నె రోజుల్లో ‘స్థానిక’ ప్రక్రియ పూర్తిచేయాలి

అధికారుకు సూచించిన ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి

విజయవాడ:
నెరోజుల్లోపు స్థానిక సంస్థ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారును ఆదేశించారు. స్థానిక సంస్థ ఎన్నిక నిర్వహణపై అధికారుతో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈనెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికు నిర్వహించాని చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణకోసం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని సీఎం గుర్తుచేశారు. నగదు, మద్యం పూర్తిగా నిరోధించాన్న ద ృక్పథంతోనే ఆ ఆర్డినెన్స్‌ తెచ్చామన్నారు. నగదు పంపిణీ చేసినట్లు ఎన్నిక తర్వాత నిర్ధారణ అయినా అనర్హత వేటు వేస్తామని.. రెండు, మూడేళ్లు వారికి జైు శిక్ష పడుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీు నగదు, మద్యాన్ని అరికట్టాని.. స్థానిక ఎన్నికను పోలీసు యంత్రాంగం ఛాలెంజ్‌గా తీసుకోవాని సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రను, గ్రామంలో మహిళా పోలీసును పూర్తిస్థాయిలో వినియోగించాని సీఎం ఆదేశించారు. ఎక్కడా నగదు, మద్యం పంపిణీ చేశారన్న మాట రాకూడదన్నారు.
ఎవరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వచ్చి రూ.కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెవడం కాదని.. గ్రామంలో ప్రజకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసే వ్యక్తులే ఎన్నికవ్వాని సీఎం ఆకాంక్షించారు. అందుకే పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణు చేశామని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నిక ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాన్నారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాు, ఉ్లంఘన నిరోధానికి ఉపయోగించిన మాదిరిగానే ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాని జగన్‌ ఆదేశించారు. గ్రామాల్లో ఉండే పోలీస్‌ మిత్రు, సచివాయాల్లో ఉండే మహిళా మిత్రు, గ్రామ వాంటీర్లు, గ్రామ సచివాయ ఉద్యోగు వద్ద ఈ యాప్‌ ఉండాని సీఎం దిశానిర్దేశం చేశారు.
వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంకావాలి
 కరోనా వైరస్‌ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెంగాణలో కోవిడ్‌-19 కేసు నమోదయ్యిందని ఆయన గుర్తు చేశారు. గల్ఫ్‌ దేశాల్లో వైరస్‌ బాగా విస్తరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదని, ప్రజను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కానీ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాని సీఎం వ్లెడిరచారు.  జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాని ఆయన అధికారును ఆదేశించారు.
ముందస్తుగా సన్నద్ధం కావాలి..
‘సిబ్బందికి శిక్షణ చాలా ముఖ్యం. వైద్యాధికారును కుపుకుని శిక్షణ కార్యక్రమాపై కార్యాచరణ ముఖ్యం. ప్రజను చైతన్యం చేయాలి. కరోనా వైరస్‌ ఎలా వస్తుంది? వస్తే ఏం చేయాలి? అన్నదానిపై ప్రచారం చేయాలి. ప్రతి గ్రామ సచివాయంలో కరపత్రాను అతికించాలి. బాడీ మాస్క్‌ు, మౌత్‌ మాస్కును అందుబాటులో ఉంచుకోవాలి. ఆర్డర్లు ఇప్పటినుంచే ఇస్తే మంచిది. అప్పటికప్పుడు ఆందోళన చెందే కన్నా.. ముందస్తుగా సన్నద్ధం కావాలి’అని సీఎం పేర్కొన్నారు.
రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ఏర్పాటు
కరోనా వైరస్‌పై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లకు వివరాు అందించారు. కేవం 5 శాతం కేసుల్లో మాత్రమే కరోనా వ్ల ప్రమాదకర పరిస్థితున్నాయని ఆయన తెలిపారు.వయోవ ృద్ధు ఎక్కువగా విషమ పరిస్థితు ఎదుర్కొంటున్నారని అన్నారు. సార్స్‌ను మనం వియవంతంగా ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా డాక్టర్‌ జవహర్‌రెడ్డి గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీు ఏర్పాటు, ఐసోలేషన్‌ ప్రక్రియ ముఖ్యమైందని ఆయన స్పష్టం చేశారు. కరోనాను డీల్‌ చేయడానికి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామని, రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన దేశానుంచి వచ్చే ప్రయాణికుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.