రెంటికీి చెడ్డ రేవంత్‌

ఒక పక్క భూకబ్జా కేసు…మరో పక్క సొంత పార్టీలోనే వ్యతిరేకతు..

  • `టీఆర్‌ఎస్‌ని ధీటుగా ఎదుర్కునే నేతగా పేరు
  • `దూకుడుగా వెళ్లడమే రేవంత్‌కు శాపం
  • `సొంత పార్టీలోనూ వ్యతిరేకతే
  • `రేవంత్‌ అరెస్టుపై స్పందించని కాంగ్రెస్‌ నేతు
  • `పీసీసీ అధ్యక్ష రేసులో ముందున్న రేవంత్‌రెడ్డి
  • `అధ్యక్ష స్థానానికి అడ్డొస్తున్నాడని టి.కాంగ్రెస్‌లో వ్యతిరేకత
  • `పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాడని అధిష్టానానికి ఫిర్యాదు
  • `పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌గా మారిన రేవంత్‌రెడ్డి
  • `బీజేపీలోకి వెళతారంటూ పుకార్ల షికార్లు

హైదరాబాద్‌:

తెంగాణలో అధికార తెంగాణ రాష్ట్ర సమితిని ధీటుగా ఎదుర్కొనే  కొందరు నేతల్లో మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఒకరు. టీఆర్‌ఎస్‌ పార్టీ అన్నా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం అన్నా ఆయనకు అస్సు పడదు. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డి అంత తీవ్రంగా ప్రభుత్వంపైన ఎవరూ విమర్శు చేయరు. దీంతో ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రేవంత్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టాని చూస్తోంది.

ఎన్నిక ముందు పోలీసు ఒత్తిళ్లు, ఐటీ దాడుతో రేవంత్‌ రెడ్డి బాగానే ఇబ్బంది పడ్డారు. కొడంగల్‌లో ఓటమి తర్వాత కొంతకాం పాటు ఆయన కూడా సైలెంట్‌ అయ్యారు. కానీ, మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన తర్వాత మరోసారి అధికార పార్టీకి వ్యతిరేకంగా స్పీడ్‌ పెంచారు. భూకేటాయింపు, పార్టీ ఫండ్స్‌ కోసం టీఆర్‌ఎస్‌ చేపట్టిన గులాబీ కూలీపై ఆయన కోర్టులో కొట్లాడుతున్నారు. మరో వైపు ప్రజాక్షేత్రంలోనూ ఆయన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్నం ప్రగతి కార్యక్రమానికి కౌంటర్‌గా పట్నం గోస కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల్లోకి వెళుతున్నారు. ఒకవైపు కొర్టుల్లో, మరోవైపు ప్రజల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రేవంత్‌ పోరాటం చేస్తుండగా ఆయనపై భూఆక్రమా ఆరోపణు మొదవడం సంచనంగా మారింది. ఇటీవ గోపన్‌పల్లిలో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఓ డిప్యూటీ కలెక్టర్‌పై కూడా ప్రభుత్వం చర్యు తీసుకుంది. రేవంత్‌ రెడ్డి సోదరుకు వ్యతిరేకంగా ఆర్డీఓకు వరుసగా అక్కడి ప్రజ నుంచి ఫిర్యాదు అందుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో రేవంత్‌ రెడ్డి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కొత్త కేసును ఎదుర్కునే అవకాశాు కనిపిస్తున్నాయి. ఇదిలా కొనసాగుతుండగానే రేవంత్‌ రెడ్డికి సంబంధించిన మరిన్ని వ్యవహారాల్లో అక్రమాు జరిగాయా అని తవ్వి తీసే పనిలో టీఆర్‌ఎస్‌ ఉన్నట్లు తొస్తోంది.

ఉప్పల్‌లోనూ రేవంత్‌ రెడ్డికి కొంత భూమి ఉంది. ఈ భూమిని కొనే సమయంలో కొన్ని అక్రమ లావాదేమీ జరిగాయని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రేవంత్‌ రెడ్డికి సంబంధించిన ఆస్తు, అక్రమాపై అచ్చంపేట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వ బాల్‌రాజ్‌ ద ృష్టి పెట్టారు. ఆయనే రేవంత్‌కు వ్యతిరేకంగా ఆధారాు సేకరించడం, ఫిర్యాదు చేయించడం వంటివి చేస్తున్నట్లు తొస్తోంది.

అయితే, రేవంత్‌ రెడ్డి మాత్రం పైకి ఇవన్నీ తేలిగ్గా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తనపై ఎన్ని కేసు పెడితే తాను టీఆర్‌ఎస్‌పై ఎంత కొట్లాడుతున్నట్లు లెక్క అంటున్నారు. తన ఆస్తు అన్నీ పోయినా టీఆర్‌ఎస్‌పై పోరాటం మాత్రం ఆపనని చెబుతున్నారు. రేవంత్‌ ధైర్యంగా కనిపిస్తున్నా టీఆర్‌ఎస్‌ మాత్రం ఆయనకు చెక్‌ పెట్టడానికి ఈసారి కొంత సీరియస్‌గానే ప్రయత్నిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న రేవంత్‌రెడ్డికి ఈ కేసు కొంత ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంది.

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తరువాత టీ పీసీసీ చీఫ్‌ దక్కించుకునే వారి రేసులో అందరికంటే ముందున్న రేవంత్‌ రెడ్డికి మరికొందరు కాంగ్రెస్‌ సీనియర్లు గట్టి పోటీ చేస్తున్నారు. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మాజీమంత్రి శ్రీధర్‌ బాబు వంటి వాళ్లు టీ పీసీసీ చీఫ్‌ పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే ఈసారి టీ పీసీసీ చీఫ్‌ పదవి తనకే దక్కుతుందన్న ధీమాలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్టు ఆయన సన్నిహితు చర్చించుకుంటున్నారు. తెంగాణలో కాంగ్రెస్‌ పార్టీని లీడ్‌ చేసేందుకు ఆయన ముందుకు సాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా ఆయనపై వస్తున్న ఆరోపణు… కాంగ్రెస్‌లోని ఆయన పోటీదారుకు వరంగా మారే అవకాశం ఉందని తొస్తోంది. గతంలో ఓటుకు నోటు కేసు ద్వారా ఇబ్బందిపడ్డ రేవంత్‌ రెడ్డి మరోసారి కేసుల్లో ఇరుక్కోవడంతో ఇతర పార్టీకు, మరీ ముఖ్యంగా అధికార పార్టీకి టార్గెట్‌ అవుతున్నారని… అలాంటి వ్యక్తికి టీ పీసీసీ చీఫ్‌ ఇవ్వొద్దని కొందరు నేతు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మొత్తానికి రేవంత్‌ రెడ్డి ఎన్నో ఆశు పెట్టుకున్న టీ పీసీసీ చీఫ్‌ పదవి ఆయనకు దక్కుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది

కాంగ్రెస్‌ అనేది ఒక సముద్రం అదో సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. దాదాపు 60 ఏళ్ళు దేశాన్ని పాలించింది. మన తొగు రాష్ట్రాల్లో కూడా అది సుదీర్గం గా పాలించింది. ఆ పార్టీలో ఎంతో పోటీ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్‌ నేతు పదవు కోసం పోటీ పడుతూ ఉంటారు. రాజకీయంగా ఆ పార్టీ బంగా ఉన్నా లేకపోయినా సరే పదవు కోసం నేతు ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఒక్కో పదవి కోసం పదు సంఖ్యలో నేతు పోటీ పడుతూ ఉంటారు.

ఇలా ఆశపడుతున్న వారిలో రేవంత్‌ రెడ్డి కూడా ఒకరు. ఆయన తెంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి అధ్యక్షుడిగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం కర్ణాటకలో తనకు సన్నిహితంగా ఉండే ఒక కాంగ్రెస్‌ పెద్దను కూడా రేవంత్‌ రెడ్డి పార్లమెంట్‌ సమావేశా సందర్భంగా కలిసారు కూడా. అయితే ఇప్పుడు ఆయనకు ఆ పదవి రావడం లేదు. దానికి తోడు రేవంత్‌ రెడ్డి భూ దందా మీద,

కాంగ్రెస్‌ పార్టీ నేతలే అధికార తెరాస పార్టీకి లీకు ఇచ్చారని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఆయన్ను ఎక్కువగా ట్రోల్‌ చేస్తుంది కాంగ్రెస్‌ కార్యకర్తలే. దీనితో రేవంత్‌ రెడ్డి ఇప్పుడు పార్టీని వీడటానికి సిద్దమయ్యారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయనకు కాంగ్రెస్‌ నుంచి మద్దతు వచ్చే అవకాశం కనపడట0 లేదు అనే టాక్‌ వినపడుతుంది. కాబట్టి ఆయన బమైన పార్టీ వైపు అడుగు వేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే బిజెపి నేతతో రేవంత్‌ టచ్‌ లోకి వెళ్ళారు అనేది జనా మాట. రేవంత్‌ రెడ్డి కోసం బిజెపి ఎప్పటి నుంచో అడుగు వేస్తుంది. కాబట్టి ఆయన్ను పార్టీలోకి తీసుకుని పదవి కూడా ఇవ్వడానికి సిద్దమయ్యారు బిజెపి నేతు. కిషన్‌ రెడ్డి కూడా ఇటీవ ఆఫర్‌ ఇచ్చారు ఆయనకు. దీనితోనే రేవంత్‌ రెడ్డి పార్టీ మారడంపై పెద్ద చర్చు జరుగుతున్నాయి. భూ దందా నుంచి బిజెపి తనను కాపాడే అవకాశం ఉందని అంటున్నారు.

కోర్టుకు హాజరయిన రేవంత్‌

తొగు రాష్ట్రాల్లో సంచనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన రేవంత్‌ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. 2015లో ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి కొన్ని నెలు జైులో ఉన్న సంగతి తెలిసిందే.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 క్షు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్‌రెడ్డితో పాటు పువురుపై కేసు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితుగా ఉన్న వారంతా  ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. వాదను విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నె 17వ తేదీకి వాయిదా వేసింది.