‘ఆం‌ధ్రా’లోనూ టీఆర్‌ఎస్‌..

  • ఆం‌ధ్రాలోనూ పార్టీ పెట్టమని కోరుతున్నారు
  • ఆదర్శంగా తెలంగాణ పథకాల అమలు
  • తెలంగాణలో కలుస్తామంటున్న కర్నాటక జిల్లాలు
  • ప్లీనరీ ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ ‌వెల్లడి

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు..ఇతర రాష్టాల్ర ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలిపారు.టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షోపన్యాసం చేశారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్ర నుంచి వేల విజ్ఞాపనలు వచ్చాయి.ఆంధప్రదేశ్‌లో వి• పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో మంచి పథకాలు అమలవుతున్నాయని, ఆ రాష్ట్రంలో మమ్మల్ని కూడా కలపాలని కోరుతూ నాందేడ్‌, ‌రాయచూర్‌ ‌జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు వచ్చి పని చేస్తున్నారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు.కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. పాలమూరులో పెండింగ్‌ ‌ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. సాహసం లేకుండా ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయి. తెలంగాణలో అద్భుతంగా వ్యవసాయ స్థీరీకరణ జరిగింది. మనం విడిపోయిన ఏపీ తలసరి ఆదాయం రూ. 1.70 లక్షలే. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.35 లక్షలకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్‌ ‌సమస్యలు వస్తాయని కొందరు ఏపీ నేతలు అపోహలు సృష్టించారు. కానీ తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్‌ ఇస్తున్నాం. ఆంధ్రాలో 24 గంటల కరెంట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతందని సీఎం కేసీఆర్‌ అన్నారు.