చావుడప్పు కొట్టి సాధించేదేమిటి ?

  • ‘అడ్డుకోవడమే’ లక్ష్యమా..?
  • బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యమా ?
  • టిఆర్‌ఎస్‌ ‌పోరుబాట వెనక కారణలు ఇవేనా ?
  • ధాన్యం కొనుగోళ్లతో చేస్తున్న ధర్నాలు కలసివచ్చేనా ?
  • తృతీయ ఫ్రంట్‌ ‌వైపు మళ్లీ కేసీఆర్‌ అడుగులు పడేనా ?
  • పార్టీని బలోపేతం చేసేందుకే ఉపయోగం ?
  • రైతుల తక్షణ సమస్య ధాన్యం సేకరణ మాత్రమే
  • కేంద్రాన్ని నిలదీసే క్రమంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు
  • రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు
  • రాష్ట్ర రాజకీయాలపై రాజకీయ విశ్లేషకుల మథనం

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల టిఆర్‌ఎస్‌ను భయపెడుతోందా…హుజూరాబాద్‌ ఉపఎన్నికల ఫలితం తరవాత టిఆర్‌ఎస్‌ ‌రూటు మార్చడానికి కారణం ఏమిటి అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కేవలం ధాన్యం కొనుగోళ్ల తో బిజెపికి వ్యతిరేకంగా తీసుకున్న టర్న్ ‌కారణంగా ముందుగా నష్టపోయేది టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే అని ఆ పార్టీ అధినేత గుర్తించడం లేదు.రైతుల ధాన్యం కొనకపవోడం, వచ్చే యాసంగిలో కిలో ధాన్యం కూడా కొనబోమని చెప్పడం ద్వారా రైతుల్లో అనవసర వ్యతిరేకతలను టిఆర్‌ఎస్‌ ‌మూటగట్టుకుంటోందని గుర్తించడం లేదు. కేంద్రంపై పోరాటం చేయడానికి సమస్లయు వేరుగా ఉండాలి.ధాన్యం సమస్యతో యుద్దం చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. నిజానికి ఇంతకాలం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఓ రకంగా బిజెపికి అంటకాగింది.ప్రధాని మోడీ తీసుకున్న అనేక నిర్ణయాలకు తలూపింది. మోడీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలపై కూడా టీఆర్‌ఎస్‌ ‌మొదట తటస్థ వైఖరిని అనుసరించింది. రైతు ఆందోళనలకు మద్దతు ఇవ్వలేదు. చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేయలేదు. కాబట్టి కేంద్రంతో టీఆర్‌ఎస్‌ ‌విధానం లోపాయకారిగా అనుకూలంగా నడిచిందన్న ఆరోపణల వచ్చాయి.మోడీ కనుసన్నల్లో కేసీఆర్‌ ‌నడుస్తున్నారనే భావన కలిగించింది.ఈ ఏడేళ్లలో ఈ భావన బలపడింది. ఐతే, హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఓటమి తరువాత బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ ‌తప్పనిసరి పరిస్థితిలో తన విధానం మార్చుకోవాల్సి వచ్చింది. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు దానిని సూచిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ వర్గాలలో ఫ్రెండ్లీ పార్టీగా పేరున్న తెలంగాణ రాష్ట్ర సమితి చివరకు ఎదరుదాడికి దిగే పరిస్థితి తెచ్చుకోవడం వెనక బిజెపి బలపడకుండా చూడలన్న లక్ష్యం తప్ప మరోటి కాదు. తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ బలానికి నిదర్శనంగా విశ్లేషకులు ఈ పరిణామాలను చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా పార్టీ పుంజుకుంది. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి చేతిలో కేసీఆర్‌ ‌కూతురు కవిత ఓటమి పాలైంది. దాంతో టీఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తమైంది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన టీఆర్‌ఎస్‌లో గుబులు రేపింది. ఇటీవల హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమి కేసీఆర్‌ ‌కు పెద్ద షాక్‌ అని చెప్పాలి. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కేసీఆర్‌ ఆం‌దోళనకు కారణం కావచ్చు. బహుశా ఆందుకే ఆయన తాత్కాలికంగా అయినా కాంగ్రెస్‌తో కలిసి నడవాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంశాల ప్రాతిపదికన పోరాడేందుకు టీఆర్‌ఎస్‌ ఇతర ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపింది. వివాదాస్పద వరి సేకరణ సమస్యపై ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతును టీఆర్‌ఎస్‌ ఆశిస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు తటస్థ వైఖరిని అనుసరించింది.చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్ధించింది. బిల్లులకు మద్దతిచ్చింది.లేదంటే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించిందే తప్ప ఏనాడూ వ్యతిరేకత ప్రదర్శించలేదు. మోడీ సర్కార్‌ని విమర్శించటం పెద్దగా చేయలేదు. ఎన్నికల వేళ మాత్రమే పరస్పర విమర్శలకు పదను పెట్టాయి. ఎన్నికల తరువాత మళ్లీ షరా మామూలే అన్నట్లుగా ఇంతకాలం చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. నిజానికి దుబ్బాక తరవాత కూడా బిజెపి అంటే టిఆర్‌ఎస్‌ ‌పెద్దగా పట్టించుకోలేదు. ఇకపోతే మారిన రాజకీయాల నేపథ్యంలో ఇప్పుడు వివాదాస్పద సాగు చట్టాలు,లఖింపూర్‌ ‌ఖేరీ దుర్ఘటన,విద్యుత్‌ ‌సంస్కరణలు, పెరుగుతున్న ఇంధన ధరలు, చైనా దురాక్రమణతో పాటు ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వంపై కేసీఆర్‌ ‌విరుచుకుపడ్డారు. పార్టీ ఇప్పటి వరకు అనుసరిస్తున్న తటస్థ వైఖరిని వదిలి పెట్టాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చెప్పారు. ఎంపీలకు దీనిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో తొమ్మిది మంది, రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరు ఇతర ప్రతిపక్ష పార్టీల సమన్వయంతో కేంద్రానికి వ్యతిరేకంగా తమ దాడిని తీవ్రం చేసారు. ఈ పార్లమెంట్‌ ‌సమావేశాలను బహిష్కరించారు. నిజానికి, బీజేపీని టార్గెట్‌ ‌చేస్తూ టీఆర్‌ఎస్‌ ‌వ్యూహాత్మకంగా వరి కొనుగోలు అంశాన్ని తెరవి•దకు తెచ్చింది. కాబట్టి దీనిని కేంద్రం వర్సెస్‌ ‌టీఆర్‌ఎస్‌లా కాకుండా బీజేపీ వి•ద టీఆర్‌ఎస్‌ ‌యుద్ధంగా చూస్తే బాగుంటుంది. ధాన్యం కొనుగోలు అంశంపై కొద్ది రోజులుగా బీజేపీని, కేంద్రాన్ని కేసీఆర్‌ ‌దునుమాడుతున్నారు. రైతుల ధర్నాలు.. నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుత పార్లమెంట్‌ ‌సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు దీనిపై గట్టిగానే పోరాడారు. దీంతో 20న సోమవారం మరోమారు ధర్నాలను చేపట్టారు. మరోవైపు, ఈ పరిణామాలను బీజేపీ మరోలా తీసుకుంటోంది.2023 ఎన్నికల్లో బీజేపీయే తన ప్రత్యర్థిగా కేసీఆర్‌ ‌డిసైడ్‌ అయ్యారని ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ ‌పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని కమలం పార్టీ నాయకులు అంటున్నారు.అయితే, బీజేపీకి ధీటుగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార నినాదాన్ని సృష్టించే దిశగా కేసీఆర్‌ ‌పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.ఈ పరిణామాలు తృతీయ ఫ్రంట్‌కు దారితీస్తాయా లేదా అన్నది చూడాలి.
సాధించేదేమిటీ…?
తెలంగాణలో బిజెపికి చావుడప్పు కొట్టిన టిఆర్‌ఎస్‌..‌రాజకీయంగా కొంత మైలేజీని సాధించినా…అంతే మొత్తంలో రైతుల ఆగ్రహానికి కూడా కారణమయ్యింది.ధాన్యం కొనుగోలు చేయడం ఎవరి బాధ్యత అన్నది రైతులకు అనవస రం.రాష్ట్రంలో ధాన్యం కొనడంలేదన్న బాధలో రైతులు ఉన్నారు.వారిని అనునయించి ధాన్యం కొనడానికి బదులు.. చావుడప్పు మోగించడం వల్ల రైతుల సానుభూతి మాత్రం దక్కదని టిఆర్‌ఎస్‌ ‌నేతలు గుర్తించడం లేదు. ఓ వైపు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తూ…చావుడప్పు కొట్టివుంటే రైతుల మద్దతు దక్కేది.కానీ బిజెపిని ఎదురించడానికే ఈ చావుడప్పు అని అందరికీ తెలిసిపోయింది.బిజెపి నుంచి పొంచివున్న ముప్పును ఎదుర్కొనేందుకే అని తెలిసి పోయింది. ప్రజల్లో టిఆర్‌ఎస్‌ ‌బలహీనతలను కప్పిపుచ్చుకుని, పార్టీ కార్యకర్తల్లో స్థాయిర్యాన్ని నింపడానికి ఇది పనికి వచ్చింది. ’ధాన్యం కొంటరా…కొనరా’ ఏదో ఒక్క మాట చెప్పండి అని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గతంలోనే నిలదీశారు.దానికి కేంద్రం కూడా సమాధానం చెప్పింది.మరోమారు మంత్రుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. అయినా తెలంగాణలో చావుడప్పు కొట్టడం వల్ల బిజెపి బెదిరిపోతుందని అనుకున్నా..తమకు మైలేజీ వస్తుందని అను కున్నా టిఆర్‌ఎస్‌ ‌నేతలు పొరపాటు చేసినట్లు కాగలదు.ప్రతి ధాన్యం గింజను కొంటామని,ఎంతయినా పంటను పండించండని చెప్పింది టిఆర్‌ఎస్‌ అన్న విషయం మరవరాదు.తెలంగాణ రైతుపై కేంద్రం వివక్ష చూపుతో ందని చెప్పడానికి బలమైన ఆధారాలు ఏవీ లేదు.అయితే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర విధానాలకు అనుగుణం గా ముందుకు సాగి..మిగిలిన పంట ఉంటే రాష్ట్రం బాధ్యత వహించి ఉంటే బాగుండేది. రాష్ట్రంలో పసిడి పంటలు పండుతుంటే బాధ్యతగా కొనాల్సింది పోయి కొర్రీలు వేస్తారా అని మండిపడ్డ టిఆర్‌ఎస్‌..‌చావుడప్పు కొట్టడం వల్ల విపక్షాలను కూడా నమ్మించలేరు. తెలంగాణ టిఆర్‌ఎస్‌ ‌నాయ కత్వంలో చావుడప్పులు, ధర్నాలతో దద్దరిల్లింది. నాలుగు కూడళ్లలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఇప్పటికైనా మోడీ తమ నిరసనలు చూసి కళ్లు తెరవాలని హితవుపలికారు. నల్లజెండాలు చేతబట్టుకుని, చావు డప్పులు మోగిస్తూ వేల సంఖ్యలో చౌరస్తాల వద్దకు కదిలారు. రైతులను రాజకీయంగా వాడుకోవద్దని, టిఆర్‌ఎస్‌కు వాళ్లను దూరం చేసే కుట్రలకు పాల్పడవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేయడం మానుకొని చేయాలని నినదించారు. ’ఊరూరా చావు డప్పు’ పేరిట నిర్వహించిన ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎ ‌లు, టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరి కంకులు చేతపట్టకుని, ధాన్యం బస్తాలను నెత్తిన పెట్టుకుని ఎండ్ల బండ్ల ర్యాలీలు తీస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఇదంతా తోణ సమస్యను పరిష్కరించే చర్య కాదు. పుండువి•ద కారం చల్లినట్లుగా రైతులను అనవసరంగా రెచ్చగొట్టేలా మాత్రమే ఉంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న తీరును గర్హిస్తూ చావుడప్పుల నిరసనలతో లాభం లేదని గుర్తించాలి.కేంద్రంతో పోరాడాల్సిన పద్దతి ఇది కాదని గుర్తించాలి. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ ‌చేయాల్సిందే. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిలదీయాల్సిందే.ఈ విషయంలో మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరగాల్సిందే. రైతులను మోడీ ఆగం చేస్తున్నదని చెప్పగలగాలి. నిజానికి రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పించడం వల్లనే తెలంగాణలో రైతులు వరి వేసారు. ప్రభుత్వం మాటలను నమ్మి రైతులు పెద్ద ఎత్తున వరిని పండించి మోసపోయా రు.తమకు టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఉన్నారు.ఇక్కడ కేంద్రం వేరన్న విషయం రైతులకు తెలియదని గుర్తిచాలి.దేశానికి అన్నం పెట్టే రైతులు చల్లగా ఉండాలంటే కేంద్రం లేదా రాష్ట్రం సమన్వయంతో పంటను కొనాల్సిందే. రైతులు పండించిన ధ్యాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్రానికి గట్టిగా డిమాండ్‌ ‌చేయాల్సిందే. దేశంలో రైతులు పంటలు పండిన చోట ధాన్యాన్ని కొని,పండని చోట,ప్రకృతి విలయాలు ఏర్పిడన చోట ప్రజలకు అవసర మైన ధాన్యాన్ని అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన విధి కావాలి. పంటలు పండించడమే రాష్ట్రం బాధ్యత అని,దానిని పూర్తిగా కొనే బాధ్యత కేంద్రానిదేనని టిఆర్‌ఎస్‌ ‌వాదిస్తోంది. అయితే ఇది రైతులతో వాదించే సమయంకాదు. సిఎంగా కెసిఆర్‌ ‌బాధ్యతలు చేపట్టిన తరువాతనే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా అవుతోంది.టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాతనే పెట్టుబడి సాయంగా రైతులకు ఇప్పటికే రూ. 50వేల కోట్లు నగదుగా అందజేశారు. ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం యేటా రూ.45 వేల కోట్ల వెచ్చిస్తోంది. రైతులకు సాగునీరు వస్తుండడంతో పెద్దఎత్తున అందుబాటులోకి రావడంతో వరి బాగానే పండింది. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే.రైతులు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పథకాలు తీసుకొచ్చారన డంలో సందేహం లేదు.ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు వి•ద వర్షం పడ్డ చందంగా ప్రవర్తి స్తుందని టిఆర్‌ఎస్‌ ‌మండిపడడంలోనూ సందేహం అక్కర్లేదు.అయితే కేంద్రంతో మాట్లాడి నిరసనలు తెలియ చేయడంలో తక్షణ సమస్య పరిష్కారం కాదు.ముందుగా ధాన్యం సేకరణ జరగాలి. అప్పుడే రైతుల బాధలు తీరుతాయని గుర్తించాలి.అందుకు ధాన్యం సేకరణ ఒక్కటే తక్షణ పరిష్కారంగా చూడాలి.