‘కుటుంబపాలన’ సాగుతోంది…

  • ప్రశ్నించేవారంటే కేసీఆర్‌కు పడదు
  • ఎదురించే వారిని అణచివేసే మనస్తత్వం
  • హుజూరాబాద్‌లో బిజెపి గెలుపు ఖాయం
  • ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి

హుజురాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌రాష్ట్రంలో ప్రశ్నించేవారు ఉండొద్దనే కేసీఆర్‌ ఆలోచన అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హావి•లు ఏమయ్యాయో కేసీఆర్‌ ‌చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అబద్దాల, అవినీతి, కుటుంబ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ ‌బానిస అనుకుంటున్నారని చెప్పారు. ఈటలను, ఆయన భార్యను జైల్లో పెట్టడానికి కేసీఆర్‌ ‌కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటెలకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు. ఈటెల గెలుపు ఖాయమన్నారు. కెసిఆర్‌కు ఈ ఉప ఎన్నకతో పతనం ప్రారంభం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ‌కుటుంబపాలన సాగుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తండ్రీకొడుకులు, మామ అల్లుళ్లు,బావబామ్మర్దుల పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడుతారన్నారు.అబద్దాలు ప్రచారంచేసి, అడ్డదారిలో అధికారంలోకి రావాలనుకునే రోజులు పోయాయని, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమని పేర్కొన్నారు.’దేశంలో ఎన్నో రాష్టాల్రు, ఎన్నో ప్రాంతాల్లో ఎన్నికలు చూశాం.కానీ హుజూరాబాద్‌ ‌లాంటి ఉప ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంతగా బరితెగించింది ఎక్కడా లేదు. డబ్బు, మద్యం పంచడంతోపాటు ప్రజలను ప్రలోభాలకు,బెదిరింపులకు గురి చేస్తూ టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతో ందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ తమకు బద్దశత్రువని, అలాంటి పార్టీతో చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించడం సిగ్గుచేటన్న కిషన్‌రెడ్డి ఏ పార్టీల మధ్య చీకటి ఒప్పందం,బహిరంగ ఒప్పందాలు న్నాయో ప్రజలకు తెలుసని అన్నారు.టీఆర్‌ఎస్‌ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా,డబ్బులు,మద్యం ఏరులై పారించినా హుజూరా బాద్‌ ‌నియోజకవర్గ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారన్నారు.శవాల దగ్గర పేలాలు ఏరుకునే స్వభావమున్న నేతలు పెట్రోల్‌ ‌ధరలపై రాద్దాంతం చేస్తున్నారని,లీటర్‌కు రూ.40 పైచిలుకు రాష్టాన్రికి ఆదాయం వస్తుండగా,వాటిని ఎందుకు తగ్గించడం లేదని ఎద్దేవా చేశారు.హుజూరాబాద్‌ ఎన్నికల ఫలితాలు తప్పకుండా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతాయని,భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్తారని కిషన్‌రెడ్డి చెప్పారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అరాచకాలకు, బెదిరింపులకు, దాడులకు పాల్పడుతోందని, రోడ్‌షోలో ఉన్న తనపైనే దాడికి యత్నించడం అమానుషమని కిషన్‌రెడ్డి తెలిపారు.
…………………………