2న‘తెలుగు భాషా వైభవ శోభా యాత్ర’

మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌దినేష్‌ ‌కుమార్‌కు ఆహ్వానం

రాజమండ్రి,జ్యోతిన్యూస్‌ :

అం‌తర్జాతీయ తెలుగు మహాసభలను పురస్కరిచుకుని జనవరి 2వ తేదీన రాజమహేంద్రవరంలో పెద్దఎత్తున తెలుగు భాషా వైభవ శోభా యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్‌ ‌తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌దినేష్‌కుమార్‌ను కలిసి మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం రాంప్రసాద్‌ ‌మాట్లాడుతూ 2వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు దండి మార్చ్ ‌సర్కిల్‌ ‌నుంచి తెలుగు భాషా వైభవ శోభా యాత్ర ప్రారంభమై పుష్కర ఘాట్‌ ‌వద్ద శ్రీ రాజరాజనరేంద్ర విగ్రహం వరకు చేరుకుంటుందన్నారు.తెలుగు భాషలోని 25 సాహితీ పక్రియల సాహితీ మూర్తుల చిత్ర పటాలను ప్రదర్శిస్తూ వేలాదిమంది విద్యార్థులు తెలుగు వైభవాన్ని చాటుతూ పురవీధుల్లో ముందుకు సాగుతారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారని,ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షులు డా.గజల్‌ ‌శ్రీనివాస్‌, ‌మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ, పార్లమెంట్‌ ‌సభ్యలు మార్గాని భరత్‌ ‌రామ్‌,‌శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,అదిరెడ్డి భవాని,జక్కంపూడి రాజా,మునిసిపల్‌ ‌కమీషనర్‌ ‌దినేష్‌ ‌కుమార్‌,‌మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రుడా ఛైర్మన్‌ ‌రౌతు సూర్యప్రకాశరావు,బిజేపి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సోము వీర్రాజు,యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌,‌జక్కంపూడి గణేష్‌ ‌స్థానిక సాహితీ మూర్తులు,నగర ప్రముఖులు పాల్గొంటారని వెల్లడించారు.ఆంధ్ర సారస్వత పరిషత్‌, ‌చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 2024 జనవరి 5,6,7, తారీఖులలో గైట్‌ ఇం‌జి నీరింగ్‌ ‌కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.