తెలుగు మహాసభలను విజయవంతం చేయండి

మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య

పాలకొల్లు,జ్యోతిన్యూస్‌ :
‌ప్రముఖ రాజకీయవేత్త,మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యని పాలకొల్లులోని వారి స్వగృహంలో కలసి ఆంధ్ర సారస్వత పరిషత్తు,చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని పరిషత్తు అధ్యక్షులు గజల్‌ ‌శ్రీనివాస్‌, ‌చైతన్య విద్యా సంస్థలు అధిపతి చైతన్య రాజు పక్షాన ఆహ్వాన పత్రికను పరిషత్తు ప్రతినిధులు అందజేశారు.ఈ సందర్భంగా హరిరామ జోగయ్య మాట్లాడుతూ తెలుగు మహాసభలు విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.అనంతరం జనసేన నేత చేగొండి సూర్య ప్రకాష్‌ ‌బాబు కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు పాలకొల్లు విభాగ సభ్యులు యర్రంశెట్టి వేంకట రత్నం నాయుడు,ఉన్నమట్ల ప్రేమ్‌ ‌కుమార్‌,‌చేగొండి రంగారావు,డాక్టర్‌ ‌పెద్దిరాజు కోలాటి తదితరులు పాల్గొన్నారు.