సోషల్ మీడియాకు సంకెళ్లు…?
- సోషల్ మీడియాకు దూరం అని ప్రకటించిన మోదీ
- సామాజిక మాధ్యమాలో చురుకుగా ఉండే ప్రధాని
- ప్రధాని ప్రకటన వెనక ఆంతర్యం నిషేధమేనా?
- పు చర్చకు దారితీస్తున్న ప్రధాని ప్రకటన
- గత కొన్ని రోజుగా ఢల్లీిలో సోషల్ మీడియా ప్రకంపను
- అ్లర్లకు దారితీయిస్తున్న ఫేక్ న్యూస్ు
- మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్న సందేశాు
- గతంలో సుప్రీంకోర్టు మందలింపు
- సామాజిక మాధ్యమాను కట్టడిచేయాంటూ ఒత్తిడు
(నండూరి రవిశంకర్)
హైదరాబాద్:
భారత్‌లో సోషల్ మీడియా బ్యాన్ దిశగా ప్రభుత్వం అడుగు వేస్తుందా? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా రాజకీయ నాయకుకు క్రేజ్ వచ్చేది సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఇప్పుడు తాను సోషల్ మీడియా నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాను అని చెప్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా ద్వారానే యూత్‌లో క్రేజ్ వచ్చింది. అలాంటి సోషల్ మీడియా నుంచి ఆయన తప్పుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారానే ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందారు అనేది వాస్తవం. విదేశాల్లో కూడా మోదీకి అభిమాను ఉన్నారు అంటే సోషల్ మీడియా పుణ్యమే. అలాంటి సోషల్ మీడియాను ఆయన వద్దని అనడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీని వెనుక ప్రధాన కారణం మాత్రం మరోలా ఉందని అంటున్నారు.
నిరక్ష్యరాస్యు కూడా సువుగా ఉపయోగించేలా మారిపోయింది స్మార్ట్‌ఫోన్ వినియోగం. డేటా విప్లవం వచ్చిన తర్వాత ..స్మార్ట్ యుగం ప్రారంభమైన తర్వాత ఈ సోషల్ మీడియా విస్తృతిని ఊహించలేకపోతున్నారు. ఈ మార్పు.. అటు చెడు .. ఇటు మంచికి కారణం అవుతోంది. చెడు ప్రధానంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలోనే ఉంది. దేశంలో రాజకీయ వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా మారుతూండటం.. అసు నిజం కన్నా ఫేక్ న్యూసే ఎక్కువగా ప్రజకు చేరుతూండటంతో.. అనేక చోట్ల పరిస్థితు అదుపుతప్పుతున్న సూచను కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సోషల్ మీడియా కట్టడి ఆలోచన చేస్తున్నారంటున్నారు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీకి క్రేజ్ పెరిగింది. అయితే పౌరసత్వ సవరణ చట్టం తర్వాత మూడు రాష్ట్రా ఎన్నిక తర్వాత మోడీ మళ్ళీ ప్రధాని అవ్వడంపై అనుమానాు వచ్చాయి. జాతీయ స్థాయిలో మోదీ తీరుపై ఇప్పుడు విమర్శు వస్తున్నాయి. రాజకీయంగా మోదీతో పాటుగా బిజెపి కూడా ఇబ్బంది పడుతోంది. ఢల్లీి అ్లర్లు ఇప్పుడు విపక్షాు చేశాయని మోదీ అంటున్నా కాదు బిజెపి చేసింది అని విపక్షాు అంటున్నాయి.
మోదీవైపే చూపిస్తున్న వేళ్లు
అక్కడ ఉన్న పరిస్థితు జడ్జిని బదిలీ చేయడం వంటివి అన్నీ కూడా మోదీ వైపే వేళ్ళు చూపిస్తున్నాయి. బిజేపినే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో అన్ని విధాుగా బిజెపి మీద విపక్షాు టార్గెట్ చేస్తున్నాయి. చాలా రాష్ట్రాు ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. బిజెపి ఎంపీు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఇబ్బంది పడటంతోనే మోడీ సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోవాని, తన గురించి, తన పార్టీ గురించి ప్రజల్లోకి ప్రచారం బాగా వెళ్తుంది అనే భావనలో మోదీ ఉన్నారు. ప్రధాని మోదీలో ఏమిటీ ‘సోషల్’ వైరాగ్యం? సీఏఏ అంశం తెరమీదకు వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళను తీవ్రతరం కావడం, సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం ఆయన్ను కచివేసిందా? అలాగే సోషల్ మీడియాలో మోడీకి వ్యతిరేకంగా ఇటీవ బాగా ట్రోల్ చేస్తుండడం ఆయన మనసును నొప్పించిందా?….తదితర ప్రశ్ను ఉత్పన్నమవుతున్నాయి.
అన్ని సామాజిక మాధ్యమ వేదిక నుంచి తప్పుకోవాని సోమవారం రాత్రి ప్రధాని మోదీ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ తీవ్ర సంచనం రేకెత్తిస్తోంది. ‘ఈ ఆదివారం నుంచి ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా అన్నింటి నుంచీ వైదొగాని ఆలోచిస్తున్నా. ఏ విషయమూ మీకు తెలియపరుస్తా’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే సామాజిక మాధ్యమా వేదిక నుంచి నిష్క్రమించానే పెద్ద నిర్ణయానికి ఎందుకొచ్చారో కారణాను మాత్రం వ్లెడిరచలేదు.
మోదీకి ఫాలోయర్స్ ఎక్కువ
కాలానికి తగ్గట్టు మోదీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తున్నారు. ఆయన 2000 నుంచే సోషల్ మీడియాలో చేరి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సామాజిక, రాజకీయ అంశాపై సోషల్ మీడియా వేదికగా అనేక కీక ప్రకటను చేశారు. సోషల్ మీడియాలో ఆయనకు పెద్ద సంఖ్యలో ఫాలోయిర్లు ఉన్నారు. ట్విటర్లో 5.33 కోట్లు, ఫేస్బుక్లో 4.4 కోట్లు, ఇన్‌స్టాలో 3.52 కోట్లు, యూట్యూబ్‌లో 0.45 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఫాలోయర్స్‌ను కలిగిన మోదీ ఆకస్మికంగా సోషల్ మీడియా నుంచి తప్పుకోవానే పెద్ద నిర్ణయానికి ఎందుకొచ్చారనే ప్రశ్న తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో ప్రపంచ స్థాయిలో ఆయన టాప్ 5లో ఒకరు. అదే మనదేశానికి వస్తే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. ఏదైనా అంశంపై మోడీ పోస్ట్ పెట్టడమే ఆస్యం….క్షణా వ్యవధిలో మే, క్ష సంఖ్యలో నెటిజన్లు స్పందిస్తుంటారు.
2014లో ప్రధానిగా బాధ్యతు చేపట్టినప్పటి నుంచి ఆయన ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశంలో కూడా పాల్గొనలేదు. సోషల్ మీడియా వేదికగానే ఆయన ప్రజతో సంభాషించారు. ప్రజతో ఇలా మాట్లాడటమే ఇష్టమని ఆయన పేర్కొన్నారు. అయితే గత ఆరేళ్లుగా ఎప్పుడూ ప్రశంసలే అందుకుంటూ వస్తున్న మోదీ…సీఏఏ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ప్రతికూ కామెంట్స్ రుచి చూడాల్సి వచ్చింది. మోదీపై ఘాటైన ట్రోలింగ్స్ సాగుతున్నాయి. బహుశా ఈ అంశాలే ఆయనలో వైరాగ్యం తెచ్చాయా అనే అనుమానాు వ్యక్తమవుతున్నాయి.
సామాజిక మాధ్యమాను దుర్వినియోగం చేయడం ప్రమాదకరమని గతేడాది దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కాని సోషల్ మీడియాకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించలేవన్న న్యాయస్థానం.. సోషల్ మీడియా కోసం నిబంధనను రూపొందించాని తెలిపింది. సోషల్ మీడియాపై కట్టడి లేకపోవడంతో వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతింటుందని సుప్రీం పేర్కొంది. ప్రభుత్వం వెంటనే సోషల్ మీడియాకు సంబంధించి తగిన చర్యు తీసుకోవాని సుప్రీంకోర్టు ఆదేశాు జారీ చేసింది. సోషల్ మీడియాకు నిబంధనతో కూడిన నివేదికను తయారుచేయాని సుప్రీం తెలిపింది.
సోషల్ మీడియాను వీడుతున్న ప్రకటించిన మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా చురకు అంటించారు. ‘మీరు వీడాల్సింది ద్వేషాన్ని.. సోషల్ మీడియాను కాదు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అలాగే తెంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ‘ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురవలేదని భావిస్తున్నాను. లేక విసిగిపోయి నిజంగానే ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం నుంచి వైదొుగుతానని సంకేతాలిస్తున్నారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
నానాటికీ బంగా విస్తరిస్తున్న సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయ పార్టీకు శాపంగా, ప్రజకు వరంగా మారింది. రోజువారీ వ్యవహారాపై స్పందించే వారి సంఖ్య మొదట్లో వందు, తర్వాత మే, ఇప్పుడు క్షకు చేరింది. ఈ తరహా ‘స్పందనకారుల్లో’ ఎక్కువమంది ఏ ఎన్నికల్లోనూ క్యూల్లో నిబడి ఓట్లేసే బాపతు కాదు. కానీ- మరొకరికి నష్టం కలిగించి, ఇతరుల్లో చైతన్యం నింపి, వాస్తవాు ఆలోచించేంత వరకూ పనికొస్తారు. అది ఒకరికి లాభం కలిగిస్తే, మరొకరికి నష్టం కలిగించవచ్చు. దానికి కారకును గుర్తించడం కష్టం. ఎందుకంటే సోషల్ మీడియా అంటే తండ్రెవరో, తల్లెవరో తెలియకుండా పుట్టిన అనాథ కాబట్టి. ఇప్పుడదే పార్టీకు పెను ప్రమాదంగా పరిణమించింది. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి వాటిని ఆయుధంగా చేసుకుని తెదేపా, వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిని నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. అయితే అవి తర్వాతి కాంలో రాజకీయ పార్టీు, వాటి సానుభూతిపరు అధిపత్యంలోకి వెళ్లిపోయాయి. ఫలితంగా ఒక పార్టీ మీద మరొక పార్టీ వ్యంగ్యాస్త్రాు సంధించుకోవడం, ఆరోపణు చేసుకోవడం, అభూతక్పనతో బురద అంటించే సాధనంగా మారిపోయింది. ఇవన్నీ నెటిజన్లకు ఉచిత వినోదంతోపాటు, అందులోని వాస్తవాు తొసుకునే విశ్లేషణావేదికగానూ పనికొస్తున్నాయి.
