ఇది‘తెలుగువారి పండుగ’

  • అందుకు కాలిపోర్నియా నుంచి వచ్చా
  • కామేశ్వరి భమిడిపాటి

రాజమండ్రి,జ్యోతిన్యూస్‌ :

ఆం‌ధ్ర సారస్వత పరిషత్‌,‌చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా రాజమండ్రిలో జనవరి 5,6,7 లో నిర్వహిస్తున్న రెండవ ప్రపంచ తెలుగు మహాసభలుకు హాజరుకావడానికి రాజమండ్రి చేరుకున్న కాలిఫోర్నియాలోని శాన్‌ ‌ఫ్రాన్సిస్కో లో నివాసం ఉంటున్న కామేశ్వరి భమిడిపాటి మాట్లాడుతూ తెలుగు భాష మీద అభిమానంతో ఈ సభలకు హాజ •వుతున్నానని,గతంలో అమెరికాలో జరిగిన మాస్ట్రో గజల్‌ ‌శ్రీనివాస్‌ ‌నిర్వహించిన కచేరీలకు తాను హాజరైననని,వారు అద్భుతంగా పాటలు పాడుతారని,వారు తెలుగు భాష కోసం చేస్తున్న కృషి చాలా అమోఘమని,ఇది తెలుగు వారందరూ చేసుకునే పండగని కామేశ్వరి తెలిపారు.తెలుగు మహాసభలకు హాజరువుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఉత్సవ కమిటీ సలహాదారు కోట్ల కనకేష్‌,‌శోభాయాత్ర సహ సంచాలకులు సుమేధా వెంకటరాజు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల ప్రకాష్‌,‌ముఖ్య సలహాదారు కేశిరాజు రాంప్రసాద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.