కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌…

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ ‌వచ్చింది. సీఎం కేసీఆర్‌కు బుధవారం రాపిడ్‌ ‌యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్షలు నిర్వహించారు. రాపిడ్‌ ‌పరీక్షలలో కేసీఆర్‌కు నెగెటివ్‌ ‌వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీపీసీఆర్‌ ‌పరీక్ష ఫలితం గురువారం రానుంది. స్వల్ప లక్షణాలతో ఈ నెల 19వ తేదీన సీఎం కొవిడ్‌ ‌పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ ‌వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు అప్పటినుంచి ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్‌ ఆరోగ్యాన్ని పరీక్షిస్తోంది. ఈ నెల 21వ తేదీన సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ ‌సహా ఇతర పరీక్షలు చేశారు. ఛాతీలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ ‌లేదని సీటీ స్కాన్‌లో తేలినట్లు వైద్యులు తెలిపారు. తాజాగా కేసీఆర్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించగా యాంటీజెన్‌ ‌టెస్టులో నెగెటివ్‌గా వచ్చింది.