కరోనాకు మరో రాజకీయ నేత బలి
- చికిత్స పొందుతూ కన్నుమూసిన సబ్బం హరి
- మేయర్‌గా, ఎంపిగా రాజకీయాల్లో తనదైన ముద్ర
విశాఖపట్టణం,జ్యోతిన్యూస్ :
కరోనాకు మరో ప్రముఖ రాజకీయ నేత బలయ్యారు. కరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరి.. ఆరోగ్య విషమించడంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను కొన్ని రోజుల నుంచి వెంటీటేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఆయన కోలుకుని వస్తారని టీడీపీ శ్రేణులు, అభిమానులు భావించారు. అయితే పరిస్థితి విషమించడంతో సబ్బరి హరి చనిపోయినట్టు ఆయనకు చికిత్స అందిస్తున్న అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. కరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. సబ్బంహరి జూన్ 1, 1952న బంగారునాయడు, అచ్చియమ్మ దంపతులకు విశాఖపట్టణం లోని చిట్టివలసలో జన్మించారు. ఆరుగురు సంతానంలో చివరివాడు. సొంతూరులోని తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీ ఏవీఎన్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ్గ •నైలియర్ చదువుతూనే అనేక వ్యాపారాలు చేశారు. నష్టం రావడంతో అన్ని బిజినెస్‌లకు గుడ్‌బై చెప్పారు. 1955 విశాఖ మేయర్ ఎన్నికల్లో పోటి చేశారు. మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అవినీతి ఆరోపణలు లేకుండా మేయర్‌గా పరిపాలన కొనసాగించారు. పారిశుద్ద్యాన్ని ప్రైవేటీకరణ చేసిన తొలి నగరంగా విశాఖను సబ్బం హరి మలిచారు. విశాఖ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా.. అనంతరం నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా సబ్బం నియామకమ య్యారు. 1970 అక్టోబర్ 15న లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సబ్బంకు అవని, అర్చన అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు వెంకట్ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. 15వ లోక్‌సభకు అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో మాజీ ఎంపీ సబ్బం హరి ఒకరు. వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను ధిక్కరించి వేరు కుంపటి పెట్టిన సందర్భంలో, ఓదార్పు యాత్రలో ఆయన వెన్నంటి ఉన్న వారిలో సబ్బం హరి ఒకరు. అయితే.. ఆ తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్‌కు సబ్బం హరి బద్ధ శత్రువుగా మారారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. టిడిపి అధినేత చంద్రబాబు, లోకేశ్, అయ్యన్నపాత్రుడు, అచ్చన్నాయుడు, నిమ్మల రామానాయుడు తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయనతో తమకుగల అనుబంధాన్ని నెమరేసుకున్నారు.