మాతృభాషని మర్చిపోవద్దు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :

ఆం‌ధ్ర సారస్వత పరిషత్‌ ‌మరియు చైతన్య విద్యా సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5,6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరుగుతున్నాయి.ఆ సమావేశ కరపత్రికను హైదరాబాద్‌ ‌లోని రెస్పాన్స్ ఇన్ఫర్మటిక్స్ ‌సీఈవో ఎం.రామ్‌ ‌కి ప్రసాద్‌ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమైన భాషలను నేర్చుకోవాలని,మాతృభాషని మర్చిపోరాదని,తెలుగువారి ఎక్కడ కలిసిన తెలుగులో మాట్లాడటం అలవాటు చేసుకోవాలని,ఎవరైనా ఎవరైనా భాషకి ‘‘సలాం’’చేయవలసిందేనని, భాష చుట్టే నాగరికత అభివృద్ధి చెందుతుందని, అమ్మ రుణం, భాష రుణం తీర్చుకోలేనివని అన్నారు. భాషకు సంబంధించిన కార్యక్రమాలు తరచుగా జరుపుకోవాలని,కవులను, పండితులను సత్కరించుకోవాలని అన్నారు.జనవరి 5వ తేదీన పూర్ణకుంభ పురస్కారాలు, జనవరి 6వ తారీఖున జరిగే ‘‘తెలుగు తోరణం’’అనే సాంస్కృతిక కార్యక్రమం ఉందన్నారు.5,6,7 తేదీలలో తెలుగు భాషకు సంబంధించిన 25 సదస్సులు ఉన్నాయని అందులో ఎంతోమంది కవులు,పండితులు,సినీ,టీవీ కళాకారులు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని,ఐదుగురు గవర్నర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు.ఆంధ్ర సారస్వత పరిషత్‌ ‌కొత్త తరం ఉత్సవ కమిటీ సంచాలకులు వాత్సవ,సుభాష్‌లు మాట్లాడుతూ 5, 6, 7 తేదీలలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు,సాహిత్య కార్యక్రమాలు, తెలుగు భాషలోని వివిధ సాహిత్య పక్రియలపై సదస్సులు జరుగుతున్నాయని, అందరూ ఆహ్వానితులేనని తెలిపారు.