కమలంతో కళ్యాణం…

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తాయి: పవన్‌కళ్యాణ్‌

  • -చిన్నచిన్న సమస్యలు ఉన్నా పరిష్కరించుకుంటాం
  • -వైసీపీ, టీడీపీ వైఫల్యాలను ఎండగడతాం
  • -రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు
  • -ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉంది
  • -ఇంత పెద్ద రాజధాని అవసరం లేదని ఆనాడే చెప్పాను
  • -తృతీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు
  • -రాజధాని తరలిస్తే చూస్తూ ఊరుకోం
  • -మీడియా సమావేశంలో స్పష్టంచేసిన పవన్‌కళ్యాణ్‌

విజయవాడ:


రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై భాజపా పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో భాజపా నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. భాజపాతో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు. తెదేపా, వైకాపా ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.
అంతరాలను తొలగించుకున్నాం
రాష్ట్ర భవిష్యత్తు, ప్రయోజనాల కోసం భాజపాతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ అంశంపై భాజపా పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చానని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో భాజపా నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మాట్లాడారు. భాజపాతో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నామన్నారు. తెదేపా, వైకాపా ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ ధీమా వ్యక్తం చేశారు.
అవసరం ఉన్న ప్రతిచోటా కలిసి పనిచేస్తాం
”ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు పాలెగాళ్ల రాజ్యం.. అంతకుముందు అవకతవకలు, అవినీతితో కూడిన పరిపాలన. ప్రజలు తతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. దాన్నే భాజపా-జనసేన అందించబోతున్నాయి. ఈ కలయిక అండగా నిలబడిన ప్రధాని మోదీ, అమిత్‌షాకు ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. ఏపీలోనే కాకుండా అవసరమున్న ప్రతిచోటా మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా పనిచేయాలని వారికి హామీ ఇచ్చారు. రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. స్థానిక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపాతో కలిసే వెళ్తాం” అని పవన్‌ ఆయన వివరించారు.
రాజధాని తరలిస్తే చూస్తూ ఊరుకోం
”గతంలో రాజకీయంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. ఇప్పుడు ఏకపక్షంగా తరలిస్తారని అనుకోను. కులతత్వం, కుటుంబపాలనతో నిండిన రాజకీయ వ్యవస్థను మా కూటమితో ప్రక్షాళన చేస్తాం. అంతపెద్ద రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పా. 33వేల ఎకరాలు ఎందుకని అడిగా. ఇప్పుడు అవే అనుమానాలు నిజమయ్యాయి.. రైతులు రోడ్డున పడ్డారు. రాజధానిని తరలిస్తే రోడ్లపైకి రావడమే కాదు.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. అమరావతిని తరలిస్తే చూస్తూ కూర్చోము.. తెగించే నాయకత్వం ఉంది” అన్నారు.
మిగతా ఏ పార్టీలతోనూ సంబంధాల్లేవ్‌: జీవీఎల్‌

ఏపీ రాజకీయాల్లో ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం జరిగిందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయడంలో రెండు పార్టీల కలయిక శుభ పరిణామంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జనసేనతో తప్ప ఏ ఇతర పార్టీలతోనూ భాజపాకు రాజకీయ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వచ్చే నాలుగున్నరేళ్లపాటు ప్రజా సమస్యలపై పోటీ చేసి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతామన్నారు. భాజపాతో కలిసి పనిచేయాలని నిర్ణయించినందుకు పవన్‌కు జీవీఎల్‌ అభినందలు చెప్పారు. ఏపీలో అద్భుత రాజకీయ ఫలితాలు స ష్టించగలమని..అభివ ద్ధినే ఆధారంగా చేసుకుని ఈ కూటమిని ప్రజలు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దష్టిలో ఉంచుకుని తమతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఎలాంటి షరతుల్లేకుండా తమతో కలిసి పనిచేయడానికి పెద్దమనసుతో ఆయన ముందుకొచ్చినందుకు పవన్‌ను ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో రెండు పార్టీల కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరు పార్టీల నేతలు చర్చలు జరిపారు. అనంతరం జనసేన, భాజపా నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివ ద్ధి చెందాలన్నా, సామాజిక న్యాయం సాధించాలన్నా భాజపా-జనసేనతోనే సాధ్యమన్నారు. రెండు పార్టీలూ 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియంతత్వ ధోరణి, గతంలో ఉన్న తెదేపా ప్రభుత్వ అవినీతిపైనా కలిసి పోరాడాలని నిర్ణయించామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో అవినీతి రహిత అభివద్ధే లక్ష్యంగా తమ రెండు పార్టీలు కలిశాయన్నారు.
ఢిల్లీ పర్యటన అనంతరం కాకినాడలో పర్యటించిన సమయంలో జనసేన అధినేత పవన్‌… ఒక్కసారిగా స్వరం మార్చారు. కేంద్రంతీరుపై సానుకూలంగా స్పందించారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, మహిళలపై దాడులను కేంద్రానికి వివరించానన్నారు. ఏ ఆశయాలతోనైతే ప్రధాని ముందుకెళ్తున్నారో… ఆ ఆశయాలు ఏపీలో కనిపించట్లేదన్నారు పవన్‌.
రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల దష్ట్యా కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏపీలో జరిగే అన్ని కార్యక్రమాలను ఉమ్మడిగానే చేయాలనే అవగాహనకు వచ్చింది.
పవన్‌ ఢిల్లీ టూర్‌
ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్‌ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశంలో ఇదే అంశాన్ని చర్చించారు. రెండు పార్టీల బలాలు, బలహీనతలపై చర్చించుకున్న తర్వాత ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఇద్దరూ సీరియస్‌గానే చర్చించుకున్నారు. అమరావతి అంశం ప్రధానంగా ఇద్దరి మధ్యా చర్చకు వచ్చినట్లు సమాచారం.
2014లో బీజేపీ, టీడీపీలకు జనసేన అండ
జనసేన అధినేత పవన్‌ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు అండగా నిలిచారు. వారి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. అప్పట్లో ఆ రెండు పార్టీలు లబ్ధి పొందాయి. అటు బీజేపీ అగ్రనేతలతో, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ పవన్‌కు మంచి సంబంధాలున్నాయి. 2014 ఎన్నికల తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం సమయంలో రైతుల నుంచి భూముల్ని ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తీసుకుంటున్న చంద్రబాబు విధానాన్ని పవన్‌ తప్పుబట్టారు.
2019లో ఒంటరిగా పోటీ
రైతులకు అండగా నిలవడానికి ఆ సమయంలో రాజధాని ప్రాంతంలో రైతులతో సమావేశం కూడా నిర్వహించారు. తరుచూ రెండు పార్టీల మీద విమర్శలు చేస్తూ…. వారికి పూర్తిగా దూరమయ్యారు పవన్‌. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఒకే ఒక్క ఎమ్మేల్యే స్థానాన్ని దక్కించుకుంది. పవన్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా ఇపుడు జనసేనకు దూరంగా ఉంటున్నారు.
ఒంటరిగా సాధ్యం కాదనే
వైసీపీలో చేరడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు తెలుగుదేశం పైనా, ఇటు జనసేన పైనా వైసీపీ విమర్శల దాడులు పెంచింది. మరో వైపు రాజధాని అంశం ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో ఒంటరి పోరాటం సాధ్యం కాదని పవన్‌ భావిస్తున్నారట. బీజేపీ అండ ఉంటేనే పరిస్థితులు చక్కబడతాయిని అనుకుంటున్నారట. అందుకే బీజేపీ నేతల్ని నేరుగా కలిసి మంతనాలు జరిపారు. ఇరువురి భేటీపై నేడు స్పష్టం రావడం గమనార్హం.
ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పరిణామాల పైనే పవన్‌ ముఖ్యంగా ఫోకస్‌ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాతనే తన కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసారు. అదే సమయంలో పాలనా వ్యవహారాలు మొత్తం ఒకే చోట ఉండాలని డిమాండ్‌ చేసారు. దీంతో పాటుగా అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తానని..వారికి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని పవన్‌ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్‌ బీజేపీ నేతలను ఎవరిని కలిసారనేది మాత్రం అధికారికంగా బయటకు పార్టీ నేతలు చెప్పటం లేదు. ఆరెస్సెస్‌ ప్రముఖులతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. ఆ చర్చల సారాంశం..ఏపీలో జనసేన..బీజేపీ మధ్య పొత్తు అంశంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో..పవన్‌ ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత దీని పైన అధికారికంగా పొత్తు వ్యవహారం పైన క్లారిటీ ..భవిష్యత్‌ కార్యాచరణ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య చీలిపోతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు.
జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఈ మేరకు ఏపీ బీజేపీ నేతలు సంకేతాలు కూడా ఇచ్చారు.
అయితే ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే అని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే అని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.
అయితే ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ తీసుకున్న నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే అని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.
జనసేనతో కలిసి మళ్లీ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాలని భావిస్తున్న చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే పరిణామమే అని పలువురు చర్చించుకుంటున్నారు. జనసేనతో కలిసి మళ్లీ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాలని భావిస్తున్న చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే పరిణామమే అని పలువురు చర్చించుకుంటున్నారు.
జనసేనతో కలిసి మళ్లీ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాలని భావిస్తున్న చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే పరిణామమే అని పలువురు చర్చించుకుంటున్నారు.