14 నుంచి‘భారత్ న్యాయ యాత్ర’
- పార్లమెంట్ ఎన్నికల వేళ
- రాహుల్ రెండోవిడత యాత్ర
- భారత్ న్యాయ యాత్రగా నామకరణం
- జనవరి 14 నుంచి మార్చి 20 వరకు కొనసాగింపు
- 14 రాష్టాల్ల్రో 6200 కిలోమీటర్ల యాత్ర
- మణిపూర్‌లో ప్రారంభం..ముంబాయిలో ముగింపు
న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్ :
పార్లమెంట్ ఎన్నికలు దూసుకు వస్తున్న వేళ..కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి యాత్ర చేపట్టను న్నారు.’భారత్ న్యాయ’ పేరిట ఈసారి యాత్ర నిర్వహించ నున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి ప్రారంభించి పశ్చిమ తీరం వరకూ యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14న యాత్ర ప్రారంభం కానుంది. మార్చి 20న ముంబైలో రాహుల్ యాత్ర ముగియనుంది. 14 రాష్టాల్ల్రో 85 జిల్లాల దుగా ఈ యాత్ర జరగనుంది. ఈ మేకు కాంగ్రెస్ షెడ్యూల్‌ను ఖారరు చేసింది. ఈసారి యాత్రను హైబ్రిడ్ మోడ్‌లో రాహుల్ గాంధీ నిర్వహించనున్నారు. బస్ ద్వారా, అక్కడక్కడా కాలినడకన రాహుల్ భారత్ న్యాయయాత్ర సాగనుంది. ఇది రాజకీయ యాత్ర కాదని.. రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదని పార్టీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ రెండో దశ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సారి ఈ యాత్రకు ’భారత్ న్యాయ్ యాత్ర’ అనే పేరు పెట్టారు. మణిపూర్ నుంచి ముంబయి వరకూ రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 14 రాష్టాల్ల్రోఈ యాత్ర కొనసాగనుంది. మార్చి 20న యాత్ర ముగియనుంది. 6,200 కిలోటర్ల మేర యాత్ర కొనసాగనుంది. మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు. ’భారత్ జోడో యాత్రలో ఎదురైన అనుభవాల తో రెండోసారి రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ సారి యువత, మహిళలతో పాటు అన్ని వర్గాలతోనూ ఆయన మాట్లాడతారు. మొత్తం 6,200 కిలోటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ దుగా యాత్ర సాగుతుంది. చివరకు మహారాష్ట్రలో ముగుస్తుంది.ఈసారి కాలినడకనే కాకుండా బస్‌లో యాత్ర కొనసాగుతుంది. తేడాది సెప్టెంబర్ 7వ తేదీన ఫస్ట్ ఫేజ్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలైంది. దాదాపు 12 రాష్టాల్ర దుగా 4 వేల కిలోటర్ల మేర సాగిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగిసింది. దాదాపు 136 రోజుల పాటు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేశారు.అయితే…ఫస్ట్ ఫేజ్‌లో పూర్తిగా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఈ సారి మాత్రం హైబ్రిడ్ మోడ్‌లో సాగనుంది.అంటే…కొంత దూరం వరకూ నడక ద్వారా ఆ తరవాత వాహనాల్లో యాత్ర చేయనున్నారు.ఇటీవల జరిగిన 5 రాష్టాల్ర ఎన్నికల్లో మూడు రాష్టాల్లో్ర కాంగ్రెస్ డీలా పడింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.ఈ ఫలితాలతో కాంగ్రెస్ మరోసారి ఆత్మపరిశీలన లో పడింది. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ రెండోసారి జోడో యాత్ర నిర్వహించనున్నారు.