కరోనా కట్టడికి కలిసొచ్చిన జిల్లాల విభజన

కేసీఆర్ ముందుచూపుతోనే తెలంగాణలో కోవిడ్ కేసుల తగ్గుదల 

  • క్షేత్ర స్థాయిలో లాక్ డౌన్ కట్టుదిట్టం
  • అడుగడుగునా అధికార యంత్రాంగం అప్రమత్తం
  • కలిసొచ్చిన అప్పటి సమగ్ర కుటుంబ సర్వే
  • కలిసొచ్చిన 33 జిల్లాల విభజన
  • కరోనా ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే ధ్యేయంతో సీఎం
  • సమీక్ష సమావేశాలతో అధికారులకు ఆదేశాలు
  • దేశవ్యాప్తంగా మెచ్చుకుంటున్న కేసీఆర్ ముందుజాగ్రత్త చర్యలు 

“రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు తగ్గుతుండటం శుభసూచకం. రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం 159 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికే పాజిటివ్ వచ్చింది. మంగళవారంనాటికి 21 జిల్లాలు కరోనా యాక్టివ్ కేసులు లేని జిల్లాలుగా మారుతున్నాయి. లాక్ డౌన్ అమలుతో వైరస్ వ్యాప్తిని అరికట్టగలుగుతున్నాం. మే ఏడోతేదీ వరకు లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతుంది. వైరస్ సోకినవారిలో కూడా 97 శాతానికి పైగా కోలుకొని డిశ్చార్జి అవుతుండటం మంచి పరిణామం. వైరస్ వ్యాపిస్తున్న లింకు మొత్తాన్ని గుర్తించి, చివరి వ్యక్తి వరకు పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోంది” -కేసీఆర్ 

హైదరాబాద్: కేసీఆర్ ముందుచూపుతో పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన చిన్న జిల్లాలు కరోనా పై పోరుకు ఎంతో కలిసొస్తున్నాయి. కరోనా అనుమానితులను క్షణాల్లో గుర్తించి.. నిమిషాల్లోనే క్వారంటైన్ చేయడానికి అవకాశం ఏర్పడుతున్నది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. దీంతో 10 మంది కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో 33 మంది కలెక్టర్లు, ఎస్పీలు వచ్చారు. కొన్ని జిల్లాలను కలిపి పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటుచేసినచోట ఐపీఎస్ అధికారుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో కేత్రస్థాయిలోనే పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఏగ్రామంలో ఎవరున్నారనే జాబితా సిద్ధంగా ఉండటంతో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వయంత్రాగం క్షణాల్లో అక్కడ వాలిపోతున్నది. ఇప్పుడు కొవిడ్-19 నుంచి యావత్ రాష్ట్రాన్ని కాపాడేందుకు ఇదే ప్రధాన ఆయుధమయింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు తనిఖీ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు గుర్తించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌనకు పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ ఇంటినుంచి బయటకురావొద్దని సూచించారు. రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు, జిల్లాల సరిహద్దులు, జిల్లాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. విభజన కారణంగా జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఒక్కో జిల్లాలో మూడు నుంచి నాలుగు చెక్ పోస్టులు మాత్రమే ఏర్పాటుచేశారు. దీంతో జిల్లా ఎస్పీ ప్రతిరోజూ ఆయా చెక్ పోస్టులను స్వయంగా తనిఖీ చేసి.. అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతున్నది. గతంలో జిల్లా విస్తీర్ణం పెద్దదిగా ఉండటంతో ఎస్పీ అన్ని చెక్ పోస్టులను కనీసం ఒక్కసారి కూడా పరిశీలించేందుకు వీలు కలుగకపోయేది. చిన్న జిల్లాలు కావడంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణయాలు తీసుకోవడంతో, వాహనాల కట్టడి పై గట్టి నిఘా పెట్టడంతో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. నిరంతర ప్రక్రియగా నిత్యావసరాల పంపిణీ లాక్ డౌన్ కారణంగా ఇండ్సలో ఉంటున్న ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు అందేలా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులకు 15 కిలోల ఉచిత బియ్యంతోపాటు. 1500 నగదును అందజేశారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి కూలీలు. వలస కూలీలను గుర్తించి వారికి వసతి సౌకర్యంతోపాటు. సర్కారు అందజేసిన 12 కిలోల బియ్యం . సగదును స్వయంగా పంపిణీ చేశారు. రైతులు వ్యవసాయపనులు నిరాటంకంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో కూలీలు, రేషన్ కార్డుదారులు తక్కువ సంఖ్యలో ఉండటంతో దీంతో కలెక్టర్లే స్వయంగా క్యాంపులకు వెళ్లి పరిశీలించి వారికి సహాయం చేయడానికి వీలు కలిగింది. జిల్లా కలెక్టర్లకు ఎస్పీ, ఇతర అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కో ఆర్డినేట్ చేసుకుని పనిచేసే అవకాశం చిన్నజిల్లాలతో ఏర్పడింది. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటుచేసిన కరోనా బృందాలకు మినిట్ టూ మినిట్ సమాచారం అందించి మాట్లాడి తగిన ఆదేశాలు ఇవ్వడం సులువైంది. ఒక్క రాత్రిలో తల్లిగీ కాంటాక్ట్ ల గుర్తింపు తెలంగాణ ఆవిర్భవించిన మొదట్లో సీఎం కేసీఆర్ జరిపించిన సమగ్ర కుటుంబసర్వే కరోనా అనుమానితుల గుర్తింపులో అధికారయంత్రాంగానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. సర్వే వివరాలన్నీ కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉండటంతో పని చాలా సులువవుతున్నది. విదేశాల నుంచి వచ్చినవారు. ఢిల్లీలో తల్లిగీ ప్రార్ధనలకు వెళ్లి వచ్చినవారితోపాటు, వారితో కాంటాక్ట్ లో ఉన్నవారిని విశ్లేషించి గుర్తించేందుకు ఈ జాబితా ఎంతో దోహదం చేసింది. రాష్ట్రానికి వచ్చిన సమాచారం జిల్లాలకు పంపించిన ఒక్క రాత్రిలోనే వారిని గుర్తించి క్వారంటైన్ కు పంపి పరీక్షలు చేయించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా పెద్ద జిల్లాలు అయితే ప్రభుత్వ సమాచారం మేరకు వెంటనే అందరినీ ట్రేస్ చేయడం కష్టమయ్యేది. 33 మంది కలెక్టర్లు ఫాలో అప్ చేయడంతో యంత్రాంగం వడివడిగా కార్యాచరణ చేపట్టింది. ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ మూడు జిల్లాలో కరోనా కేసులు 300 వరకు ఉన్నాయి. ఈ కేసులతోపాటు వాటి ట్రాకింగ్ అంతా మూడు జిల్లాల కలెక్టర్లు చూస్తున్నారు. ఉమ్మడిగా ఉంటే ఒకే కలెక్టర్ చూడాల్సి వచ్చేది. కష్టమయ్యేది. సూర్యాపేట జిల్లాలో తల్లిగీకి వెళ్లోచ్చినవ్యక్తికి వైరస్ పాజిటివ్ రావడంతో అతడు ఎవరెవరితో కాంటాక్ట్ లోకి వెళ్లాడో అధికారులు వెంటనే పరిశీలించారు. వర్థమానుకోటలో అతడి అత్తగారి కుటుంబంతో కలిసినట్టు తేలడంతో వెంటనే వారిని పరీక్షించగా అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, కలెక్టర్ కలిసి గ్రామంలో పర్యటించి గ్రామాన్ని జల్లెడపట్టారు. ఆ కుటుంబం మాంసం విక్రయాలు చేస్తున్నదని తెలుసుకొని వారి దగ్గర మాంసం కొనుగోలు చేసిన వారిని గుర్తించి సత్వర చర్యలు తీసుకున్నారు. రిమ్స్ లో పనిచే సే డాక్టర్ తల్లిగీకి వెళ్లి మూడ్రోజులు అక్కడే ఉండి విషయం దాచి ఉంచాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు కాల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అతడు ఢిల్లీ వెళ్లి వచ్చాడని నిర్ధారించుకుని క్వారంటైన్ కు తరలించారు. నల్లగొండ జిల్లాకు చెందిన రెండు జంటలు ఢిల్లీకి వెళ్లి రాగా, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, జోగు ళాంబ గద్వాల జిల్లాలో 19 మంది మర్కజ్ కు వెళ్లిచ్చినట్టు అధికారులు గుర్తించారు. వారి తోపాటు వారు కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించారు. ఎక్కడికక్కడ కాలనీలనే దిగ్బంధం చేశారు. ఇలాంటి చర్యలు తీసుకోవడం వలనే తెలంగాణలో త్వరితగతిన కోవిడ్ కేసులు కోలుకునే పరిస్థితికి వచ్చాయి. ‘రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చినవారు సోమవారం నాటికి 1,003 మంది కాగా, 332 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 646 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మొత్తం పది జిల్లాల్లో (ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణ పేట, వరంగల్ రూరల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల) ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. మరో 11 జిల్లాలు (జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ) మంగళవారంనాటికి ఒక్క పాజిటివ్ కేసు లేని జిల్లాలుగా మారనున్నాయి. హైదరాబాద్, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో చాలా తక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉంటే చాలా సర్కిళ్లలో పాజిటివ్ కేసులు లేవు. కొన్ని సర్కిళ్లు యాక్టివ్ కేసులు లేనివాటిగా మారనున్నాయి. కొన్ని సర్కిళ్లకే వైరస్ పరిమితమైంది. దీంతో చాలా కంటైన్మెంట్ జోన్లు ఫ్రీ అవుతున్నాయి. యాక్టివ్ కేసులు తగ్గుతున్న కొద్దీ కంటైన్మెంట్ల సంఖ్యను కూడా ప్రభు త్వం తగ్గిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్ సోకినవారిలో అత్యధిక శాతం మంది క్వారంటైన్ సమయం మే 8వ తేదీనాటికి ముగుస్తుంది. కొద్దిరోజులుగా పరిస్థితిని గమనిస్తే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టింది. రాబోయే కొద్దిరోజుల్లోనే ఒక్క పాజిటివ్ కూడా రాని పరిస్థితి వస్తుందనే నమ్మకం ఏర్పడుతున్నది. తర్వాత అక్కడో, ఇక్కడో.. కొదోగొప్పో కేసులు వచ్చినా వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు’ అని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తంచేయడం విశేషం. ఒక్క రోజులో 62 మరణాలు కరోనా కేసుల్లో తొలి మూడు స్థానాలలో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్, ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 62 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్తగా 1543 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,435కు చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ తో 934 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,868 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో 369 మంది, గుజరాత్ లో 162, మధ్యప్రదేశ్ లో 110, ఢిల్లీలో 54, రాజస్థాన్లో 50, ఉత్తరప్రదేశ్ లో 31, తమిళనాడులో 24, ఏపీలో 31, తెలంగాణలో 25, పశ్చిమ బెంగాల్ లో 20, కర్ణాటకలో 20, పంజాబ్ లో 19 మంది కరోనాతో చనిపోయారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ ఆఫీసులో పనిచేస్తున్న ఓ ఆఫీసర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. ప్రస్తుతం బిల్డింగ్ ను సీజ్ చేశారు. రెండు రోజుల పాటు ఆ బిల్డింగ్ లో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ అజిత్ కుమార్ తెలిపారు. ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం బిల్డింగ్ ను మూసివేస్తున్నారు. ఇక పాజిటివ్ వచ్చిన అధికారితో టచ్ లో ఉన్నవారిని క్వారెంటైన్లోకి వెళ్లాలని ఆదేశించారు.