అందరి బడ్జెట్‌…

  • ‌పేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది
  • 130కోట్ల ప్రజల అభిశీద్దే లక్ష్యంగా కార్యక్రమాలు
  • కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు
  • 8 కోట్ల మందికి ఉచితంగా వంట గ్యాస్‌ అం‌దించాం
  • 4 కోట్ల మంది రైతులు, మహిళలు, దివ్యాంగులకు నగదు బదిలీ
  • బడ్జెట్‌పై చర్చలో విపక్షాల విమర్శలకు నిర్మలా సీతారామన్‌ ‌జవాబు

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :

‌నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌స్పందించారు. తాము కొందరిలా ’అల్లుళ్ల’ కోసం పనిచేయడం లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ పేదల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈమేరకు బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ ‌మాట్లాడారు. పేదల కోసం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ విపక్షాలు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ ‌విమర్శించారు. ఆశ్రిత పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేశామని, 8 కోట్ల మందికి ఉచితంగా వంట గ్యాస్‌ అం‌దించామని, మరో 4 కోట్ల మందికి రైతులు, మహిళలు, దివ్యాంగులకు నగదు బదిలీ చేశామని నిర్మలా సీతారామన్‌ ‌వివరించారు. వీరంతా ధనికులా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన కింద సుమారు 1.67 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయ ని, 2.67 కోట్ల ఇళ్లకు పీఎం సౌభాగ్య యోజన కింద విద్యుత్‌ అం‌దించామన్నారు. వీరంతా బడా కార్పొరేటర్లా? అని ఆమె ప్రశ్నించారు. 2016 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు 3.6 లక్షల కోట్ల డిజిటల్‌ ‌లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయని నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. యూపీఐని వాడిన వారంతా ధనికులా? అని ప్రశ్నించారు. యూపీఐని ప్రభుత్వం తీసుకొచ్చింది మధ్య తరగతి, చిరు వ్యాపారుల కోసమే తప్ప.. పెట్టుబడిదారులు, ’అల్లుళ్ల’ కోసమైతే కాదు అంటూ దెప్పిపొడిచారు. అయితే, ఆమె అల్లుళ్లు అనే పదం ఉచ్చరించడాన్ని కాంగ్రెస్‌ ‌నేతలు తప్పుబట్టారు. దీనిపై ఆమె వెంటనే అందుకుని కాంగ్రెస్‌ ‌పార్టీకి అదేమైనా ట్రేడ్‌మార్కా అంటూ దుయ్య బట్టారు. ఉపాధి హా పథకంలోని లోపాలన్నింటినీ తొలగించామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90,500 కోట్లు వెచ్చించామని, బ్జడెట్‌ అం‌చనాలకు మించి ఖర్చు చేశామని వివరించారు. కాంగ్రెస్‌ ‌హయాంలో ఏనాడూ బ్జడెట్‌ అం‌చనాలను అందుకోలేదని విమర్శించారు. కరోనా వల్ల భారత్‌తోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిం దని నిర్మలా సీతారామన్‌ అన్నారు. కొత్త బ్జడెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడేలా చర్యలు తీసుకున్నామని తెలిపా రు. బడ్జెట్‌పై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా నిర్మల పైవ్యాఖ్యలు చేశారు. ఎకాన త్వరగా కోలుకోవడానికి మధ్య స్థ, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని వివరించారు. దేశంలోని 130 కోట్ల మంది కోరికలను ప్రతి ఫలించే లా ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ను రూపొందిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ ‌చెప్పారు. ఈ ఏడాది బ్జడెట్‌ను వాస్తవిక తతో ఉండేలా తయారు చేశామని, ఇది నిజాయితీ కలిగిన బ్జడెట్‌ అని బీజేపీ ఎంపీ అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత చిదంబరం వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అశ్వినీ మాట్లాడుతూ.. పేదల బాగు కోసం పీఎం కిసాన్‌ ‌యోజన లాంటి పథకాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయని తెలిపారు.