నిత్యావసరాలపై ఆందోళన వద్దు

వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం జగన్‌

అమరావతి: కరోనా ప్రభావం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 31వరకు విద్యాసంస్థు, థియేటర్లు, మాల్స్‌, పెద్ద ప్రార్థనా మందిరా మూసివేత కొనసాగుతుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాు తీసుకుంటామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా గురించి ప్రజు ఆందోళన చెందవద్దని.. జాగ్రత్తు తీసుకోవాని జగన్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంచాని, అపోహు తొగించాని అధికారును ఆయన ఆదేశించారు.
నిత్యావసర వస్తువు కోసం ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కరోనా సాకుతో నిత్యావసరా ధరు పెంచితే కఠిన చర్యు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కలెక్టర్‌ కన్వీనర్‌గా జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక దూరం అముపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాని అధికారుకు ఆయన సూచించారు. ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికును తీసుకెళ్లవద్దని.. బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా?లేదా? అనేది చూడాన్నారు. ఆస్పత్రుల్లో పారాసిటమాల్‌, యాంటీబయాటిక్స్‌ సిద్ధంగా ఉంచాని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బందిని సరిగా వాడుకోవాని. .పీహెచ్‌సీు, ఆస్పత్రుల్లో కచ్చితంగా సిబ్బంది ఉండేలా చూసుకోవాన్నారు. హోం ఐసోలేషన్‌, సామాజిక దూరంపై ప్రధానంగా దృష్టి సారించాని జగన్‌ దిశానిర్దేశం చేశారు.