ఈటెల రాజేందర్‌ ‌చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  • దేవరయాంజాల్‌ ‌దేవాదాయ భూ ఆక్రమణ చేసినట్లుగా ఆరోపణ
  • పంచాయితీరాజ్‌ ‌కమిషనర్‌ ‌రఘునందర్‌ ‌రావుతో కమిటీ
  • కమిటీలో మరో ముగ్గురు సీనియర్‌ ఐఎఎస్‌లు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ‌చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈటల మీడియాతో మాట్లాడుతున్న సమయం లోనే మరో భూ వివాదం తెరపైకి వచ్చింది. దేవరయాంజల్‌ ‌సీతారామచంద్రస్వామి భూములను ఈటల ఆక్రమిం చారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ భూముల ఆక్రమణలపై నలుగురు ఐఏఎస్‌ ‌లతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. మేడ్చల్‌ ‌జిల్లా శార్‌పేట మండల పరిధిలోని దేవరయంజాల్‌ ‌దేవాలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈటల రాజేందర్‌, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై కమిటీ ఏర్పడింది. సీతారామ స్వామి భూములు ఆక్రమణ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పంచాయతీరాజ్‌ ‌కమిషనర్‌ ‌రఘు నందరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. నల్లగొండ, మంచిర్యాల, మేడ్చల్‌ ‌జిల్లాల కలెక్టర్లు కమిటీలో ఉన్నారు. ఎంత భూమి ఆక్రమించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఐఏఎస్‌ ‌కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. దేవరయాంజల్‌ ‌లో మొత్తం 1521 ఎకరాల ఆలయ భూములు ఉన్నాయి. ఈటలతో పాటు ఆయన అనుచరులు దేవాలయ భూములు ఆక్రమించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. రూ. వెయ్యి కోట్లకు పైగా దేవాలయ భూములను ఆక్రమించినట్టు ప్రభుత్వం గుర్తించింది. దేవాలయ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. దేవాలయ భూముల ఆక్రమణల ద్వారా భక్తుల మనోభావాలు గాయపర్చినట్టు ఈటలపై అభియోగాలు వచ్చాయి. వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.