‘ఆన్‌ ‌డ్యూటీ’సౌకర్యం ఇవ్వండి

  • ప్రభుత్వ ఉపాధ్యాయులు, తెలుగు పండిత అధ్యాపకులు హాజరయ్యేలా ప్రోత్సహించండి
  • రాష్ట్ర విద్యా మంత్రి బొత్స సత్యనారాయణను కోరిన డాక్టర్‌ ‌గజల్‌ శ్రీ‌నివాస్‌
  • ‌సభలో పాల్గొనాలని కోరిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతినిధులు

విజయవాడ,జ్యోతిన్యూస్‌ :

అం‌తర్జాతీయ తెలుగు మహాసభల్లో పాల్గొనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, తెలుగు పండిత అధ్యాపకులకు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని,వెసులుబాటు సదుపాయాన్ని కల్పించాలని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డాక్టర్‌ ‌గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. ఈ మేరకు గురువారం ఉదయం మంత్రి నివాసంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతినిధులు మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందున ప్రభుత్వ ఉపాధ్యాయులు,తెలుగు పండిత అధ్యాపకులను హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని వ్ఞిప్తి చేశారు. గతంలో 2013లో జరిగిన తెలుగు మహాసభలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గజల్‌ శ్రీ‌నివాస్‌ ‌మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విద్యాశాఖ సంచాలకులు,విద్యాశాఖ కార్యదర్శితో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ముఖ్య సంచాలకులు కేశిరాజు రాంప్రసాద్‌,‌శోభాయాత్ర సహ సంచాలకులు సుమేధ వెంకటరాజు,స్వర్ణ భారతి రామకృష్ణరాజు,శ్రీ లక్ష్మీ విద్యానికేతన్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌,‌రాష్ట్రీయ పండిత పరిషత్‌ ‌ప్రధాన కార్యదర్శి రవిచంద్ర,పి.సాంబయ్య,ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఎన్టీఆర్‌ ‌జిల్లా సంచాలకులు జి రామ అప్పారావు,నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.