మంత్రుల మార్పు తప్పదా..?

  • పార్టీలో మొదలైన అంతర్గత చర్చ…కేసీఆర్‌ ‌మార్క్ ‌రాజకీయం !!
  • తప్పనిసరిగా మారిన క్యాబినెట్‌ ‌ప్రక్షాళన
  • ఈటెలతో పాటు మరికొందరు మంత్రులపై వేటు ?
  • పొమ్మనలేక పొగబెడుతున్నారా?
  • త్వరలో మంత్రివర్గ కేబినెట్‌లో భారీగా మార్పులు
  • జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మంత్రులకు టెన్షన్‌
  • ‌భయం భయంగా జిల్లాల మంత్రులు
  • అప్పట్లో హరీష్‌రావును నీటిపారుదల శాఖ నుంచి మార్చిన వైనం
  • కేసీఆర్‌ను ఓవర్‌ ‌క్రాస్‌ ‌చేస్తున్నారనేనా వేటు?
  • మంత్రుల అవినీతిపై అస్త్రాలు సంధిస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌
  • ‌శాఖల మార్పుతో పాలన ప్రక్షాళనకు శ్రీకారం
  • కేటీఆర్‌కు వ్యతిరేక వర్గం ఉండకూడదనే కారణమా ?
  • ఈటెల…వాట్‌ ‌నెక్టస్! ‌భవిష్యత్‌ ‌కార్యాచరణ !
  • సైలెంట్‌గా ఉంటారా ? వైలెంట్‌గా మారతారా?

(నండూరి రవిశంకర్‌)
‌హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :

‌కెసిఆర్‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుచిక్కని,ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో తెలుసు కోవడం కష్టమని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులు టెన్షన్‌ ‌లో ఉన్నట్లుగా సమాచారం.అయితే పార్టీ వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు ఊహించిన విధంగా కెసిఆర్‌ ‌నిర్ణయాలు తీసుకోరు అని కూడా చర్చ జరుగుతోంది.తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్‌ ‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయం, వైద్య ఆరోగ్యశాఖను తన అధీనంలోకి బదిలీ చేసుకుని ఈటెలకు షాక్‌ ఇవ్వడం, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఒక్క ఈటెల రాజేందర్‌ ‌మాత్రమే కాదు, మరికొంతమంది మంత్రులపై కూడా సీఎం కేసీఆర్‌ ‌వేటు వేయనున్నారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.ఇదిలా ఉండగా ఇప్పటికే పలు సందర్భాలలో అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మంత్రులు ఈటెల రాజేందర్‌ ‌పై తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంలో ఉన్నారు.తాజాగా ఒక్క ఈటెల రాజేందర్‌ ‌పైనే కాకుండా జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని ఒకరిద్దరు మంత్రులపైన కూడా సీఎం కేసీఆర్‌ ‌వేటు వేయడానికి రంగం సిద్ధం చేశారన్న చర్చ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ మేరకు కీలక శాఖను నిర్వహిస్తున్న ఓ మంత్రికి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలనుండి సంకేతాలు కూడా వెళ్లినట్లు సమాచారం. జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా మంత్రులపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, ‌కరీంనగర్‌ ‌కు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌, ‌వివాదాస్పద మంత్రి మల్లారెడ్డి, భూ కబ్జా ఆరోపణలు ఉన్న శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఇలా చాలా మంది మంత్రులు ఇప్పుడు టెన్షన్‌ ‌లో ఉన్నారని సమాచారం.
కేసీఆర్‌ ‌మార్క్ ‌రాజకీయంపై ఆసక్తికరమైన చర్చ
పొమ్మనలేక పొగపెడుతున్నారా ? ఇది ఆయనను పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి పొమ్మనలేక పెట్టిందా ? ఈ ప్రశ్నలకు శుక్రవారం అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు అవుననే సమాధానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి. అయితే ఈటలతో పాటు, మరికొందరు మంత్రులపై వేటు పడుతుందనే ప్రచారం టీఆర్‌ఎస్‌ ‌వర్గాల్లో జరుగుతోంది. తాజా భూ కబ్జా ఆరోపణలు, సీఎం కేసీఆర్‌ ‌వెంటనే జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించటం వెరసి ఈటలను కేబినెట్‌ ‌నుంచి తప్పించటం కోసమే అనే వాదనలు ఆ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక్క ఈటలపైనే కాకుండా, జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని ఒకరిద్దరు మంత్రులపైనా వేటు పడవచ్చని అనుమానిస్తున్నారు. ఈమేరకు కీలక శాఖను నిర్వహిస్తున్న ఓ మంత్రికి ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి ఈ కారణంగానే రాజీనామా చేశారని సమాచారం. నాయకత్వ మార్పు జరిగితే సహజంగానే కొత్త కేబినెట్‌ ‌కొలువుదీరాల్సి ఉంటుందని, నాయకత్వ మార్పు ఆలస్యమైతే కేబినెట్‌లో మార్పులు, చేర్పులకు పరిమితం కావచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఈ సమయంలో ఎందుకు?

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు అధికార టీఆర్‌ఎస్‌, ‌ప్రభుత్వ అనుకూల చానళ్లలో ప్రసారం కావటం కూడా చర్చనీయాంశమైంది. కరోనా పరిస్థితులు తలెత్తిన నుంచి దాని కట్టడి కోసం మంత్రి ఈటల రాజేందర్‌ ‌క్షేత్ర స్థాయిలో గట్టిగా పనిచేస్తున్నారనే పేరు వచ్చింది. అయితే కరోనా రెండవ దశ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంతీరును హైకోర్టు ఎండగడుతూ వస్తోంది. ఈ పరిస్థితి నుంచి ప్రజలు,రాజకీయ పార్టీల దృష్టిని మళ్లించటం కోసమే మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలను తెరపైకి తెచ్చారా? అనే అనుమానాలు ఒక వర్గం నుంచి వ్యక్తమవుతున్నాయి.
హరీష్‌రావు విషయంలోనూ…
గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేనిన హరీష్‌రావుకు ఆ శాఖలో మంచి పేరు వచ్చింది. ఒకానొక దశలో కేసీఆర్‌కు తగిన వారసుడు అని కూడా జనం జేజేలు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తొంభై శాతం హరీష్‌రావు చేసిన కృషి ఎవరూ మర్చిపోలేరు. సరిగ్గా ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి అనూహ్యంగా హరీష్‌ను ఆ శాఖనుంచి తప్పించడమే కాకుండా…కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సైతం హరీష్‌ని ఆహ్వానించకపోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.పార్టీలో తన తరువాత కేటీఆర్‌ ‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కెసిఆర్‌ ‌చేయగలి గారు. ఆయనకు పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పదవి అప్పగించి ఆయన ప్రాధాన్యం ఏంటో చూపించారు.

వ్యతిరేక వర్గంపై వేటు తప్పదా ?

కొంతమంది సీనియర్‌ ‌నాయకుల వ్యవహార శైలి కారణంగా ఎప్పటికైనా కేటీఆర్‌ ‌కు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే ఆలోచనతో చాలాకాలం నుంచి కేసీఆర్‌ ఉం‌టూ వస్తున్నారు.దీనిలో భాగంగానే మంత్రి ఈటెల రాజేందర్‌ అవినీతి వ్యవహారాలు బయటకు రావడం , ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ ‌చేయడం వంటివి చోటు చేసుకున్నాయని, అలాగే మరికొంత మంది మంత్రులు కేటీఆర్‌ ‌విషయంలో చులకన భావంతో ఉండడంతో వారిని సైతం తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఎన్నికల తంతు ముగియడం, నాగార్జునసాగర్‌ ‌లో గెలుపు ఉత్సాహం ఉండటంతో, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్‌ ‌ప్లాన్‌ ‌చేస్తున్నారట.కరీంనగర్‌ ‌జిల్లాకు చెందిన గంగుల కమలాకర్‌, ‌మంత్రి మల్లారెడ్డి తో పాటు, మరికొంతమంది ని కెసిఆర్‌ ‌తప్పిస్తారు అని ప్రచారం జరుగుతోంది.
కేటీఆర్‌కు ప్రమోషన్‌
అం‌తేకాకుండా సీఎంగా కేటీఆర్‌ ‌కు ప్రమోషన్‌ అప్పుడే కల్పిస్తారనే హడావుడి ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో నెలకొంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం ఏమీ లేదనే విషయం నిన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తేలిపోవడంతో,కేసీఆర్‌లో బాగా ధీమా పెరిగిందని, అందుకే జాతీయ రాజకీయాల్లో ఆయన యాక్టివ్‌ అవ్వాలని చూస్తున్నారని,మమతాబెనర్జీతో కలిసి జాతీయస్థాయిలో బలమైన కూటమి ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకే ముందుగా పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గం మొత్తాన్ని తప్పించి,పూర్తిగా మంత్రిమండలి తో పాటు పార్టీని ప్రక్షాళన చేసి, ఇక్కడ తమకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకుండా చూసుకునేందుకు ఈటెల పై వేటు వేశారని ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.చాలాకాలం నుంచి వాయిదాలు పడుతూ వస్తు న్న కేటీఆర్‌ ‌పట్టాభిషేకం అతి త్వరలోనే ఉండబోతుందనేది ఇప్పుడు పొలిటికల్‌ ‌సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.
దుర్మార్గపు ఆరోపణలు
ఏ రోజైనా ప్రశ్నించే దగ్గరే ఉన్నాం తప్ప లొంగిపోయే దగ్గరలేం. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పదవుల కోసం లొంగిపోయే ప్రసక్తే లేదు. ఇవాళ నేను ఈ పదవి(మంత్రి) గడ్డిపోచతో సమానం అనను. ఇంకో రకంగా కించపరచను. అయితే..నా ఆత్మగౌరవం కంటే ఈ పదవి ముఖ్యం కాదు అని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. మెదక్‌ ‌జిల్లా మాసాయిపేటలో అసైన్డ్ ‌భూములు ఈటల కబ్జా చేసినట్లుగా వివిధ ఛానళ్లలో(ఏబీఎన్‌ ‌కాదు) వచ్చిన కథనాలపై ఆయన శుక్రవారం రాత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొన్ని టీవీ చానెళ్లు కట్టుకథలతో, ముందస్తు ప్రణాళికతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను సంపాదించుకున్న గౌరవంపై విషం విషం చల్లే ప్రయత్నాల్లో భాగంగా అసైన్డ్ ‌భూములను కబ్జా చేసినట్లుగా,షెడ్లు కట్టినట్లుగా కథనా లను ప్రసారం చేశారన్నారు. ఏదైనా సంఘటన జరిగితే బాధితులు ఫిర్యాదు చేయాలని, ఇక్కడ అలాంటిదేమీ లేదని ఈటల భావోద్వేగంతో మీడియా ముందు తన గోడు ప్రస్తావించారు.