రంగుల’వసంతం…

  • ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు
  • ఇంటివద్దనే రంగులతో ఎంజాయ్‌ ‌చేసిన సెలబ్రిటీలు
  • హోలీ స్నానం కోసం వెళ్లి చెరువులో బాలుడు మృతి
  • రాష్ట్రపతి,ప్రధాని,కేసీఆర్‌ ‌హోళీ శుభాకాంక్షలు
  • ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల హోలీ సంబరాలు
  • సాగుచట్టాల కాపీలను దహనం చేసిన అన్నదాతలు

హైదరాబాద్‌,‌జ్యోతిన్యూస్‌ :
‌రంగుల కేళీ హోలీ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే యువత, చిన్నారులు, పెద్దలు ఇంటి ఆవరణలతో పాటు ప్రధాన కూడళ్లలో రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబురాలు అంబరాన్నంటేలా వేడుకలు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో నిబంధనల మధ్య హోళీ సంబురాలు జరిగాయి. హైదరాబాద్‌లో సెలెబ్రిటీలు ఎవరి ఇండ్లల్లో వారు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సెలెబ్రేట్‌ ‌చేసుకున్నారు. స్టైలిష్‌ ‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఆయన భార్య స్నేహతో కలిసి హోలీ ఆడారు. హోలీ ఫొటోలు సోషల్‌ ‌డియాలో పోస్ట్ ‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే
సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ ‌మండలంలో హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లి బాలుడు ప్రాణాలు కోల్పోగా.. మరొకరిని స్థానికులు అతికష్టం ద రక్షించారు.నారాయణ్‌ఖేడ్‌ ‌మండలం వెంకటాపూర్‌ ‌గ్రామానికి చెందిన కొందరు పిల్లలు ఉదయం హోలీ వేడుకలు జరుపుకొని స్నానం చేసేందుకు శివారులోని చెరువులో స్నానానికి వెళ్లారు. వీరిలో ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిమునిగారు. ఒకరు మృతిచెందగా.. మరొకరిని స్థానికులు రక్షించారు. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్రపతి,ప్రధాని, కెసిఆర్‌ ‌హోళీ శుభాకాంక్షలు
హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌, ‌ప్రధాని మోడీదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. ’ఈ పండుగ రకరకాల రంగులు కలబోసిన పండుగ మాత్రమే కాకుండా… సామాజిక సామరస్యాన్ని తెలిజేస్తుందని రాష్ట్రపతి కోవింద్‌ అన్నారు. ప్రజల జీవితాలలో ఆనందం, ఆశను కలిగిస్తుంది. అలాగే ఈ పండుగ మన సాంస్కృతిక వైవిధ్యానికి, సమగ్రమైన జాతీయవాద స్ఫూర్తిని మరింత పెంచతుంది’ అని రాష్ట్రపతి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్రమోడీతోపాటు, ఇతర రాజకీయ నాయకులు కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌ ‌గుండెనొప్పి రావడంతో గత శనివారం మధ్యాహ్నం ఎయిమ్స్ ఆసుప్రతిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చికిత్స పొంతున్నారు. ఇకపోతే ప్రధాని మోడీ కూడా హోళీ
శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండగతో ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విటర్‌ ‌ద్వారా వెల్లడించారు. ’దేశ ప్రజలందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు. హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం వెల్లివిరియాలి. ఈ పండగ అందరిలో కొత్త శక్తిని నింపుతుంది’ అని మోడీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌కూడా దేశ ప్రజలకు ట్విటర్‌ ‌ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, ఆరోగ్యాలను ప్రసాదిస్తుందని వారు అభిలషించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడకుండా, కొవిడ్‌ ‌నిబంధనలను అనుసరించి హోలీ జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రజలకు సూచించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల హోలీ సంబరాలు…
కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 123 రోజులుగా ఘాజీపూర్‌ ‌సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులు సోమవారంనాడు నిరసన ప్రదేశాల్లోనే హోలీ సంబరం చేసుకున్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఒకరితో ఒకరు సంతోషం పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను రద్దుచేసి, కనీస మద్దతు ధర అమలు కోసం ప్రత్యేక చట్టం తెచ్చేంత వరకూ తాము ఇళ్లకు వెళ్లేది లేదని పునరుద్ఘాటించారు. ’మా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలి. రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాలి. అప్పుడే మేము ఇంటి ముఖం పడతాం’ అని పలువురు రైతులు నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి ముందు, హోలికా దహన్‌ ‌సందర్భంగా ఆదివారంనాడు పలువురు రైతులు సాగు చట్టాల ప్రతులను మంటల్లో వేశారు. ఏప్రిల్‌ 5‌న ’ఎఫ్‌సీఐ బచావో దివస్‌’ ‌నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (ఎఫ్‌సీఐ) కార్యాలయాల వద్ద ఘెరావ్‌ ‌నిర్వహిస్తామని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా నేతలు ప్రకటించారు. కనీస మద్దతు ధరకు చరమగీతం పాడేందుకు, ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)‌ను పరోక్షంగా మూతపడేలా చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని, గత కొన్నేళ్లుగా ఎఫ్‌సీఐ బ్జడెట్‌ను కుదిస్తూ పోతోందని ఒక ప్రకటనలో సంయుక్త కిసాన్‌ ‌మోర్చా ఆరోపించింది. ప్రదర్శనల సమయంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైతే ఆ మొత్తాన్ని ప్రదర్శకుల నుంచే వసూలు చేసేందుకు ఉద్దేశించిన హర్యానా రికవరీ ఆఫ్‌ ‌డేమేజెస్‌ ‌టు ప్రాపర్టీ బిల్లును ఇటీవల హర్యానా అసెంబ్లీలో ఆమోదించడాన్ని కూడా ఎస్‌కేఎం తప్పుపట్టింది. ఆందోళనలను అణిచి వేసేందుకే ఈ బిల్లు తీసుకువచ్చారంటూ మండిపడింది. ప్రజాస్వామ్యం గొంతు నులిమేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని ఆరోపించింది.