దేశంలో కరోనా కేసులతో పాటు, మరణాలు తగ్గుముఖం

  • తాజా నివేదిక వెల్లడించిన ఆరోగ్యశాఖ
  • వ్యాక్సిన్ల పక్రియపైనా నీతి ఆయోగ్‌ ‌వివరణ
  • కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న దేశం
  • రికవరీ రేటు 90శాతానికి పెరిగిందన్న నీతి ఆయోగ్‌
  • ‌కర్నాటకలో డిశ్చార్జ్ ‌కరోనా రోగులకు బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌టెస్టులు
  • బెంగాల్లో జూన్‌ 15 ‌వరకు లాక్‌డౌన్‌ ఆం‌క్షలు పొడిగింపు
  • సింగరేణిలో కరోనా కలకలం
  • లాక్‌డౌన్‌ ‌పెట్టి ఉత్పత్తి నిలిపి వేయాలి
  • కరోనా బాధితులకు వైద్యం అందించాలి
  • కార్మిక సంఘాల నేతల డిమాండ్‌

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌దేశంపై కరోనా కాస్త కనికరం చూపించింది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య శాఖ మంత్రి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 2.11 లక్షల కేసులు నమోదు కాగా, 3,847 మరణాలు సంభవించాయి. ఈ సంఖ్యలతో దేశంలో ఇప్పటి వరకు 2,73,69,093 మంది కరోనా బారిన పడగా…3,15,235 మంది మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో 2,83,135 మంది డిశ్చార్జి కాగా, మొత్తంగా 2,46,33,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24,19,907 క్రియాశీలక కేసులున్నాయి. తమిళనాడులో 33,764 కేసులు, కేరళలో 28,798 కేసులు, కర్ణాటకలో 26,811 కేసులు, మహారాష్ట్ర 24,752 కేసులు, ఆంధప్రదేశ్‌లో 18,285 కేసులు వెలుగుచూశాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండే 62.66 శాతం కేసులు నమోద య్యాయి. ఇదిలావుంటే కరోనా టెన్షన్‌లో ఏది నిజం, ఏది అబద్దమో తెలియకుండా పోతోంది. వైరస్‌ ‌ధాటికి జనం పుకార్ల ఉచ్చులో పడిపోతున్న వేళ నీతి ఆయోగ్‌ ‌స్పస్టత ఇచ్చింది. వ్యాక్సినేషన్‌ ‌పక్రియపై ఉన్న అపోహలను తొలగిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. నీతి ఆయోగ్‌ ‌సభ్యుడు, నెగ్‌వాక్‌ ‌చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌వినోద్‌ ‌పౌల్‌ ఓ ‌ప్రకటన విడుదల చేశారు. సోషల్‌ ‌డియాలో షికారు చేస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఏడు రకాల అపోహలకు ఆయన సమాధానం ఇచ్చారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌ ‌కోసం కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వస్తున్న పుకార్లకు ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం కూడా చిన్న పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వడం లేదన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న అంశంపై ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. కానీ చిన్నారుల్లో పనిచేసే రీతిలో వ్యాక్సిన్లు ఉన్నట్లు తెలుస్తోంద న్నారు. భారత్‌లో చిన్నారులపై వ్యాక్సిన్‌ ‌ట్రయల్స్ ‌త్వరలో జరగనున్నాయని, కానీ వాట్సాప్‌లో వస్తున్న సందేశాల ద్వారనో.. లేక రాజకీయవేత్తల ఆరోపణల ద్వారనో.. చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ‌జరగదని, డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు తీసుకు నే నిర్ణయం ఆధారంగా చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ‌పక్రియ ఉంటుందని డాక్టర్‌ ‌వినోద్‌ ‌పౌల్‌ ‌తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవుతున్న వ్యాక్సిన్లకు భారత్‌ అనుమతి ఇవ్వడం లేదని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ, యురోపియన్‌ ‌మెడికల్‌ ఏజెన్సీ, బ్రిటన్‌కు చెందిన ఎంహెచ్‌ఆర్‌ఏ, ‌జపాన్‌కు చెందిన పీఎండీఏ, డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ జాబితాలో ఉన్న టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు డాక్టర్‌ ‌వినోద్‌ ‌పౌల్‌ ‌చెప్పారు. రాష్ట్రాలబాధ్యతను కేంద్రం విస్మరించిందన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు నిధులను ఇస్తూ నేరుగా రాష్ట్రాలకే టీకాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విదేశీ టీకాలకు త్వరగా అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ఒప్పందం ప్రకారమే పారదర్శకంగా ఆయా రాష్ట్రాలకు టీకాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
సింగరేణిలో కరోనా కలకలం….
సింగరేణి కార్మికులకు కరోనా భయం పట్టుకుంది. భూగర్భ గనుల్లో పనిచేస్తున్న కార్మికుల్లో పలువురు వైరస్‌ ‌బారినపడుతున్నారు. గనుల్లో కరోనా బారిన పడిన కార్మికుల ద్వారా వారి కుటుంబాలకు సైతం సోకుతోంది. మూడు సింగరేణి డివిజన్‌ల పరిధిలో కరోనా పరీక్షలు చేసిన వారిలో 30 శాతం మందికి పైగా కరోనా బారిన పడుతున్నారు. గత ఏడాది సింగరేణి యాజమాన్యం ఏప్రిల్‌ 1 ‌నుంచి మే 20 వరకు భూగర్భ గనులకు లే ఆఫ్‌ ‌ప్రకటించింది. 50 రోజుల పాటు భూగర్భ గనుల్లో పనులు నిలిపివేశారు. కేవలం ఓపెన్‌కాస్టులు మాత్రమే నడిపించిన సింగరేణి ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో రక్షణ చర్యలు సైతం చేపట్టడం లేదని కార్మికులు ఆందోళన చెందు తున్నారు. వేలాది మంది పనిచేసే గనుల్లో లాక్‌డౌన్‌ ‌విధించకపోవడంతో కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సింగరేణిలో లాక్‌డౌన్‌ ‌విధించి వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలతో పాటు కార్మికులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. మందమర్రి, శ్రీరాంపూర్‌, ‌బెల్లంపల్లిలో సింగరేణి డివిజన్‌లు ఉన్నాయి. బొగ్గు బావుల్లో నిత్యం వేలాది మంది ఒకే చోట పనిచేయాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటించి పనులు చేసే పరిస్థితి ఉండదు. పలువురు కార్మికులు మృతి చెందగా పలువురు కార్మికులు హోం క్వారంటైన్‌లో, మరికొందరు ఐసోలేషన్‌ ‌కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. దీంతో సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌ప్రకటించి తమకు రక్షణ కల్పించాలని కార్మికులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. మందమర్రి, శ్రీరాంపూర్‌, ‌బెల్లంపల్లి డివిజన్‌లలో 14 భూగర్భ గనులు ఉండగా 6 ఓసీపీలు ఉన్నాయి. ఇందులో దాదాపు 16 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా మూడు షిప్టులలో విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. సామూహికంగా ఒకేచోట పనిచేసే భూగర్భ గనుల్లో కరోనా వ్యాప్తి పెరుగుతుంది. గనుల్లోకి వెళ్లే ముందు మ్యాన్‌రైడింగ్‌తోపాటు చైర్‌లిప్ట్‌కార్‌ ‌ద్వారా వె ళ్లే సమయంలో కార్మికులందరు కలిసి ఉంటారు. గని లోపలికి వెళ్లిన తర్వాత కూడా ఒక్కో పని స్థలంలో ఐదుగురు, ఆరుగురు కలిసి పని చేయాల్సి ఉంటుంది. మ్యాన్‌రైడింగ్‌ ‌ద్వారా గనిలోకి దిగే సమయంలో కనీసం ట్రినకు 30 మంది వరకు ఒకే బోగిలో కూర్చుని వెళ్లాల్సి ఉంటుంది. కోల్‌ ‌కట్టింగ్‌, ‌సపోర్టింగ్‌, ‌టన్నెలింగ్‌, ‌రూఫ్‌ ‌బోల్టింగ్‌ ‌పనులు కార్మికులు కలిసి చేయాల్సి ఉంటుంది. ఒకరికి ఒకరు సహాయం చేస్తేనే ఈ పనులన్నీ ముందుకు సాగి బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఏ ఒక్క కార్మికునికి కరోనా వచ్చినా తోటి కార్మికులకు సోకే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం రోజురోజుకు కరోనా వైరస్‌ ‌విస్తరిస్తున్న నేపథ్యంలో సింగరేణిలో లాక్‌డౌన్‌ ‌విధించాలని కార్మిక సంఘాలు కూడా డిమాండ్‌ ‌చేస్తున్నాయి. భూగర్భ గనుల్లో భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహించేందుకు వీలుండదు. దీంతో ఒకరి ద్వారా మిగతా కార్మికులకు సోకుతుంది. గత సంవత్సరం లాక్‌డౌన్‌ ‌విధించిన విధంగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ‌విధించి కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. లేకపోతే ఆందోళనలు చేపడతాం. సింగరేణి, ప్రభుత్వం, కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించాలే తప్ప బొగ్గు ఉత్పత్తి కోసం కాదంటున్నారు.కరోనా సోకి ఎంతో మంది కార్మికులకు ప్రాణాలు పోతున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని అంటున్నారు. సింగరేణిలో లాక్‌డౌన్‌ ‌విధించి వేతనాలు చెల్లించాలి. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ గనుల్లో కార్మికులు విధులు నిర్వహించడం కష్టసాధ్యంగా మారిందన్నారు. అలాగే కార్మికులకు వ్యాక్సినేషన్‌ ‌త్వరగా వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.