నోటి తొందర పనికిరాదు

మానస సరోవరంలో ఉండే హంసను భూమ్మీద చూసిన వాళ్లు దాన్ని కొంగ అనుకొని రాళ్లు రువ్వుతూ ఉంటారు తప్ప.. అది హంస అని, దానికి పా నుంచి నీటిని వేరుచేసే మహత్తర గుణం ఉందని తొసుకోరు. అలాగే మహాత్ము గొప్ప గుణా గురించి తొసుకోలేక చాలా మంది బాధిస్తారు’ అంటాడు కబీర్‌దాసు. గొప్ప ఆధ్యాత్మికవేత్తు సమాజంలో ఉంటూ నీతినియమాకు లోబడి   నడుచుకుంటారు. అలాంటి వారిని చూసి అజ్ఞాను నవ్వుకుంటారే కానీ, వారిని అర్థం చేసుకోలేరు. స్వామి వివేకానంద ఒకసారి మండువేసవిలో రాజస్థాన్‌ జైపూరు నుంచి రౖుె బండిలో ప్రయాణం చేస్తున్నారు. ఆయనకు ఎదురుగా ఓ ధనవంతుడు కూడా కూర్చొని ఉన్నాడు. ఆయన అదే పనిగా స్వామిని చూస్తూ ‘‘కాషాయ దుస్తు ధరించి సన్యాసుగా మారడం కంటే కాయకష్టం చేసుకొంటూ హాయిగా బతుకొచ్చుకదా..
అవున్లే, కాషాయ గుడ్డు ఏ కష్టం చేయకుండా అన్నీ ఉచితంగా తెచ్చిపెడ్తాయి. శ్రమపడడం ఎందుకులే’’ అని ఎగతాళిగా మాట్లాడాడు. వివేకానందుడు మాత్రం ఏమీ విననట్టుగా కిటికీ నుంచి బయటకు చూస్తున్నారు. రౖుె ఆగిన ప్రతిచోటా ఏవో తినుబండారాు కొనుక్కుంటూ స్వామీజీని చూస్తూ తింటున్నాడా ధనవంతుడు. కాసేపాగిన తర్వాత.. ‘‘సాధూ మహరాజ్‌కు ఎవ్వరూ డబ్బివ్వకపోవచ్చు! ఫర్వాలేదు’’ అంటూ తను తింటున్న పదార్థాన్ని స్వామీజీ ముందుంచి ‘‘తీసుకోండి’’ అంటూ సైగ చేశాడు.  వివేకానందుడు మాత్రం ఉుకూ పుకూ లేకుండా అలాగే కిటికీ నుంచి బయటకు చూస్తున్నారు. తాను దిగాల్సిన స్టేషన్‌ రాగానే నెమ్మదిగా దిగిన స్వామి.. దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చుందామని అటుగా వెళ్లారు. అప్పుడు స్టేషన్‌ మాస్టర్‌ ఆయన్ను ఉద్దేశించి.. ‘దూరంగా వెళ్లి కూర్చో’ అని గద్దించాడు. ఆ మాటకు స్వామీజీ బాధపడకుండా మండుటెండలోనే సుఖాసనంలో ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ ధనవంతుడు కూడా అదే స్టేషన్‌లో దిగి వివేకానందుడు కూర్చునే ప్రయత్నం చేసిన చెట్టు కిందే కూర్చొని ఆయన్ని చూడటం ప్రారంభించాడు. ఇంతలో ఒక నడివయసు వ్యక్తి పరుగుపరుగున అక్కడికి చేరుకుని తన చెమటను తడుచుకుంటూ..
‘అయ్యా క్షమించండి. ఆస్యమైంది. కాళ్లూచేతు కడుక్కురండి. మీకోసం భోజనం తెచ్చాను’ అన్నాడు. ఆయన మాటు విన్న వివేకానందుడు నెమ్మదిగా ‘‘మీరెవరో నాకు తెలియదు. నన్ను చూసి మీకు కావసినవాణ్ని అనుకొని పొరబడుతున్నారు. దయచేసి మీవారెక్కడున్నారో వెతికి వారికి ఈ భోజనం పెట్టండి’’ అంటూ లేచి నిబడ్డారు. దానికా వ్యక్తి.. ‘‘లేదు స్వామీ. మీ కోసమే తెచ్చాను’’ అంటూ ఇలా చెప్పసాగాడు. ‘‘నేను భోజనం చేసి మధ్యాహ్నం ఇలా కాస్త నడుంవాల్చానో లేదో నాకో క వచ్చింది. కలో శ్రీరామచంద్రుడు కనిపించి మిమ్ముల్ని చూపుతూ, నా భక్తుడు ఆకలితో అమటిస్తున్నాడు. వెళ్లి ఆహారం ఇచ్చి రా అన్నాడు. దాంతో మెకువ వచ్చి పగటికలే అనుకొని మళ్లీ పడుకున్నాను. మ్లుకర్రతో పొడిచినట్టనిపించింది. నీక్కాదా చెబుతోంది అన్న పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే లేచి వంట చేయించుకొని పట్టుకొచ్చాను’’ అని చెప్పి ‘‘ఇక లేవండి స్వామి బాగా పొద్దుపోయింది’’ అంటూ చెట్టు నీడలో కూర్చోబెట్టి ప్రేమతో వడ్డించాడు. ఇదంతా చూసిన ఆ ధనవంతుడు పరుగు పరుగున వచ్చి వివేకానందుడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. మహాత్ము జీవితాల్లో ఇలాంటి ఘటను ఎన్నో. కాబట్టి తొందరపడి ఎవరి మీదా మాట తూకూడదు.