పాఠాు నేర్వని ఇంటర్‌ బోర్డు

చిన్న మేనేజ్‌మెంట్‌ కాలేజీపైనే ప్రతాపం..కార్పొరేట్‌ కాసుకు దాసోహం

`కొత్త నిబంధన పేరిట చిన్న కాలేజీు బలి
`కార్పొరేట్‌ కళాశాలకు యథావిధిగా అనుమతు
`లోపభూయిష్టంగా మారిన ఇంటర్‌బోర్డు నిర్వహణ
`అనుమతు ఉన్న కాలేజీ ద్వారా విద్యార్థుకు పరీక్ష ఏర్పాట్లు
`అప్పటిదాకా యథేచ్ఛగా ఫీజు వసూళ్లు
`కొన్ని కాలేజీలో సంబంధంలేని సబ్జెక్టు టీచర్లతో పాఠాు
`ఆకస్మిక తనిఖీు సైతం నిర్వహించలేని స్థితిలో ఇంటర్‌బోర్డు
`టెన్త్‌ పరీక్షకు ముందే అడ్మిషన్లు ప్రారంభిస్తున్న కార్పొరేట్‌ కాలేజీు
`విద్యార్థు ఫోన్‌నెంబర్లు సేకరించి తల్లిదండ్రుకు ఎర
`ముందుగా సీటు రిజర్వ్‌ చేసుకుంటే రాయితీు
`సెవల్లోనూ అనుమతిలేని క్లాసు

హైదరాబాద్‌:
ప్రతి సంవత్సరం అనుమతిలేని అకాడమీ అనుబంధ గుర్తింపు కాలేజీపై కొరడా అంటూ ఇంటర్‌మీడియట్‌ బోర్డు ఓవరాక్షన్‌…పరీక్షవ్వగానే షరా మామూలే..నిబంధను నీళ్లకొదిలేయడమే పని..గతేడాది పరీక్ష లోపభూయిష్టం కారణంగా 27 మందికి పైగా విద్యార్థు ఆత్మహత్యు జరిగాయి. ఇప్పుడు అనుమతు లేని కాలేజీంటూ తూతూ మంత్రంగా చిన్నాచితకా కాలేజీమీదే ప్రతాపం తప్ప బడా కార్పొరేట్‌ కాలేజీ వద్దకు వచ్చేసరికి నిబంధను గాలికొదిలేస్తున్నారు. కార్పొరేట్లు ఇచ్చే తాయిలాకు ఆశపడి కొందరు బోర్డు అధికాయి ఏకంగా ఇంటర్‌ బోర్డునే బ్రష్టుపట్టిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో
ఏం జరుగుతోందో పై అధికారుకు కూడా తెలియకుండానే గుట్టుచప్పుడుకాకుండా కోట్లకు కోట్లు దుర్వినియోగం అవుతున్నాయి.
రాష్ట్రంలో జూనియర్‌ కాలేజీ అనుబంధ గుర్తింపు ఏటా పరీక్ష ముందు వివాదాస్పదం కావడం, సౌకర్యాు లేక అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని ఇంటర్మీడియట్‌ బోర్డు వాదించడం, అన్నీ ఉన్నా గుర్తింపు ఇవ్వలేదని జూనియర్‌ కాలేజీ యాజమాన్యాు ఆరోపించడం షరా మామూుగా మారిపోయంది. పరీక్ష ముందు అనుబంధ గుర్తింపు అంశం వివాదాస్పదం అవుతోందని తెలిసినా బోర్డు తీరు మారకపోవడంతో కాలేజీ యాజమాన్యాు సైతం అదే కోవలో వ్యవహరిస్తున్నాయి.
గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే సవాక్ష నిబంధను పాటించాని భావిస్తున్న చాలా కాలేజీు ఆ ఊసు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా క్లాసు నిర్వహిస్తున్నాయి. సంవత్సరం చివరిలో మరో కాలేజీ ద్వారా విద్యార్థుతో పరీక్షు రాయిస్తాయి. ఈ దందా ప్రైవేటు కార్పొరేట్‌ కాలేజీల్లో పబ్లిక్‌గా జరుగుతున్నా, ంచాు మరిగిన జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికాయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో బహిరంగంగా ప్రకటను జారీ చేస్తూ వీధికి ఒకటి చొప్పున గుర్తింపు లేని కాలేజీు నడుస్తున్నా జిల్లా విద్యాశాఖాధికాయి తమకేమీ పట్టనట్టు ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణం యాజమాన్యాు పెద్ద ఎత్తున అధికారు చేతు తడపడమేననే ఆరోపణున్నాయి. ఇంటర్‌ బోర్డు అధికాయి ఎవరూ ఏనాడూ ఏ జూనియర్‌ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేసిందీ లేదు, అక్కడ ఎవరు పనిచేస్తున్నారో, వారి రికార్డు ఏమిటో, వారి విద్యార్హతు ఏమిటో పరిశీలించిందీ లేదు. ఏ కాలేజీలో ఏ సబ్జెక్టుకు ఎవరు పనిచేస్తున్నారో, ఎంతకాంగా పనిచేస్తున్నారో, వారికి జీతభత్యాు ఎంత చెల్లిస్తున్నారో వంటి రికార్డును ఎన్నడూ ఏ జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికారీ పరిశీలించకపోవడం గమనార్హం. ఏ అధికారి ఎన్నడు ఏ కాలేజీలో తనిఖీ చేశారో ఆయా కాలేజీల్లో వీడియో ఫుటేజీు ఇవ్వాని విద్యార్థి సంఘా నేతు డిమాండ్‌ చేస్తున్నారు. కళ్లముందే లాంగ్‌టెర్మ్‌ పేరిట కాలేజీు నడుస్తున్నా అధికాయి పట్టించుకోవడం లేదు. పరీక్ష ముందు పది మందిని పంపండి అని కబురు చేస్తే కాలేజీు తమకు నచ్చిన వ్యక్తును పది మందిని పంపించి ప్రైవేటు కాలేజీు చేతు దుపుకుంటున్నాయి. రోజూ క్లాసు చెప్పే టీచర్లను కాదని, ల్యాబ్‌ల్లో పనిచేసేవారిని, లైబ్రరీల్లో పనిచేసేవారిని, ఆఫీసులో పనిచేసేవారిని పరీక్ష ఇన్విజిలేషన్‌కు, స్పాట్‌ వ్యాూయేషన్‌కు పంపుతున్నారు. దాంతో స్పాట్‌ వ్యాూయేషన్‌లోనూ అనేక అనర్ధాు జరుగుతున్నాయి. ఏ కాలేజీ తమ వద్ద పనిచేసే సిబ్బంది వివరాను ఏ పోర్టల్‌లోనూ అప్‌లోడ్‌ చేయకున్నా ఇంటర్‌బోర్డు కళ్లుమూసుకుని వ్యవహరించడం వెనుక పెద్ద ఎత్తున నిధు చేతు మారడమేననే ఆరోపణున్నాయి. తెంగాణలో కొత్తగా జిల్లాు ఏర్పడిన తర్వాత సరిహద్దు వివాదాు కూడా ఏర్పడ్డాయి. గతంలో ఆర్‌ఐఓు, జిల్లా విద్యాశాఖ వొకేషనల్‌ అధికాయి ఉండేవారు. ఇపుడు రెండు పోస్టుూ కలిపి జిల్లా ఇంటర్‌ విద్యాశాఖాధికాయిగా మార్చేశారు. అంటే జిల్లాకు ఒక అధికారి మాత్రమే పర్యవేక్షణకు మిగిలారు. వీరికి తోడు ఆర్‌జేడీు ఉన్నా వారి పర్యవేక్షణ ఆఫీసుకే పరిమితం అవుతోంది. రికార్డును డిఐఈఓ కార్యాయాకు తీసుకువెళ్తే కాలేజీను తనిఖీ చేసినట్టు సంతకాు చేసి పంపిస్తున్న వైనం ఇటీవ బట్టబయలైంది.పాఠశా విద్యలో సమీపంలోని గెజిటెడ్‌ హెడ్మాస్టర్లు, ఎంఈఓు, డీవైఈఓు, డీఈఓు, ఆర్‌జేడీ వ్యవస్థ ఉన్నా జూనియర్‌ కాలేజీకు మాత్రం జిల్లా ఇంటర్‌ విద్యాధికారుకే పరిమితం కావడంతో తనిఖీు మృగ్యమయ్యాయి. దాంతో కార్పొరేట్‌ కాలేజీు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పరిమితికి మించి అడ్మిషన్లు, అడ్డూఅదుపూ లేకుండా ఫీజు వసూు చేస్తున్నా, బోర్డు నిబంధనను ఉ్లంఘించి కోచింగ్‌ కేంద్రాు నిర్వహిస్తున్నా, ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌ కేంద్రాు నడుపుతున్నా, లాంగ్‌టెర్మ్‌ కోచింగ్‌ కేంద్రాు నడుపుతున్నా అధికాయి మాత్రం మౌనం వహిస్తున్నారు.
 ఇంత జరుగుతున్నా అనుమతి లేకుండా ఇవన్నీ ఎందుకు నిర్వహిస్తున్నారని అడిగే నాధుడే ఇంటర్‌ బోర్డులో లేకపోవడం విచిత్రం. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీు, 558 ప్రభుత్వ ఆధీనంలోని గురుకు కాలేజీు, 1699 ప్రైవేటు కాలేజీున్నాయి. ఇందులో 405 ప్రభుత్వ కాలేజీకు, 492 గురుకు కాలేజీకు, 361 ప్రైవేటు కాలేజీకు గుర్తింపు ఉంది, 66 గురుకులాకు, 1338 ప్రైవేటు కాలేజీకు అనుబంధ గుర్తింపు మంజూరు కావల్సి ఉంది. నిబంధను పాటించే ప్రతి కాలేజీకి అనుబంధ గుర్తింపు జారీ చేస్తామని బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. చాలా కాలేజీు ఎఫ్‌డీఆర్‌ రెన్యూవల్‌ చేయకపోవడం, అగ్నిమాపక శాఖ సురక్షిత ధ్రువీకరణ ఇవ్వకపోవడం, లీజు డీడ్‌ లేకపోవడం, భవన నిర్మాణ పటిష్టతపై ధ్రువపత్రం లేకపోవడం, శానిటరీ సర్ట్ఫికెట్‌, టీచింగ్‌ స్ట్ఫా వివరాు లేకపోవడం, అనుబంధ గుర్తింపు రుసుం చెల్లించకపోవడం, ఆటస్థలాు లేకపోవడం వంటి కారణాలే ఎక్కువగా ఉన్నాయని, దాంతో అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోందని బోర్డు కార్యదర్శి వివరించారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈ నె 4 నుంచి 18 వరకు పరీక్షు నిర్వహించనున్నారు. మొదటి, రెండో సంవత్సరం కలిపి 9 క్ష 65 వే 839 మంది విద్యార్థు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1,339 పరీక్ష కేంద్రాు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని ఇంటర్‌ బోర్డు అధికాయి స్పష్టం చేశారు.
ఇంటర్మీడియట్‌ పరీక్షకు అధికాయి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 4 నుంచి 18 తేదీ వరకు పరీక్షు జరగనున్నాయి. ఉదయం 9 గంట నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థును 15 నిమిషా ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 క్ష 65 వే 839 మంది విద్యార్థు ఇంటర్‌ ఎగ్జామ్స్‌ రాయనున్నారు. మొదటి సంవత్సరం 4,75,832 మంది హాజరు కానుండగా 5,00,799 మంది సెకండియర్‌ విద్యార్థు పరీక్ష పరీక్షు రాయనున్నారు. పరీక్ష కోసం అధికాయి 1,339 పరీక్ష కేంద్రాకు.. 1,339 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌ ను నియమించారు. పరీక్ష నిర్వహణలో 25,550 మంది ఇన్విజిలేటర్లు పాల్గొంటారు. ఇక పరీక్షా కేంద్రాల్లో నిమిషం నిబంధన కొనసాగుతుందని తెలిపింది ఇంటర్‌ బోర్డు. ఒక్క నిమిషం ఆస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. విద్యార్థు ఎగ్జామ్‌ సెంటర్‌లోకి ఎలాంటి ఎక్ట్రానిక్‌ పరికరాను తీసుకు రావొద్దని సూచించారుకాలేజీల్లో ఫీజ నియంత్రణ ఇంటర్‌ బోర్డుకు పట్టడం లేదు. రకరకా పేర్లతో రూ. క్ష నుంచి మొదుకొని రూ. 3 క్ష వరకు వసూు చేస్తున్నా అధికాయి పట్టించుకోవడం లేదు. వాటిని నియంత్రించేందుకు చర్యు చేపట్టడం లేదు. 10`20 మంది టాప్‌ ర్యాంకర్లను ఎరగా చూసి విద్యా వ్యాపారం చేస్తున్నాయి. ఫీజు చెల్లించడంలో ఆస్యమైతే విద్యార్థును టీసీ ఇచ్చి పంపేస్తున్నాయి. ఆమధ్య అవినాష్‌ కాలేజీలో ఫీజు చెల్లించలేదన్న సాకుతో వేధిస్తున్నారంటూ దీపక్‌ అనే విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాయడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.