నాన్ హాట్ స్పాట్ జోన్లకు మరిన్ని మినహాయింపులు

బుక్స్, స్టేషనరీ, ఎలక్ట్రికల్, ఫ్లోర్ మిల్, సిమెంట్, మొబైల్ రీఛార్జి షాపులకు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: దేశంలోని అర్బన్ ప్రాంతాల్లో లాక్ డౌన్ మినహాయింపులను కేంద్రం సవరించింది. నాన్ఫట్ స్పాట్ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ దుకాణాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సాలియా శ్రీవాస్తవ వెల్లడించారు. అలాగే, విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేయచ్చని తెలిపారు. ప్రీ పెయిడ్ మె బైల్ ఛార్జింగ్ సర్వీసులతో పాటు రహదారి నిర్మాణ పనులు, ఫుడ్ ప్రాసిసింగ్ యూనిట్లు, సిమెంట్ యూనిట్లకు మినహాయంపు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా నోడల్ అధికారుల్ని నియమించినట్టు కేంద్రం వెల్లడించింది.లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కాలంలో దేశ ప్రజలకు స్వల్ప ఊరటనిచ్చింది. లాక్ డౌన్ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్ రిచార్జ్, సిమెంట్, పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్ డౌన్ నుంచి వెసులుబాటు కల్పించింది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవుని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడే సేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్పిస్తామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా నోడల్ అధికారులను నియమిస్తామని తెలిపారు. వీటికే మినహాయింపులు.. పుస్తకాలు, స్టేషనరీ షాపులు నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్ షాపులు మొబైల్ రిచార్జ్ షాపులు ఆటా కంపెనీలు రోడ్ల నిర్మాణాల పై ఆంక్షలు ఎత్తివేత ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రిక్ట్రికల్ దుకాణాలు సిమెంట్ విక్రయాలకు అనుమతి పిండి మిల్లులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు