అది భారత సార్వభౌమ అంశం

యూఎన్‌హెచ్‌ఆర్సీకి భారత ప్రభుత్వం ధీటైన జవాబు

న్యూఢల్లీి: పౌరసత్వ సవరణ చట్టం అంశంలో జోక్యాన్ని కోరుతూ ఐరాస మానవ హక్కు హైకమిషనర్‌(యూఎన్‌హెచ్‌ఆర్సీ) సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండిరచింది.  సీఏఏ భారత అంతర్గత వ్యవహారాకు సంబంధించిన అంశమని పేర్కొంటూ వారికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ ఓ ప్రకటనలో వ్లెడిరచారు. చట్టాు చేయడం భారత సార్వభౌమ హక్కుగా అభివర్ణించారు. కాబట్టి భారత సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాల్లో ఏ విదేశానికి జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. సీఏఏ రాజ్యాంగ మివకు కట్టుబడి ఉందనే విషయంలో భారత్‌ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశం నిర్దేశించిన చట్టానికి అనుగుణంగా ఇక్కడ పరిపాన జరుగుతోంది అన్నారు. మా స్వతంత్ర న్యాయవ్యవస్థపై అందరికీ పూర్తి గౌరవం, నమ్మకం ఉంది.. మా గొంతును, చట్టబద్దమైన స్థానాన్ని సుప్రీంకోర్టు నిరూపిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.
సీఏఏ అంశంలో జోక్యాన్ని కోరుతూ యూఎన్‌హెచ్‌ఆర్సీ సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జెనీవాలోని భారత కార్యాయానికి మానవ హక్కు హై కమిషనర్‌ సోమవారం తెలియజేశారని విదేశాంగ శాఖ తెలిపింది.