జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్
రెన్యువల్ గడువు పొడిగించాలి
విజయవాడ,జ్యోతిన్యూస్ జర్నలిస్టుల హెల్త్ పాలసీ రెన్యువల్ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఢిల్లీ బాబు రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ బాబు రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డిలకు లేఖలు రాశారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీ గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం కరోనా లాన్లైన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ పాలసీ రెన్యువల్ చేసుకోవడం జర్నలిస్టులకు సాధ్యం కాదని, అందుకే ప్రభుత్వం చొరవ తీసుకుని జూన్ 30వ తేదీ వరకు ఈ పాలసీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని, పాలసీ రెన్యువల్ చేసుకునేందుకు జూన్ 30వరకు గడువు ఇచ్చేలా ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించాలని ఢిల్లీ బాబు రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు రేయింబవళ్లు పని చేస్తున్నారని, ఈ సమయంలో జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. మెడికల్ ఇన్సూరెన్స్ పరిమితిని కూడా రూ. 25 లక్షలకు పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది గ్రామీణ ప్రాంతాల జర్నలిస్టులు కరోనా కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఢిల్లీబాబు రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. కరోనా సమయంలో ఈ జర్నలిస్టులకు నెలకు రూ. 5 వేలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.