నర్సులు,ఇతరులందరికీ ధన్యవాదాలు తెలిపారు.అమిత్‌ ‌షా ఇచ్చిన ట్వీట్లలో, ఇది చరిత్రాత్మక, గర్వకారణమైన సమయమని తెలిపారు.100 కోట్లు కన్నా ఎక్కువ వ్యాక్సిన్ల పంపిణీ లక్ష్యాన్ని భారత దేశం సాధించిందన్నారు.నవ భారత శక్తి, సామర్థ్యాలను యావత్తు ప్రపంచానికి మరోసారి తెలియ జేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, నిరంతర ప్రోత్సాహం దోహదపడ్డాయని తెలిపారు. అనేక సవాళ్ళను అధిగమించి ఈ మహా యజ్ఞం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన అందరు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, హెల్త్ ‌వర్కర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి పౌరుని భద్రత, ఆరోగ్యం కోసం దృఢనిశ్చయంతో కృషి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారత్‌ ‌చేపట్టిన టీకా ఉద్యమం నేడు 100 కోట్ల మైలురాయిని దాటి అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా మోదీ గురువారం ఉదయం దిల్లీలోని రామ్‌మనోహర్‌ ‌లోహియా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ ఉన్నారు.అటు ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ‌కూడా లఖ్‌నవూలోని వ్యాక్సినేషన్‌ ‌కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తలను అభినందించారు. పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ట్విటర్‌ ‌వేదికగా 100 కోట్ల మార్క్‌పై అభిందనలు తెలియ జేశారు. టీకా పంపిణీలో అద్భుతమైన లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా భారత ప్రజలకు అభినందనలు. ఈ చరిత్రా త్మక రికార్డును చేరుకోవడంలో కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, టీకా తయారీదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అభినందనలు. ఇంకా వ్యాక్సిన్‌ ‌తీసుకోనివారు భయాలన్నీ పక్కనబెట్టి టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నా. మనమంతా కలిసి కరోనాను ఓడిద్దామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కోట్లు అంటే కేవలం ఒక సంఖ్య కాదు.. వంద కోట్లకు పైగా ప్రజల ఆత్మవిశ్వాసం. టీకా పంపిణీలో చిరస్మరణీయ ఘనత సాధించిన సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలని కేంద్రమంత్రి పీయూష్‌ ‌గోయల్‌ అన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్థ నాయకత్వం, ఆరోగ్య సిబ్బంది నిబద్ధత, కృషి, ప్రజల సహకారం వల్లే ఈ ఘనత సాధించగలిగాం. కరోనా ఓటమి తథ్యం అని అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.