వీధి ఒకటి

నగరంలో సరిపడ నైట్‌ షెల్టర్లు లేక అవస్థలు పడుతున్న నిరాశ్రయులు 
  • -నగరంపై ముసురు పట్టిన వర్షాలు 
  • – నైట్‌ షెల్టర్లు లేక అల్లాడుతున్న నిరాశ్రయులు
  •  -కోటిమంది జనాభా గల సిటీలో 12 షెల్టర్లే
  •  -ఏళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాని వైనం
  •  -నాలుగేళ్ల క్రితం సర్వేలో బాధితులు 3500 మంది
  •  -గతేడాది 1491 మందినే గుర్తించిన అధికారులు
  •  -రీ సర్వేకి ఆదేశించిన కేంద్ర బందం..
  •  -ఇప్పటికీ ప్రారంభించని గ్రేటర్‌ అధికారులు 

హైదరాబాద్‌: 
వివిధ పనుల కోసం సిటీకి వచ్చే పేదవారు, రోజు కూలీలు, బిచ్చగాళ్లు, నిరాశ్రయులకు తల దాచుకునేందుకు నీడ లేక.. ఉండటానికి సరైన వసతులు లేక రోడ్డు పక్కన, దుకాణాల అరుగులపై దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నగరంలో తగినన్ని నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్న జీహెచ్‌ఎంసీ ప్రకటనలు ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జీహెచ్‌ఎంసీలో దాదాపు 200 నైట్‌ షెల్టర్లు అవసరముంది. కానీ జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్నది 12 షెల్టర్లు మాత్రమే. వాటిలో పరిస్థితుల సంగతెలా ఉన్నా.. కనీస ఆశ్రయం లేక వేలాదిమంది రోడ్ల పక్కన, డివైడర్ల మీద, మూసివేసిన దుకాణాల షట్టర్ల వద్ద చలితో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లోని రోగులకు సహాయకులుగా వచ్చినవారు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ఇలాంటి వారు అధికసంఖ్యలో ఉన్నారు. పటిపూట సైతం వర్షాలు కురుస్తుండగా, రాత్రుళ్లు దోమల బాధ మరింత ఎక్కువకావడంతో వారు అల్లాడుతున్నారు. 
అమలుకు నోచుకోని హామీలు 
గ్రేటర్‌లో నైట్‌షెల్టర్ల సంఖ్యను పెంచుతామని నాలుగేళ్లుగా జీహెచ్‌ఎంసీ చెబుతున్నా నేటికీ అమలు చేయలేదు. విశ్వనగరం పేరిట ఫ్లై ఓవర్లు వంటివి త్వరితంగా పూర్తి చేసేందుకు శ్రద్ధ చూపుతున్న యంత్రాంగం.. అనాథలు, దీనులు, హీనులకు, ఆస్పత్రి అవసరాల కోసం వచ్చిన వారికి నీడనిచ్చే నైట్‌ షెల్టర్లపై శ్రద్ధ చూపడం లేదు. మరోవైపు ఉన్న నైట్‌ షెల్టర్లనూ తగిన సదుపాయాలు లేక వాటిని వినియోగించుకునే వారు అతి తక్కువగా ఉంటున్నారు. ఉన్న షెల్టర్లలో కనీస సదుపాయాలు లేకపోవడం.. అవి అవరనానికి దూరంగా, ఎవరికీ తెలియని ప్రాంతాల్లో ఉండడంతో అక్కడకు వెళ్లి ఉండేవారు కూడా తగ్గిపోతున్నారు. పైగా ఆయా షెల్టర్లలో తగిన పడకలు, తాగునీరు, కాలకత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు ఉండాలి. వీటితోపాటు లాకర్ల సదుపాయి, రాత్రిపూట రూ.5 భోజనం వంటి సదుపాయాలుండాలి. కానీ ఇవేవీ లేక పోవడంతో చాలా తక్కువ మంది మాత్రమే వీటిని వినియోగించుకుంటున్నారు. ఎక్కువమంది ఆస్పత్రుల పరిసరాల్లోనే వర్షాలకు తడుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. 
తూతూ మంత్రపు సర్వేలు 
నిరాశ్రయులను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు గతేడాది సర్వేలో చేపట్టారు. అందులో నగరంలో కేవలం 1491 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో 3,500 మంది ఉండగా, ఆ సంఖ్య స్రగం కంటే తగ్గిపోయింది. కోటిమంది జనాభా ఉన్న నగరంలో ఇంత తక్కువ మంది నిరాశ్రయులు ఉండడాన్ని విశ్వసించని కేంద్ర బందం మరోమారు సర్వే చేయాల్సిందిగా ఆదేశించి ఏడాదిన్నర దాటినా ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గ్రేటర్‌ అధికారుకుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. 
నగరంలోని నైట్‌షెల్టర్లు.. 
బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రి వద్ద నైట్‌ షెల్టర్‌ కాక జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీఓల నిర్వహణలో 12 షెల్టర్లున్నాయి. వాటిలో 380 మందికి వసతికి సదుపాయం ఉన్నట్లు చెబుతున్నా 200 మంది కూడా ఉండడం లేదు. ఎక్కువ మంది తమ అవసరాల కోసం వచ్చిన ప్రాంతాల్లోనే చలిలో గడుపుతున్నారు. ఎక్కువ మంది ఆస్పత్రుల వద్ద ఉంటున్నట్లు నాలుగేళ్లక్రితం సర్వేలో గుర్తించిన అధికారులు ఆయా ప్రదేశాల్లో నైట్‌ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్‌టీ, ఉస్మానియా, నిలోఫర్‌, గాంధీ, పేట్లబుర్జు, మహావీర్‌ ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. గాంధీ ఆస్పత్రి వద్ద స్థలం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ఆస్పత్రుల్లో మహావీర్‌, నిలోఫర్‌ వద్ద మాత్రం పూర్తికాగా, ఉస్మానియా, నిమ్స్‌, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రుల వద్ద త్వరలో పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అదికారులు చెబుతున్నారు. 
నగరంలో చాలీచాలని నైట్‌ షెల్టర్లు 
ప్రస్తుతం నగరంలో నిరాశ్రయుల సంఖ్య అధికమైంది. నగరానికి సూదూర ప్రాంతల నుంచి వివిధ పనులపై వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. ఇందుకు అనుగుణంగా నగరంలో షెల్టర్ల ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హయాంలో నగరంలో మొత్తంగా నాలుగు నైట్‌ షెల్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో రెండు మాత్రమే కార్యరూపం దాల్చాయి. ఒకటి వరంగల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో, హన్మకొండ భీమారం సీఆర్‌పీఎఫ్‌ క్యాంపు పక్కనే మరొకటి కొనసాగుతున్నాయి. వరంగల్‌ ఎంజీఎం సెంటర్‌, కాజీపేటలో నైట్‌ షెల్టర్స్‌ ప్రతిపాదనలు మాత్రం అటకెక్కాయి. ఉన్నవాటిలో ఆశ్రయం పొందుతన్న వారి సంఖ్య అధికమవుతోంది. కానీ ఆ మేరకు సౌకర్యాలు కల్పించడంలో జీడబ్ల్యూఎంసీ, మెప్మా దష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. 
అదనపు షెల్టర్లు అవసరం.. 
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం లక్ష జనాభాకు ఒక షెల్టరు ఉండాలి. ప్రస్తుతం నగర జనాభా 11 లక్షలు దాటింది. అంటే 11 షెల్టర్లు ఉండాలి. ఆస్పత్రులు, పోటీ పరీక్షలు, స్వల్ప కాలిక శిక్షణ కోర్సుల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. లాడ్జిలు, ప్రైవేట్‌ హాస్టల్స్‌లో బస చేయడం వారికి భారమవుతోంది. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల కోసం వచ్చిన వారు హన్మకొండ కొత్త బస్‌స్టేషన్‌, జంక్షన్‌, రోడ్లపైనే పడుకునే పరిస్థితి ఏర్పడుతోంది. 
మహిళలకు ప్రత్యేకంగా…. 
మహిళల కోసం ప్రత్యేకంగా నైట్‌ షెల్టరు నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలు, ఆస్పత్రులు, వివిధ పనులపై నగరానికి వచ్చే మహిళలు, విద్యార్థినీలకు ఉపయుక్తంగానూ, భద్రతగానూ ఉంటుంది. ప్రత్యేక షెల్టరు నిర్వహణను జీడబ్ల్యూఎంసీ గుర్తించాలి. 
78 మందికి పైగా గుర్తింపు .. 
వారం రోజుల కిత్రం జీడబ్ల్యూఎంసీ, మెప్మా నిరాశ్రయుల గుర్తింపు సర్వేను చేపట్టింది. పోలీస్‌ శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వామ్యమయ్యాయి. హన్మకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో రెండు బ ందాలుగా సర్వే జరిగింది. ఇందులో 78 మందికి పైగా నిరాశ్రయులను గుర్తించారు. అయితే సర్వే ఇంకా పకడ్బందీగా జరిపితే నిరాశ్రయుల సంఖ్య మరింతగా పెరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గుర్తించిన నిరాశ్రయులను ప్రస్తుతం ఉన్న రెండు షెల్టర్లకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 
సౌకర్యాలు అంతంత మాత్రమే… 
నగరంలో రెండు నైట్‌ షెల్టర్లలో సౌకర్యాల కల్పనపై జీడబ్ల్యూఎంసీ దష్టి సారించడం లేదు. నిరాశ్రయుల సంఖ్య అధికంతో స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికంగా భారమవుతోంది. వర్షాకాలం, చలి కాలం, తుఫాన్‌, ప్రకతి వైపరీత్యాల సమయంలో నైట్‌ షెల్టర్లను ఆశ్రయించే వారి సంఖ్య అధికం. బెడ్‌ల సంఖ్యను పెంచాలి. దుప్పట్లు, బ్లాంకెట్స్‌ అందించాలి. నిరాశ్రములకు ఆధార్‌, రేషన్‌కార్డు, పింఛన్‌ సౌకార్యలను సైతం జీడబ్ల్యూఎంసీ, మెప్మా కల్పించాలి. 
అంతా 50 ఏళ్ల పై వయస్కులే.. 
నైట్‌ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారిలో అత్యధికం 50 ఏళ్లపై వయస్కులే. వీరికి ఉన్న చోటనే వైద్య సదుపాయం కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు వారికి ఆరోగ్యం సహకరించడం లేదు. పక్షం రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంది. 

శ్రీనివాస్‌గౌడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటా కింద 2015లో టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన కే యాదవరెడ్డి.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయించడంతో టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు మేరకు శాసనమండలి చైర్మన్‌ అనర్హత వేటువేశారు. దీంతో యాదవరెడ్డి హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అనర్హత వేటు సరైనదేనని తీర్పువచ్చింది. 
ఈ ఎమ్మెల్సీ స్థానానికి 2021 జూన్‌ 3 వరకు పదవీకాలం ఉన్నది. ఉపఎన్నిక అనివార్యం కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 1వ తేదీన షెడ్యూల్‌ను ప్రకటించింది. 7వ తేదీ నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న నామినేషన్ల పరిశీలన, 19న ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఏకగ్రీవం కాకుంటే 26న ఎన్నిక నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ఓట్లను లెక్కిస్తారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. 
‘కశ్మీర్‌’ అంశంపై కమిటీ