ఆర్థికం…అధోగతి

  • దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా దెబ్బ
  • కుదేలవుతున్న వ్యాపార రంగాలు
  • దెబ్బతిన్న ఉపాధి, ఉద్యోగావకాశాలు
  • మూడో వేవ్‌ ‌హెచ్చరికలతో మరింత ఆందోళన
  • విదేశాలకు వెళ్లలేని విద్యార్ధులు,ఉద్యోగార్ధులు
  • వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా కదలికలేని వైనం
  • నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల
  • ప్రజలకు శాపంగా మారిన బ్యాంకుల తీరు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌కరోనాతో మన దేశ ఆర్థిక వ్యవస్థయే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారింది. దీనికితోడు మనదేశంలో ఉపాధి,ఉద్యోగావకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇప్పటికే రెండు వేవ్‌ల బాధలను ప్రజలు అనుభవించారు.మూడోవేవ్‌ ‌ముప్పు పొంచివుందన్న హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో దేశంలో పరిస్థితులను త్వరగా చక్కదిద్దే బాధ్యతలను ప్రభుత్వాలు సత్వరంగా చేపట్టాలి. కరోనా కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశాలను కోల్పోయా ం. విద్య,ఉద్యోగాల కోసం వివిధ దేశాలపై ఆధారపడ్డ మనదేశ విద్యార్థులు, యువత కరోనా కారణంగా ఇక్కడే ఉండి పోయారు. దీంతో ఉన్నచోట ఉద్యోగావ కాశాలు లేక, విదేశాలకు వెళ్లలేక నలిగిపోతున్నారు. ముందుగా నిరుద్యోగులు, ఉద్యోగార్ధులు విదేశాలకు వెళ్లేలా పరిస్థితులు కల్పించాలి. మనదేశంలో కరోనాను అదుపు చేస్తే తప్ప ఇలాంటి పరిస్థి తులు రావు.మనదేశంలో కరోనా విజృంభణ కారణంగా అనేక దేశాలు భారత్‌ ‌నుంచి రాకపోకలను నిషేధించాయి. ఈ పరిస్థితులు చక్కబెట్టాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదే. థర్డ్‌వేవ్‌ ‌హెచ్చరికల నేపథ్యంలో దీంతో ఇప్పుడిప్పుడే ఈ సంక్షోభం నుంచి బయట పడతామా అన్న ఆందోళన నెలకొంది. వివిధ దేశాలు తమ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాను ప్రపంచానికి అంటించి చిద్విలాసంగా ఉన్న చైనా మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈ దశలో మనదేశం తీసుకుంటున్న చర్యల కారణంగా ఇప్పటికైతే ఎలాంటి పురుగతి కనిపించలేదు. వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా కదలిక కానరావడం లేదు. వసలకూలీలకు మళ్లీ పూర్తిగా పనులు దక్కి..తోపుడుబండ్లు, వీధి వ్యాపారులు వ్యాపారాలు చేసుకునేలా చూడాలి. అయితే ఇలాంటి చర్యలు తీసుకోకుండా పెట్రో ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోవడంతో సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పెట్రోధరలను సమర్థించుకునే చర్యలకు ముందుగా కేంద్రం దూరంగా ఉండాలి. పెట్రోధరల కారణంగా రవాణారంగంపైనా ప్రభావం తీవ్రంగా పడుతోంది. అన్నిరకాల వస్తువుల, సరుకుల ధరలు పెరిగి పోతు న్నాయి. సిమెంట్‌, ఇసుక, ఇటుక, ఇనుము ధరలు విపరీతంగా పెరగడం, దానికి రవాణా ఛార్జీలు తోడవ్వడం తో నిర్మాణరంగం కుదేలవుతోంది. ఇకపోతే బ్యాంకులు అనుసరిస్తున్న తీరు ప్రజలకు శాపంగా మారింది. ప్రజలు బ్యాం కుల వైపు చూస్తే వాతలు పడేలా చేస్తున్నారు. ఇవన్నీ సక్షించాల్సి తక్షణ అవసరం కేంద్రంపై ఉంది. ప్రజలు తమంతగా తాము బతికే పరిస్థితులు కల్పించ కుండా వారిపై భారాన్ని మోపి అభివృద్ది అని చెబితే ప్రజలు నమ్మడా నికి సిద్దంగా లేరు. ఇకపోతే ప్రపంచ ఆర్థికవృద్ధి క్షీణించి నట్లుగానే మనదేశ ఆర్థికాభివృద్ది కూడా బాగా క్షీణించింది. ఈ క్రమంలో ఉత్పత్తి రంగాలను,ఉపాధి రంగాలను జోడించి ప్రోత్సహించడం ద్వారా ఉన్న మానవనరులను ఉపయో గించాలి. కరోనా భయాలు ఇలాగే కొన సాగితే మనదేశంలోనూ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుందని ఆర్థికవేత్త లు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనంపై దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయ న్నది మున్ముందు తేలనుంది. గతేడాదిగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా ముందే చర్యలు తీసుకుని ఉంటే కొంతయినా పరిస్థితి మెరుగు పడేది. గతంలోనే ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్‌ ‌రాజన్‌ అనేక హెచ్చరికలు చేసినా పట్టిం చుకోక పోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందనే చెప్పాలి. మరోవైపు డాలర్‌తో మారక విలువను ఆధీనం లోకి తెచ్చుకోక పోతే మరిన్ని కష్టాలు తప్పవు. అలాగే అనవసర దిగుమతులకు కళ్లెం వేయాలి.దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. వ్యవసాయంతో పాటు, వస్తు వినిమయంలో స్వయం సమృద్ది సాధించాలి. లేకుంటే విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం చూపనుంది.దీంతో రూపాయి మరింత బలహీన పడనుంది.ఈ దశలో ఆర్థిక మందగమనానికి మందు వేసేందుకు ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కరోనాతో రోడ్డున పడ్డ జనాలను ఆదుకునేందుకు ఉదారంగా ముందుకు రావాలి. ప్రజలు స్వయం సమృద్ది సాధించేలా బ్యాంకులు ఉదారంగా రుణాలు అందచేయాలి. అంతేగాకుండా ప్రజలను ముక్కుపిండి వసూలు చేసే రుసుములను తగ్గించాలి. బ్యాంకింగ్‌ ‌రంగంలో మొండి బకాయిలు పతాక స్థాయికి చేరడం కూడా కారణంగా చెప్పుకోవాలి. ఎన్‌పిఏలు పెరుగుతున్న కొద్ది వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తున్నదని గుర్తించాలి.దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే పారిశ్రామిక రంగానికి రుణాలు ఏ మాత్రం అందు బాటులోకి రాకపోవడం తో మార్కెట్‌లో మాంద్యం ఏర్పడిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అది జిడిపి వృద్ధిరేటు దిగజారడా నికి దారి తీసిందని విశ్లేషించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకైతే రుణ వితరణలో ప్రతికూల వృద్ధి నమోదయింది. దేశ చరిత్రలో పారిశ్రామిక రంగానికి వాణిజ్య రుణాలు భారీగా తగ్గడం కూడా ఇదే ప్రథమమని భావించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచ డం ద్వారా ఆ లోటును పూడ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న మనదేశంలో ధరలు పెంచ డం అభివృద్దిపై తీవ్ర ప్రభావం చూపనుంది.రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మనకు ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు.వాణిజ్యలోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు రూపా యి పతనం పరోక్షంగా దోహదపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు, పసిడి దిగుమతుల వ్యయాలు పెరిగితే, దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. దిగుమతుల కోసం విదేశీ మారకపు నిల్వలను అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో, కరెంటు ఖాతా లోటు కూడా పెరుగుతుంది. పర్యాటక, హోటల్‌ ‌రంగాలు పూర్తిగా కుదేల య్యా యి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా నిరుద్యోగం పెరుగుతున్నది. అలాగే ప్రైవేట్‌ ‌పెట్టు బడులు తగ్గుతున్నవి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురుచూడటం ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నది. ఇలాంటి తక్షణ, అత్యవసర సమస్యల పరిష్కారంపట్ల దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నది.