23 ‌రోజులు.. ఎన్నెన్నో మధుర జ్ఞపకాలు

హైదరాబాద్ జ్యోతి న్యూస్ :- లడఖ్‌ ‌చేరుకోవటం అందరికీ సులభం కాదు , మన తెలుగు రాష్ట్రాల నుంచి లడఖ్‌ ‌చేరుకోవాలి అంటే తల ప్రాణం తోకకు వస్తుంది, ఒకరు బండి మీద ఇక్కడ నుంచి లడఖ్‌ ‌చేరుకోవడమే గగనం అనే రోజుల్లో మన తెలుగు జంట విజయ్‌ ‌గౌడ్‌ ‌మరియు శ్వేత దుప్తల విజయవంతంగా లడఖ్‌ ‌యాత్ర ముగించుకొని వచ్చారు. విజయ్‌ ‌రెండు ఏళ్లలో దాదాపు లక్ష కిలోమీటర్లు తిరిగిన తర్వాత తన జీవిత ఆశయం అయిన లడఖ్‌ ‌యాత్రకు సమయం అయింది అని గుర్తించారు, తన జీవేతాషయనికి తోడుగా రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగు పరిచే గొప్ప ఆశయంతో తమ గమనాన్ని మొదలుపెట్టారు ఈ జంట. విజయ్‌ ‌మరియు శ్వేత జంటకు ప్రపంచాన్ని బండి మీద విహరించాలి అన్నది వారి జీవిత ఆశయం. విజయ్‌ ‌యూట్యూబ్లో బాగా ప్రసిదీ పొందిని వ్యక్తి, తన యూట్యూబ్‌ ‌చానెల్‌ ‌రైడ్‌ ‌విత్‌ ‌విజే ఆకర్షణీయమైన వ్లోగ్లు మరియు అబ్బురపరిచే చిత్రీకరణకు ప్రసిద్ది. శ్వేత కూడా అందరికీ శ్వేత తెలుగు వ్లోగ్స్ అన్న పేరుతో అందరికీ సుపరిచితం. వీరిద్దరూ తెలంగాణ జోడీ రైడర్స్‌గా పేరుపొందారు. తెలంగాణా జోడీ రైడర్ల్ ‌యాత్ర 20 జూన్‌ 2021 ‌న మొదలై 23 రోజుల సుదీర్ఘ కాలం తరువాత 12 జూలైకి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

హైదరాబాద్‌లో మొదలైన వీరి యాత్ర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ఉత్తప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌చండీగఢ్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌ఢిల్లీ, హర్యానా, జమ్ము కాశ్మీర్‌ ‌వంటి ప్రదేశాలను విహరిస్తూ లడఖ్‌ ‌చేరుకున్నారు. హైదరాబాద్‌ ‌నుండి లడఖ్‌ ‌సుమారు 3000 కిలోమీటర్ల దూరం, రాను పోను ఈ జోడీ 6000 కిలోమీటర్లా దూరాన్ని ప్రయానించారు. వీరి యాత్ర అంత సులభంగా ఏమి సాగలేదు విపరీతమైన వాతావరణ మార్పులు, బస చేయటానికి చోటు దొరకకపోవడం, చెడ్డ రోడ్లు, కనెక్టివిటీ లాంటి సమస్యలను ఏడురుకున్నరు. సమస్యలన్నింటిని లెక్క చేయకుండా తమ గమ్యస్థానానీన్న కార్య సిద్ధితో చేరుకున్నారు. సాధారణంగా హిమాలయాలు అంటే మంచు కొండలు, సర్రసులు, రమణీయమైన ప్రకృతి అందాలు మాత్రమే గుర్తుకు వస్తాయి కానీ వాటి దగ్గరికి చేరుకోవాలి అంటే కలిగే శ్రమ ఎవరు గుర్తించారు. కటినమైన రోడ్డులు, గడ్డకట్టించె చలి, ఎత్తైన ప్రదేశాల ఊపిరి సమస్యలు వంటి ఎన్నో రకాల సమస్యలు ఏడురువుతయి. విజయ్‌ ‌శ్వేత జంట ఎత్తైన ప్రదేశాల వాతావరణ పిరిస్తితులకు అలవాటు పడటానికి 4 రోజులు పట్టింది. వారి యాత్రలో భాగంగా ‘‘ఖర్దుంగ్ల’’ ప్రపంచం లోనే ఎత్తైన రోడ్డు మార్గం గల ప్రదేశానికి చేరుకున్నారు, అక్కడ సముద్రమత్తనికి 17983 అడుగుల ఎత్తులో మన సైనికులు ఆ రహదరిని అందరి సౌకర్యార్థం నిర్మించారు. తదుపరి వారి సాహస యాత్రలో వారు దాల్‌ ‌సరస్సు, ఝాన్సి, హండర్‌, ‌నుబ్రా వ్యాలీ, తుర్తుక్‌, ‌పంగొంగ్‌, ‌చాంగ్‌ల పస్‌, ‌తంగ్లంగ్‌ ‌పస్‌, ‌సన్మార్గ, మనలి వంటి ప్రసిద్దమైన ప్రదేశాలను విహరించారు. వాటిలో డ్రస్‌ ‌ప్రపంచంలోనే రెండోవ అత్యంత శీతల ప్రదేశంగా పేరుపొందింది, తంగ్లాంగ్‌ ‌ప్రపంచం లోనే ఎత్తైన పస్‌గా గుర్తించబడింది. హుండర్‌, ‌టర్తుక్‌ ‌వంటి ప్రదేశాలకు చేరుకోవటానికి కటినామైన రోడ్డు మర్ఘలలో ప్రయాణం చేశారు.వారి సాహస యాత్రలో భాగంగా ఒకే రోజులో అగ్రా నుండి ఆదిలాబద్‌ ‌వరకు 910 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇలా జంటగా సాహస యాత్ర చేసిన మొదటి తెలుగు జంట వేరే. వారి యాత్ర ఏమి అంత సులభంగా సాగలేదు, వారికి పంగోంగ్‌లో నివసించటానికి చోటు దొరకలేదు, వారి తిరుగు ప్రయాణంలో హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లోనే మండి నుండి చండీగఢ్‌ ‌వెళ్ళే రహదారిలో 16 కిలోమీటర్ల ట్రాఫిక్‌ ‌జామ్‌లో ఇరుకున్నరు. ఆ ప్రదేశంలో రోడ్డు ప్రమాదాలు తరుచూ జరుగుతుంటాయి. రోజంతా ట్రాఫిక్లో ఇరుక్కన వారికి ట్రాఫిక్‌ ‌క్లియర్‌ అయిన తర్వాత కూడా ఒక చేదు అనుభవం ఎదురైంది, ఒక లారీ విచక్షణారహతంగా విజయ్‌ ‌వల్ల వాహనాన్ని వెనుకనుంచి గుద్ది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు లారీ డ్రైవర్‌, ‌బండి మీద ఉన్న విజయ్‌ ‌మరియు శ్వేత యెడమ వైపు ఉన్న కలువలో పడ్డారు, అదృష్టపుషతు వారు గాయాలతో బయటపడ్డారు. మొదట వారికి సహాయం చేయటానికి ఎవరు మందికి రాలేదు అని విజయ్‌మ ప్రతినిధితో అన్నారు. హైదరాబాద్‌ ‌చేరుకున్న విజయ్‌ ‌మరియు శ్వేత దంపతులు మా ప్రతినిధితో మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘‘ఈ 23 రోజులు మా జీవ్తంలోనే అద్భుతమైన రోజులు, ఎన్నెన్నో మధుర జ్ఞపాకాలను అందించింది. ఈ యాత్ర మాకు మన దేశంలోనే ఉన్నా వివిధ ప్రదేశాలలో వివిధ వాతావరణ పరిస్థితుల గురించి నేర్పింది. కటిమమైన పరిస్థితులలో ఎలా బ్రతకాలో నేర్చుకున్నాము. -6 ల బరించలేని చలిని మొదటిసారి ఎదురుకున్నాము. భారతీయ త్రివిధ దళాలు మరియు బీ. అర్‌. ఓ ‌తమ అద్భుతమైన సహకారం వలన యాత్రికులకు మరియు రైడర్లకు ఇంతటి అద్భుతాన్ని వీక్షించే అవకాశం దక్కింది. వారి శ్రమ, పట్టుదల, దేశ రక్షణ బాధ్యతల గురించి ఎంత మాట్లాడిన తక్కువే. ఇంతటి కాటినమైన ప్రదేశాలలో రహదారి ఏర్పాటు చేయటం మరియు మరమ్మతులు సరియైన సమంలో చేయటం అంటే మముల్‌ ‌విషయం కాదు అంతటి మహత్‌ ‌కటినమైన్‌ ‌పనిలలో పాల్గొన్నవారందరీకి జోహార్‌. ‌మా యాత్ర ద్వారా రోడ్డు భద్రత అవగాహన గురించి తెలియజేయటం మరియు, మా లాంటి ఎందరో జంట రైడర్లలకు స్ఫూర్తిగా నిలవాలన్నాది మా ఉద్దేశం.’’