ఇక ‘ఉక్కు’ ఉద్యమమే
- ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు స్టీల్ ప్లాంట్
- ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ఉద్యమించాల్సి ఉంది
- స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పించిన గంటా
- తెలంగాణ ఉద్యమతరహాలు ముందుకు సాగాలని పిలుపు
- రాజకీయ ఒత్తిడి పెంచాలన్న సిపిఐ నేత నారాయణ
విశాఖపట్టణం,జ్యోతిన్యూస్ :
ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు స్టీల్ ప్లాంట్ అని ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ఉద్యమించాల్సి ఉందని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఉద్యమంలో తనను గస్వామిని చేయడం ఆనందదాయకం అని గంటా శ్రీనివాస రావు అన్నారు. వెస్ట్ బెంగాల్‌లో సింగూరు..విశాఖలో జిందాల్ పరిశ్రమ సమయం ప్రజా ఉద్యమాలు చేసి అడ్డుకున్నారు వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. విశాఖలో ఎదిగిన వ్యక్తిని, బ్రతికిన వ్యక్తిని …అందుకే స్టీల్ ప్లాంట్ కోసం రాజినామా చేసానని ఆయన అన్నారు. అది స్పీకర్ ఫార్మాట్‌లో లేదని అంటున్నారని .. ముందే రాజీనామా లేఖను ఇస్తున్నాను..నా రాజీనామా అమోదించాలని అయన అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉండాలన్న ఆయన ఎన్ని రాజకీయ పార్టీలు అయినా ఉండచ్చు కానీ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసేది కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీనేనని ఆయన అన్నారు. తో అండగా నిలుస్తానన్న ఆయన అత్యవసర కేబినెట్ ఏర్పాటు చేయాలి, అఖిలపక్షం కమిటీ ఏర్పాటు చేసి ప్రధానిమంత్రి కలిసే భాద్యత తీసుకోవాలని అన్నారు. మిలీనియం మార్చ్‌ను నిర్వహించాలి, ఒక ప్రజా ఉద్యమంగా తీర్చి దిద్దాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని గంటా పేర్కొన్నారు. ఇకపోతే ఉక్కు రిలేదీక్షల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఒక వేదికపైకి మాజీమంత్రి గంటా… మంత్రి అవంతి శ్రీనివాస్ వచ్చి చేరారు. ఉక్కుపోరాటానికి సంఘీభావం ప్రకటించిన ఇద్దరు నేతలు, ఎన్నికల తర్వాత తొలిసారిగా ఒకే వేదికపైకి పాత మిత్రులు వచ్చి చేరారు. గంటా,అవంతి కలిసి కట్టుగా చంద్రబాబు,జగన్‌లను ఒప్పించి ఒకే వేదికపైకి తీసుకురావాలని సిపిఐ నారాయణ ఆకాంక్షించారు.విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణకు నిరసనగా రోజురోజుకూ ఉద్యమం ఊపందుకుంటోంది. శుక్రవారం విశాఖలోని కూర్మన్నపాలెం గేట్ ముఖ ద్వారం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు దీక్ష చేపట్టాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ కార్మిక సంఘాల నేతలు హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో.. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు. వేలాది ఎకరాల భూములను దోచుకునేందుకే స్టీల్‌ఎ•-లాంట్‌ను ప్రయివేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఏ పరిశ్రమకైనా భూములు కేటాయిస్తే వారు అమ్ముకోవడానికి వీల్లేకుండా రాష్ట్రప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదని, రాజకీయంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు.