గ్రేటర్‌కు…’మహా’రాణులు…
- – గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి
- – డిప్యూటి మేయర్‌గా మోతె శ్రీలక్ష్మి ఎన్నిక
- – ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ మేయర్ ఎన్నిక
- – తొలుత కార్పోరేట్లతో ప్రమాణస్వీకారం చేయించిన కలెక్టర్
- – అనూహ్యంగా చివరి నిముషంలో మద్దతు తెలిపిన ఎంఐఎం
- – చివరి వరకు కొనసాగిన ఎంఐఎం సస్పెన్స్
- – తామూ బరిలో ఉంటామని చెప్పి గులాబీకి గులామ్
- – కేసిఆర్ వ్యూహంతో రెండు పోస్టులు టిఆర్‌ఎస్‌కే
- – మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ పిజెఆర్ తనయ
- – ప్రమాణస్వీకారం అనంతరం ఎన్నిక బహిష్కరణ
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. చేతులెత్తే సంప్రదాయంతో వీరు ఎన్నికయ్యారు. ఎంఐఎం మద్దతుతో సీఎం కేసీఆర్ నిర్ణయించిన మేరకు వీరిని కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు ఎన్నుకు న్నారు. హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి ఈ ఎన్నిక ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. జీహెచ్‌ఎం సీ కార్యాలయం లో ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి నూతన కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయించా రు. కార్పొరేటర్లు ఆయా భాషల్లో సామూహికంగా ప్రమాణం చేశారు. మొదట తెలుగు భాష, తర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనంగా పూర్తయ్యి ంది. అంతకుముందు టిఆర్‌ఎస్ భవన్‌లో కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లకు మంత్రి కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం అంతా బస్సులో జిహెచ్‌ఎంసి కార్యాలయానికి చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి అధికారికంగా ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్లకు శ్వేతామహంతి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మికి, డిప్యూటీ మేయర్ శ్రీలతకు టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. మేయర్‌గా విజయలక్ష్మి పేరును కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ప్రతిపాదించగా, గాజులరామారం కార్పొరేటర్ శేషగిరి బలపరిచారు. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత పేరును మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రతిపాదించగా, కూకట్‌పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ బలపరిచారు. అనంతరం ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి ఎన్నిక పక్రియ చేపట్టారు. చేతులెత్తే విధానం ద్వారా మేయర్‌ను ఎన్నుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. ఈ పక్రియ ఎలాంటి సంచల నాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరు అనే అంశంపై గత నాలుగైదు రోజుల నుంచి ఉత్కంఠ కొనసాగింది. ఉదయం నుంచి మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత పేర్లను ప్రతిపాదించి నట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ అందరిలో ఒక రకమైన ఉత్కంఠ ఉండింది. మొత్తానికి ఎలాంటి హంగామా లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పక్రియ పూర్తయింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. పాఠశాల విద్య హైదరాబాద్‌లోని ¬లీ మేరి స్కూల్‌లో పూర్తిచేశారు. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్ ఉల్ లూమ్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. వివాహానంతరం ఆమె 18 ఏండ్లపాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయా ల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. డివిజన్ అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత తార్నాక నుంచి ఎన్నికయ్యారు. కొంతకాలంపాటు టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ అఫీషియో సభ్యులగా ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రులు తలసాని,మహ్మూద్ అలీలు హాజరైన వారిలో ఉన్నారు.
చివరి వరకు కొనసాగిన ఎంఐఎం సస్పెన్స్…
హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో బిజెపి ముందునుంచి అనుమానిస్తున్నట్లుగానే ఎంఐఎం అధికార టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. దీంతో అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థులు మేయర్, డిప్యూటి మేయర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపి తమ అభ్యర్థలను నిలిపినా లాభం లేకుండా పోయింది. మొత్తానికి మేయర్ ఎంపిక ఉత్కంఠకు తెరపడింది. జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠంపై అధికార టీఆర్‌ఎస్ జెండా ఎగరేసింది. ముందునుంచి ఊహించినట్లే గులాబీ బాస్, ముఖ్యమంత్రి కెసిఆర్ హత్మకంగా వ్యవహరించి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకున్నారు. గ్రేటర్‌లో బీజేపీ దూకుడును సునాయాసంగా ఎదుర్కొన్నారు. మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్ గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఎన్నిక సందర్భంగా ఎంఐఎం పార్టీ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. మేయర్ బరిలో తాము కూడా ఉంటామని తొలినుంచి ప్రచారం చేసిన ఎంఐఎం పార్టీ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కీలకమైన సమయంలో అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించింది. మేయర్ అభ్యర్థిని బరిలో నిలపకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయానికి మద్దుతగా నిలిచింది. మేయర్ అభ్యర్థులుగా టీఆర్‌ఎస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి మేయర్ అభ్యర్ధి రాధా ధీరజ్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఎన్నిక పక్రియను చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.. నియమ నిబంధనల ప్రకారం మేయర్ ఎన్నిక పక్రియను చేపట్టారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎక్స్ అఫిషియో సభ్యులు కౌన్సిల్ హాల్‌లో కూర్చున్నారు. అనంతరం పోటీలో నిలిచిన ఇద్దరు సభ్యులకు ఎక్కువ మంది సభ్యులు ఎవరికి మద్దతు తెలిపితే వారిని విజేతలు ప్రకటిస్తామన్నారు. దీంతో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఎక్కువ మంది మద్దతు తెలపడంతో విజయం సాధించారు. అంతకుముందు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అప్పటికే టీఆర్‌ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్‌ల పేర్లు ఖరారైపోయాయి. అయితే ఆశావహులు భారీగానే ఉన్నారు. కానీ అధిష్టానం టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థిగా కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతను అధిష్టానం ఎంపిక చేసారు. దీంతో మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి అలకబూనారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆమె మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు. దీంతో టీఆర్‌ఎస్ నేతలు కంగుతిన్నారు. ఆమెకు ఎవరు ఫోన్ చేసినా పలకలేదు. గతంలో కూడా విజయారెడ్డికి మేయర్ పీఠం దక్కుతుందని పీజేఆర్ అభిమానులు, అనుచరులు భావించారు. అప్పుడు కూడా టీఆర్‌ఎస్ అధిష్టానం ఆమెను నిరాశపరిచింది. ఈసారైనా మేయర్ పీఠం దక్కుతుందని ఆమె భావించారు కానీ ఈసారి కూడా మొండి చెయ్యి చూపించడంతో విజయారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై మేయర్ ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ ఎన్నికల్లో చివరికి కారు పార్టీనే పైచేయి సాధించింది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది. ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీ విధేయులనే వరించింది.రాజ్యసభ సభ్యులు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు. విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద కూడా సందడి నెలకొంది. ఆమె మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. మేయర్ పీఠం కోసం తొలినుంచి అధికార టీఆర్‌ఎస్‌లో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సింధు ఆదర్శ్‌రెడ్డి (భారతీనగర్)తో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేర్లు సైతం ప్రముఖంగా వినిపించాయి. అయితే రాజకీయ, సామాజిక సవిూకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్ చివరి నిమిషంలో కేకే కుమార్తెను ఖరారు చేశారు. అయితే విజయారెడ్డి సైతం మేయర్ పీఠంపై గంపెడు ఆశలు పెట్టుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపింది. సభ్యులు చేతులెత్తి మేయర్‌ను ఎన్నుకున్నారు. సంఖ్యా పరంగా టీఆర్‌ఎస్‌కు ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉండటంతో మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జైశ్రీరాం అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఎంఐఎం మద్దతు తీసుకోవడంపై బిజెపి సభ్యులు నినాదాలు చేస్తూ టిఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డారు.
మేయర్ ఎన్నికల బరిలో బిజెపి…
జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పక్రియలో బీజేపీ బరిలో నిలిచింది. సరైన బలం లేకపోయినప్పటికీ మేయర్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలిపింది. మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌గా రాంనగర్ కార్పొరేటర్ రవిచారిని ప్రకటించింది. అయితే రవిచారి సమావేశానికి ఆలస్యంగా రావడంతో.. ఆయన స్థానంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పేరును ప్రకటించింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లలో గందరగోళం నెలకొన్నది. కాగా, మేయర్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. బిజెపి రంగంలోకి దిగడంతో అనూహ్యంగా ఎంఐఎం తమ మద్దతును టిఆర్‌ఎస్‌కు ప్రకటించింది. అభ్యర్థులకు మద్దతుగా చేతులు ఎత్తింది. ఇక పార్టీల వారీగా బలబలాలను పరిశీలిస్తే.. 150 డివిజన్లలో 56 స్థానాలను గెలిచి అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ అవతరించింది. బీజేపీకి 48, ఎంఐఎంకు 44, కాం గ్రెస్ రెండు డివిజన్లకు గెలుచుకున్నది. లింగోజిగూడ కార్పొరేటర్ రమేశ్ కరోనాతో మరణించారు. దీంతో 149 సభ్యులకు కౌన్సిల్ పరిమితమైంది. ఈ క్రమంలోనే మేజిక్ ఫిగర్ 97కి చేరింది. ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కీలకంగా మారింది. టీఆర్‌ఎస్‌కు 32 ఎక్స్ అఫీషియో కలిసి 87 మంది బలం ఉంది. బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు, ఇద్ద రు ఎక్స్ అఫీషియోలతో కలిసి 49గా ఉంది. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో 10తో కలిపి 54 మంది బలం ఉంది. కాంగ్రెస్‌కు ఇద్దరు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నా రు. బీజేపీ, ఎంఐఎం పార్టీల వ్యూహాం ఎలా ఉన్నా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌కు నల్లేరు విూద నడకలాంటిదేనని చెబుతున్నారు.