కూలిన మెట్రో రైలు

  • మెక్సికోలో వంతెన కూలి కిందపడ్డ మెట్రో రైలు
  • 23మంది మృతి: 70మందికి తీవ్ర గాయాలు

న్యూఢిల్లీ,జ్యోతిన్యూస్‌ :
‌మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని మెక్సికో సిటీలో వంతెనపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు కిందికి పడిపోయిన ఘటనలో 23 మంది చనిపోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు .గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కింద ఉన్న రోడ్డుపై ట్రాఫిక్‌ ‌రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పైన ఓవర్‌ ‌పాస్‌ ‌పై వెళుతున్న మెట్రో రైలు ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోవడంతో పైనుంచి పడిపోయింది. ఈ ఘటనలో పలు బోగీలు ధ్వంసం అయ్యాయి. శిధిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మెక్సికో సిటీ మేయర్‌ ‌క్లాడియో్గ •న్బైమ్‌ ‌సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఓవర్‌ ‌పాస్‌ ‌నిర్మాణంలో నాణ్యతలేక పోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెక్సికో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.