‘జూమ్’..జామ్ గా పెళ్లిళ్లు
కరోనా ప్రభావంతో కళ్యాణ మహోత్సవాలన్నీ ఇక జూమ్ యాప్ లోనే…
- న్యూయార్క్ లో ఆన్లైన్ వివాహాలకు అనుమతి
- ఒకప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లకు ఉపయుక్తం
- ప్రస్తుత పరిస్థితుల్లో అందరి దృష్టి ఈ యాప్ పైనే
- దూరప్రాంతాలలో పెళ్లిళ్లు చేసుకునేవారికి ఉపయోగం
- మరో రెండేళ్ల దాకా పరిస్థితులు ఇంతే..
- అప్పటిదాకా పెళ్లిళ్లు అన్నీ ఆన్ లైన్ లోనే
- ఇతరత్రా శుభకార్యాలన్నీ కూడా ఇక ఆన్ లైన్ లోనే..
హైదరాబాద్: పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు… మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మంత్రాలు ఇది కరోనాకు ముందు.. ఇప్పుడు అలా కాదు.. ఎందుకుంటే ఇది కరోనా కాలం.. మునపటిలా పెళ్లి చేసుకుంటామంటే కుదరదు.. కరోనా పుణ్యామనా పెళ్లిళ్లు అన్నీ ఆన్ లైన్ లో జరిగిపోతున్నాయి. మ్యారేజ్ ఇన్విటేషన్ అంతా ఆన్ లైన్ లోనే… ఎవరి ఇంట్లో వారు.. ఎక్కడి వారు అక్కడే ఉండి పెళ్లి చూడొచ్చు.. వధువరులు కూడా ఎవరి ఇంట్లో వారే ఉండి పెళ్లి చేసుకోవచ్చు. అటు అబ్బాయి బంధువులు, ఇటు అమ్మాయి బంధువులు అంతా ఆన్ లైన్ లోనే ఆశీర్వదించొచ్చు. అక్షింతలు అక్కర్లేదు.. లైక్స్, కామెంట్లతో విషెస్ తెలియజేయొచ్చు. ఇంటర్నెట్లో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పెళ్లిళ్లు వేగంగా జరిగిపోతున్నాయి. ఆన్ లైన్లో జంటలు ఒకటైపోతున్నాయి. న్యూయార్క్ లోనూ ఆన్లైన్ లోనే పెళ్లిళ్లు ఇక న్యూయార్క్ విషయానికి వస్తే.. అక్కడ కరోనా వైరస్ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బంధువులను పిలిచి ఘనంగా పెళ్లిళ్లు జరుపుకోవడం సాధ్యపడదు. అందుకే న్యూయార్క్ వాసులంతా ఆన్ లైన్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ లో న్యూయార్క్ జంటలు ఒకటైపోతున్నాయి. న్యూయార్క్ ప్రభుత్వం కూడా ఆన్ లైన్ పెళ్లిళ్లను లీగల్ చేసింది. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో (%ణ%) ఒక ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఆర్డర్ ద్వారా న్యూయార్క్ వాసులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చట్టపరంగా పెళ్లి చేసుకోవచ్చు. తద్వారా వారికి మ్యారేజ్ లైసెన్స్ పొందవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ద్వారా ప్రొవిజన్ లాను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన వెల్లడించింది. పెళ్లిళ్లకు అనుమతి లేదా అంటే లేదని అంటున్నారు ఆండ్రూ.. %శీశీఎస్ లో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మ్యారేజీకి అటెండ్ కావొచ్చు.. అవునా? కదా? అని ఆండ్రూ ఫన్నీగా స్పందించారు. ప్రపంచమంతా జూమ్ యాప్ ద్వారానే వివాహాలు మరోవైపు కరోనా వైరస్ కారణంగా.. చాలా మ్యారేజీ బ్యూరోలు తాత్కాలికంగా మూతపడ్డాయి. అమెరికాలో న్యూయార్క్ లోనే కరోనా తీవ్రస్థాయిలో వ్యాపి చెందిన కేంద్రం. అందరూ ఇంట్లోనే ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. మే 15 వరకు లాక్ డౌన్ పొడిగించారు. పెళ్లిళ్లు వంటి ఇతర ఫంక్షన్లకు మరి కొన్ని నెలల పాటు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. లాక్ డౌన్ ఎత్తేసినా కూడా ఇప్పట్లో ఎలాంటి శుభ కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఉండదు. అందుకే ఆన్ లైన్ పెళ్లిళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా %శీశీఎ% వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. జంటలు ఒకటవ్వడాన్ని వీడియో కాన్ఫిరెన్స్ టూల్స్ ద్వారా కాల్ చేసి బంధువులు, స్నేహితులు వీక్షిస్తున్నారు. కానీ, ఇలాంటి కార్యక్రమాలు చట్టపరమైనవి కావు. కొంతమంది జంటలు మ్యారేజీ లైసెన్స్ పెళ్లికి ముందే పొందవచ్చు లేదా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అధికారిక వివాహాన్ని నిలిపివేస్తున్నారు. క్యూమో ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ప్రకారం.. సామాజిక దూరం పాటించడం ద్వారా ఎంపైర్ స్టేట్ లోని జంటలు అధికారికంగా పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఉ ంటుంది. కొలరాడోలో జంటలు ఇప్పుడు వివాహ అనుమతి కోసం దరఖాస్తు ఆన్ లైన్లో అనుమతి లభించింది. ఒహియోలోని కుయా హెగా కౌంటీలో, ప్రత్యేక పరిస్థితులతో ఉన్న జంటలు (తీవ్రమైన అనారోగ్యంతో బాధపడటం, ఆరోగ్య బీమా సమస్యలు లేదా ఆరోగ్య సంరక్షణలో పనిచేస్తుంటే వంటివి) వీడియో కాల్ ద్వారా వారి వివాహ లైసెన్స్ పొందవచ్చు. కరోనా వైరస్ మహమ్మారిలా ప్రపంచం అంతా కమ్మేయడంతో తప్పని పరిస్థితుల్లో ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ని ప్రకటించాయి. దీంతో ప్రపంచంలోని మెజారిటీ కంపెనీలు తమ ఉత్పత్తి కుదేలవ్వకుండా చూసుకునేందుకు ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చాయి. ఆదునిక డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక అతి పెద్ద ప్రయోగంగా పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇక వర్క్ ఫ్రం ఏం చేస్తున్న ఉద్యోగులతో కమ్మ్యునికేట్ అవ్వటానికి గ్రూప్ డిస్కన్స్ కి, క్లైంట్ మీటింగులకు అత్యదిక కం పెనీలు పలు వీడియో కాన్ఫరెన్స్ సాఫ్ట్ వేర్లను ఉపయోగిస్తున్నాయి. అందులోను ముఖ్యంగా అత్యదిక కంపెనీలు జూమ్ అనే వీడియో కాన్ఫరెన్స్ సాఫ్ట్వేర్ ని ఉ పయోగిచడం మొదలు పెట్టాయి. యాప్ అన్నీ అనే సంస్థ చేసిన ఒక సర్వే ప్రకారం గడచిన ఒక్క మార్చ్ నెలలోనే 62 మిలియన్ల మంది వీడియో చాట్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించింది , అందులోను జూమ్ యాప్ గడచిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడు మొదటి త్రైమాసికం లోనే ఒక్క అమెరికాలోనే 17 శాతం అధికంగా వాడుతునట్టు చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ వలన ఇంతలా ప్రయోజనం పొందిన జూం యాప్ ఉపయోగం పై ప్రస్తుతం నీలి నీడలు అలుముకున్నాయి. ఈ యాప్ వాడటం సెక్యురిటీ పరంగా అంత శ్రేయస్కరం కాదని తమ దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ ఆదారంగా బోస్టన్ డివిజన్ యఫ్.బి.ఐ సంస్థ వెల్లడించారు. మసాచు సెట్స్ నగరంలో ఈ యాప్ ద్వారా స్కూల్ క్లాసులు నిర్వహిస్తుండగా ఆ చాట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు పోస్టు చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్కూల్ యాజమాన్యం తమకి ఫిర్యాదు చేసినట్టు యఫ్.బి.ఐ సంస్థ వెల్లడించడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉల్లిక్కిపడింది. వృత్తి పరంగా తమ ఉద్యోగులతో , ఆహ్లాదంగా తమ స్నేహితులతో ఈ యాప్ ద్వారా అప్పటి వరకు కాంటాక్ట్ అయిన వారి భయాందోళనలను దృష్టిలో పెట్టుకుని జర్మనీ , సింగపూర్, తైవాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఈ అప్లికేషన్ ను తమ దేశాల్లో బ్యాన్ చేశాయి. గూగుల్ లాంటి సంస్థలు తమ ఉద్యోగులను ఈ అప్లికేషన్ ను వాడకూడదు అని నిబందనలను పెట్టింది. సెక్యురిటీ పరంగా ఈ అప్లికేషన్ లో అనేక లోపాలు ఉండటంతో హ్యాకర్లు అత్యంత సులువుగా ఈ అప్లికేషన్ ను హ్యాక్ చేసి కంపెనీలకు సంభందించిన కీలకమైన డేటాను తస్కరించి వాటితో పాటు 5 లక్షల ఎకౌంట్లను , హెస్ట్ కీస్ ను హ్యాకర్లు డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టినట్టు టైపింగ్ కంప్యుటర్స్ సంస్థ తమ రిపోర్టులో వెల్లడించింది.