దోషులకు నేడు ఉరి

నేటి ఉదయం 5.30కు ఒకేసారి నలుగురికీ శిక్ష అమలు

న్యూఢల్లీి: నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశా లు మిగిలిలేవని ఢల్లీి కోర్టు గురువారం స్పష్టం చేసింది. మార్చి 20న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మను ఉరితీయాంటూ ఢల్లీి కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో… తాము దాఖు చేసిన పు పిటిషన్లు, అభ్యర్థను పెండిరగ్‌లో ఉండటం, రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాు పరిశీలించేంత వరకు ఉరిని నిుపు చేయాని బుధవారం వీరు కోర్టులో పిటిషన్‌ దాఖు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. దోషుకు ఇక ఏ అవకాశాు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా వారు దాఖు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉండగా… ఈ కేసులో దోషి పవన్‌ గుప్తా దాఖు చేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు దోషి అక్షయ్‌ ఠాకూర్‌ గురువారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి తన క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాు చేస్తూ పిటిషన్‌ దాఖు చేశాడు. ఈ క్రమంలో అక్షయ్‌ లాయర్‌ ఏపీ సింగ్‌ తన వాదను వినిపిస్తూ.. అక్షయ్‌ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన అంశం మిగిలిన ముగ్గురు దోషు, అతడితో సంబంధం కలిగి ఉన్న ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం… ‘‘మీరు రెండోసారి క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖు చేస్తే దానిని రాష్ట్రపతి తిరస్కరించారు. ఇప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం ఏముంది?’’ అని ప్రశ్నించింది. ఈ పరిణామా నేపథ్యంలో శుక్రవారం నిర్భయ దోషుకు ఉరి శిక్ష అము అవుతుందా లేదా అన్న విషయంపై అనుమానాు రేకెత్తాయి. నిర్భయకు రేపటిరోజున న్యాయం జరిగి తీరుతుందని ఆమె తల్లి ఆశాదేవి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచనం స ృష్టించిన వైద్య విద్యార్థిని హత్యాచార కేసులో ఉరి శిక్ష ఖరారైన నుగురు దోషుకు కోర్టు పు అవకాశాు ఇవ్వడాన్ని ఆమె ప్రస్తావించారు. దోషు ఎన్నో సాకుతో తమ శిక్షను వాయిదా వేసుకునే ఎత్తుగడు కోర్టుకు తెలిసివచ్చిందని ఇక శిక్ష నుంచి వారు తప్పించుకోలేరని అన్నారు. నిర్భయకు రేపటిరోజున న్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ కేసులో దోషి పవన్‌ గుప్తా దాఖు చేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. నిర్భయ కేసులో తనకు విధించిన మరణ శిక్షను సవాల్‌ చేస్తూ పవన్‌ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
2012లో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌నని, దిగువ కోర్టు ఈ వాస్తవాన్ని విస్మరించాయని తన పిటిషన్‌లో పవన్‌ పేర్కొన్నారు. నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ను కావడంతో తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు మార్చాని ఆయన కోరారు. అంతకుముందు ఇదే వాదనతో పవన్‌ గుప్తా దాఖు చేసిన రివ్యూ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. 2012, డిసెంబర్‌ 16న కదుతున్న బస్సులో వైద్య విద్యార్ధినిపై హత్యాచార ఘటనలో ఉరి శిక్ష పడిన నుగురు నిందితుల్లో పవన్‌ ఒకరు. నిర్భయ దోషుకు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి శిక్ష, ఈ నె 20న త్లెవారుజామున 5:30 గంటకు ఖరారైన సంగతి తెలిసిందే.
నిర్భయ దోషు ఉరితీతకు ఇంకా కొన్ని గంటలే(అన్నీ సజావుగా సాగితే) మిగిలి ఉన్న వేళ వరుసగా వాళ్లకు కోర్టు షాకిస్తున్నాయి. నిర్భయ దోషు పవన్‌ గుప్తా, ముఖేశ్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మ దాఖు చేసిన వివిధ పిటిషన్లను ఢల్లీి కోర్టు, ఢల్లీి పటియాలా హౌజ్‌ కోర్టు కొట్టివేశాయి. సుప్రీంకోర్టు సైతం పవన్‌ గుప్తా క్యూరేటివ్‌ పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మరో కొన్ని గంటల్లో వారిని ఉరితీసేందుకు తీహార్‌ జైు అధికాయి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే డమ్మీ ఉరి కూడా పూర్తైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢల్లీి పటియాలా హౌజ్‌ కోర్టు వద్ద గురువారం నాటకీయ పరిణామాు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో దోషు పిటిషన్లపై వాదోపవాదాు జరుగుతున్న వేళ అక్షయ్‌ ఠాకూర్‌ భార్య పునీతా దేవి కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను తన పక్కనే కూర్చోబెట్టుకున్న ఆమె… చెప్పుతో తన ముఖంపై కొట్టుకుంటూ… బిగ్గరగా ఏడ్చారు. ఈ క్రమంలో స్ప ృహ తప్పిపడిపోయారు. మెకువ వచ్చిన తర్వాత మళ్లీ అదే విధంగా చేస్తూ… ‘‘నాకు బతకాని లేదు. శిక్ష అమలైతే నేను చచ్చిపోతా’’ అంటూ బెదిరింపుకు దిగారు. కాగా అక్షయ్‌ భార్య ఇదివరకే తనకు విడాకు కావాంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘‘ నా భర్త అమాయకుడు. ఆయనను ఉరి తీసేముందు నాకు చట్టపరంగా విడాకు కావాలి. ఎందుకంటే నేను అత్యాచార దోషి భార్యగా ఉండానుకోవడం లేదు’’ అని ఔరంగాబాద్‌ ఫ్యామిలీ కోర్టులో దాఖు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక నిర్భయ దోషును మార్చి 20 ఉదయం 5.30 గంటకు ఉరితీయాంటూ డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉరిశిక్షను నిలిపివేసేందుకు దోషు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అన్ని దాయి మూసుకుపోవడంతో ఉరిశిక్ష ఖాయం అని తేలిపోయింది.