పుట్టదు రొబ్బం.. ‘పుచ్చ’డు దు:ఖం
రైతుకు పెట్టుబడి సొమ్ములు సైతం రాని పరిస్థితి
- సాగు చూస్తే ఫుల్..అమ్మకాలు నిల్
- కోతలు లేక 20 శాతం పుచ్చిపోతున్న పంట
- పండ్ల మార్కెట్ల మూసివేతతో ఎక్కడిక్కడే అమ్మకాలు
- డిమాండు కన్నా సరఫరా ఎక్కువ
- లోకల్ గా అమ్మకాలు లేక రైతుల విలవిల
- సమ్మర్ సీజన్ అమ్మకాలు సొమ్ముచేసుకోలేకపోతున్న రైతన్న
- రూ.5 లేక 10కే పుచ్చకాయలు అమ్ముకుంటున్న రైతులు
- గతేడాది రూ.50 పలికిన కాయలు
హైదరాబాద్: వేసవి ప్రారంభమైతే పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. కరోనాతో పట్టణాల్లో ఉండి చదువుకునే వారు పల్లెల దారి పట్టడంతో అక్కడ సైతం వ్యాపారాలు తగ్గాయి. గత సంవత్సరం పుచ్చ సాగు చేసిన రైతులకు లాభాలు బాగానే వచ్చాయి. అదే ఉద్దేశంతో పుచ్చ సాగు చేయడంతో కరోనాతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటి వరకు మనషులను వణికిస్తున్న కరోనా ప్రస్తుతం పుచ్చ రైతులకు శాపంగా మారింది. కరోనా దెబ్బతో పుచ్చ రైతులు విల విలాడుతున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయంలోనే హైదరాబాద్ లోని మార్కెట్ బంద్ చేయడంతో రైతులు విక్రయించలేకపోతున్నారు. త్రిపురారం మండలంలోని అన్నారం, కామారెడ్డిగూడెం, కంపాలపల్లి, మునగబావిగూడెం, కొణతాలపల్లి తదితర గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో పుచ్చ సాగు చేశారు. అంతటా దిగుబడికి సిద్ధమైంది. కొనేవారు లేరంటూ.. కరోనా సాకుతో పుచ్చ కొనుగోలు చేసే వ్యాపారులు టన్ను రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అడుగుతున్నారు. 10 రోజుల క్రితం టన్ను రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఉందని రైతులు తెలిపారు. ఇక్కడ పండించిన పుచ్చ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు థాయిలాండ్, చైనా దేశాలకు ఎగుమతి అవుతుంది. కరోనా దెబ్బతో ఎగుమతులు నిలిచిపోగా.. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలను అమాంతం తగ్గించారు. తగ్గిన వ్యాపారం వేసవి ప్రారంభమైతే పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. కరోనాతో పట్టణాల్లో ఉండి చదువుకునే వారు పల్లెల దారి పట్టడంతో అక్కడ సైతం వ్యాపారాలు తగ్గాయి. గత సంవత్సరం పుచ్చ సాగు చేసిన రైతులకు లాభాలు బాగానే వచ్చాయి. అదే ఉద్దేశంతో పుచ్చ సాగు చేయడంతో కరోనాతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటి వరకు మనషులను వణికిస్తున్న కరోనా ప్రస్తుతం పుచ్చ రైతులకు శాపంగా మారింది. పెట్టుబడి కూడా వచ్చేట్లు లేదు 5 ఎకరాల్లో పుచ్చ సాగు చేశాం. ఎకరాకు రూ.50 వేల వ్యయం చేశాం. పంట చేతికొచ్చే సమయంలోనే ధరలు తగ్గడం, గత్యంతరం లేక ఎంత ధరకైనా విక్రయించక తప్పడం లేదు. తోటలో కాయ పక్వానికి వచ్చిన తర్వాత విక్రయించకపోతే ఎండకు దెబ్బతింటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా ప్రభావం మమ్మల్ని ముంచుతోంది అంటూ వాపోతున్నారు రైతులు. పుచ్చకాయ రైతులకు పుచ్చు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. కూలీ గిట్టక తీవ్రంగా నష్టపోతున్నారు. వేసవిలో భారీ డిమాండ్ ఉండే పుచ్చకాయలకు పుచ్చు సమస్యగా మారుతోంది. సకాలంలో కోత కోయక పోవడంతో 20 శాతం పంట పుచ్చులుగా మారిపోతున్నాయి. ఇతర ప్రాంతాలకు రవాణా సదుపాయాలు లేకపోవడంతో స్థానికంగానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ఒకప్పుడు కాయ ధర నిర్ణయించగా, ఇప్పుడు కేజీల చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. ప్రజలు కేవలం నాలుగు గంటలు మాత్రమే బయటకు వస్తుండడంతో ఎండలో పుచ్చకాయల వ్యాపారం సాగడం లేదు. రోజుల తరబడి ఉంచడంతో పాడైనష్టం తెచ్చి పెడుతోంది. కొందరు రైతులు నేరుగా వచ్చి రోడ్లపై అమ్ముకుంటున్నారు. మార్కెట్ పూర్తిగా లేకుండా పోయింది. వేసవి కాలంలో కాస్త చల్లదనం ఇచ్చే పుచ్చకాయ ఇప్పుడు రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఏప్రిల్, మేలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలకు పెరుగుతుంది. ఆ సమయంలో ప్రజలు కాస్త చల్లదనం కోసం ఉచ్చకాయలను బాగా ఇష్టపడతారు. ఎంతైనా కొనుగోలు చేస్తారు. ఒకప్పుడు కాయ ఆధారంగా ధర నిర్ణయించేవారు. ఇటీవల కాలంలో ప్రతి కాయ, పండు కేజీల లెక్కన మార్కెట్ లో అమ్మేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మేలలో బాగా వ్యాపారం జరుగుతుందని, జిల్లాలో సుమారు ఐదువేల ఎకరాల్లో పుచ్చపంట సాగుచేశారు. ఇసుక నేలల్లో బాగా పెరిగి, మంచి సైజ్ తోపాటు, తీపి, కలరొస్తుంది. ఈ ఏడాది మంచి గిరాకీ ఉంటుందని రైతులు భావించారు. టిపి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, ఇందుకూరు పేట, కోవూరు, బుచ్చితోపాటు అనేక ప్రాంతాల్లో రైతులు పుచ్చసాగుచేశారు.బాగ ఆదాయం వస్తుందని, అప్పులుచేసి మరీ పుచ్చ పై పెట్టారు. ఇక్కడ స్థానికంగా వ్యాపారం చేయడంతోపాటు కడప, చిత్తూరు, చెన్నరు ఇతర ప్రాంతాలకు రవాణా చేసి, లాభం పొందేవారు. ఇప్పుడు కరోనా వారి జీవితాలను పూర్తిగా మార్చేసింది. ఈ రెండు నెలల్లో పెట్టుబడితోపాటు కలిపి మంచి లాభాలు వస్తాయని ఆశపడ్డ పుచ్చరైతులు జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఇతర ప్రాంతాలకు రవాణా నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్ వ్యాపారులు పుచ్చకాయలను పెద్దగా కొనుగోలు చేయడం లేదు. కరోనా కారణంగా రైతులకు చేతికి రాకుండానే వచ్చిందే ఆదాయం అనుకుని పొలాల్లోనే అమ్మేస్తున్నారు. కొందరు వదిలేస్తున్నారు. స్థానిక వ్యాపారం తప్ప ఇతర ప్రాంతాల్లో బిజినెస్ జరగడం లేదు. తెచ్చిన అప్పులకు, వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితులున్నాయి. స్థానిక వ్యాపారమే..! రెండు నెలల కాలంలో మంచి ఆదాయం తెచ్చి పెట్టే పుచ్చకాయల వ్యాపారం నష్టాలను మిగుల్చుతోంది. కొందరు రైతులు నేరుగా బజారుకు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. టన్ను ధర రూ.6నుంచి రూ.7వేల వరకు అమ్ముతుంది. స్థానిక వ్యాపారులు కాస్త ఆదాయం వచ్చినా సరిపోతుందని, కొనుగోలు చేస్తున్నారు. నెల్లూరు నగరంతోపాటు గూడూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్లపై పెట్టి అమ్ముకుంటున్నారు. గతేడాది కేజీ రూ.15 నుంచి రూ.20 వరకు అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో కేజి రూ.5 నుంచి రూ.10 పలుకుతోంది. కోత కోసి మూడు నాలుగు రోజులు కేజి పది రూపాయలు అమ్మి తరువాత మిగిలి పోయిన కాయలను కేజీ రూ.5 కే అమ్ముకుంటున్నారు. వారం పది రోజులు ఎండల్లోనే ఉండడంతో కొన్ని కాయలు పుచ్చిపోతున్నాయి. రోజంతా వ్యాపారం జరిగితే కాయలు అమ్ముడవుతాయి. లాక్ డౌన్ కారణంగా ఉదయం 6 నుంచి 10 గంటలు అంటే రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే వ్యాపారాలు జరుగుతుండడంతో ఎక్కువ సరుకు మిగిలిపోతుంది. దాంతో చేసేదేమి లేక పడేస్తున్నారు. లేదా తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. అమ్ముకోడానికి అవకాశం ఇస్తారా..? లాక్ డౌన్ కారణంగా పచ్చిపంట పుచ్చకాయలు కుళ్లిపోవడం జరుగుతుంది. ప్రజలు వేసవి తాపం నుంచి తట్టుకోడానికి తినే అవకాశం ఉన్నా అమ్ముకోడానికి ఎక్కువ సమయం లేదని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు. అత్యవసర పంట కింద పుచ్చను గుర్తించాలని కోరుతున్నారు. ప్రత్యేక సడలింపులో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. టన్ను రూ.7000 పెట్టి కొనుగోలు చేసినా ఆదాయం రాకపోగ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేవలం ఈ రెండు నెలల కాలంలోనే జరిగే వ్యాపారం కావడంతో ఈ సమయంలో తమ కడుపులు కొట్టవద్దని కోరుతున్నారు. ప్రజలు లేకుండా వ్యాపారాలు ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చెన్నై నగరంలోని ఎక్కువగా పుచ్చ పంట పండిస్తున్నారు. ఇప్పుడు, కరోనావ మహమ్మారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్నందున పుచ్చపండ్లు పెరిగిన వాటిని వివిధ ప్రాంతాలకు పంపేందు ట్రాలెల్ సౌకర్యం లేదు. ఈ పుచ్చకాయలను పండించే చెంగల్ పట్టు, కాంచీపురం జిల్లాల్లోని రైతులు డిమాండ్ ను తగ్గించడంతో కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. పుచ్చపండ్లు రెస్టారెంట్లు, జ్యూస్ షాపులకు విరివిగా వెళ్లేవని కానీ ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో రైతులు తమ ఉత్పత్తులను తరలించలేకపోతున్నారు. వారు ఇప్పుడు తమ పొలాలలో పూర్తిస్థాయిలో పండ్లను వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కష్టాలను గమనించాలని ఈ ప్రాంతానికి చెందిన సేంద్రీయ రైతు అల్లాది మహాదేవన్ కోరారు. జ్యూస్ షాపులు పనిచేయడానికి ప్రభుత్వం అనుమతించాలన్నది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. పుచ్చ రైతులకు కాయలు అమ్ముకునేందుకు లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు.